loader

గౌతమి మెరుపు హాఫ్ సెంచరీ.. భారీ లక్ష్యాన్ని గుజరాత్‌ ఛేదించేనా..!

డబ్ల్యూపీఎల్‌లో అజేయంగా దూసుకెళ్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వడదోరలోనూ భారీ స్కోర్ చేసింది. అలాఅనీ ఈసారి ఓపెర్లు దంచేయలేదు. అయినా సరే ఆ జట్టు 178 పరుగులు చేసిందంటే గౌతమి నాయక్(73) చలవే. పవర్‌ఫుల్ షాట్లతో అలరించిన గౌతమి.. మిడిల్ ఓవర్లలో దూకుడుగా ఆడి భారీ స్కోర్‌కు బాటలు వేసింది. ఆఖర్లో రీచా ఘోష్‌(27), రాధా యాదవ్(17)ల విధ్వంసంతో గుజరాత్‌కు 179 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఆర్సీబీ.

ఎన్నికలప్పుడే గుర్తుకొస్తామా?’.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీస్తున్న మహిళలు..!

మహబూబాబాద్‌ ఎమ్మెల్యే మురళీ నాయక్ కు నిరసన సెగ తగిలింది. ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తువస్తామా? అని స్థానిక మహిళలు ఎమ్మెల్యేను నిలదీశారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 16వ వార్డులో సోమవారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే మురళీ నాయక్ వెళ్లారు. రెండేళ్లుగా తమను పట్టించుకోని ఎమ్మెల్యే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభివృద్ధి పనులంటూ రావడంతో స్థానికులు నిరసన తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని మా దగ్గరికి వస్తారా’ అంటూ ఎమ్మెల్యేపై మహిళలు విరుచుకుపడ్డారు

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు

తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు టాప్ గేర్‌లోకి వెళ్లింది. ఈ కేసులో ఇప్పటికే BRS మాజీ MLAలు జైపాల్‌యాదవ్, చిరుమర్తి లింగయ్యను విచారించారు సిట్ అధికారులు. ఇప్పుడు లేటెస్ట్‌గా బీఆర్ఎస్‌ ముఖ్యనేత, మాజీమంత్రి హరీష్‌రావుకు నోటీసులు ఇవ్వడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్పీని ఇటీవలే సుప్రీం కోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు సుప్రీం […]

ప్రవాస తెలుగు వారంతా రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు కావాలి – జ్యూరిచ్‌లో లోకేష్ పిలుపు

అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు అని, ఆయన విజన్ సాధన కోసం తామంతా అహర్నిశలు కృషి చేస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్‌లో నిర్వహించిన యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్న టీం-11 తీరుపై లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేలను ఆయన ఇలా సెటైరిక్ గా చెప్పారు. ఇన్వెస్టర్లు ఏపీకి రావద్దంటూ ఈ-మెయిల్స్ పంపే […]

భారీ బాంబు పేలుడు.. ఏడుగురు మృతి.. 13 మందికిపైగా గాయాలు!

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో సుమారు ఏడుగురు మరణించగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. అయితే పెద్ద పెద్ద కార్యాలయ భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, రాయబార కార్యాలయాలు ఉన్న వాణిజ్య షహర్-ఎ-నావ్ పరిసరాల్లోని ఒక హోటల్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, షహర్-ఎ-నవ్ కాబూల్‌లోని అత్యంత సురక్షితమైన ప్రాంతాలలో ఒకటిగా పరిగణిస్తారు. గాయపడిన వారు కాబూల్‌లోని సర్జికల్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారని […]

ఖమ్మం లోక్‌సభ నుంచి నేనే పోటీ చేస్తా: రేణుకా చౌదరి

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి నేనే పోటీ చేస్తా&, నా గెలుపును బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అడ్డుకోగలరా ?” అని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు,  రేణుకా చౌదరి ప్రశ్నించారు.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘విబి జి రామ్ జి’గా మార్పు చేయడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం తెలిపారు. మహిళలు ఎటువంటి దుస్తులు ధరించాలన్నది చెప్పేందుకు ఎవరికీ అధికారం లేదన్నారు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛపై పిచ్చిగా ఎవరు […]

భార్యకు విడాకులు ఇవ్వబోతున్న అఖిలేష్ సోదరుడు ప్రతీక్… ఆమెపై సంచలన ఆరోపణలు

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సోదరుడు, పార్టీ వ్యవస్థాపకులు దివంగత ములాయం సింగ్ కుమారుడు ప్రతీక్ యాదవ్ తన భార్య అపర్ణా యాదవ్‌కు విడాకులు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ‘‘ఈ స్వార్థపరురాలైన మహిళకు నేను వీలైనంత త్వరగా విడాకులు ఇవ్వబోతున్నాను’’ అని ప్రతీక్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అపర్ణపై తీవ్రమైన వ్యక్తిగత ఆరోపణలు చేశారు. ఆమె కుటుంబ సంబంధాలను దెబ్బతీసిందని ఆరోపించారు. అపర్ణ కేవలం ఆమె కీర్తి, పలుకుబడిపైనే దృష్టి పెట్టిందని ఆరోపణలు చేశారు

గుంటూరు జిల్లా కోర్టు సంచలన తీర్పు.. ఎస్ఐకు 10 ఏళ్లు జైలు శిక్ష..

గుంటూరు జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో రవితేజ అనే ఎస్ఐకు 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది. నగరపాలెం ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో రవితేజ మీద నర్సుగా పనిచేసే యువతి ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రవితేజ తనను ప్రేమ పేరుతో మోసం చేశారని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించారంటూ 2023లో ఓ యువతి ఎస్ఐ రవితేజ మీద కేసు పెట్టింది. రవితేజ ప్రస్తుతం అమృతలూరు పోలీస్ స్టేషన్‌లో […]

తొక్కిసలాట ఘటన.. విజయ్‌ను 6 గంటలపాటు ప్రశ్నించిన సిబిఐ

కరూర్‌ తొక్కిసలాట ఘటనలో హీరో, టివికె అధినేత విజయ్‌ను సిబిఐ రెండోసారి విచారించింది. సోమవారం ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరైన విజయ్‌ను అధికారులు దాదాపు 6 గంటలపాటు విజయ్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ నెల 12నే ఈ ఘటనకు సంబంధించి విచారణలో భాగంగా విజయ్‌ను సిబిఐ ఆరు గంటలకుపైగా ప్రశ్నించింది. ఈరోజు రెండోసారి విచారణ సందర్భంగా విజయ్ ను అనుమానుతుడిగా ప్రశ్నించిట్లు తెలుస్తోంది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్

మహిళల ప్రీమియర్ లీగ్-2026లో మరో ఆసక్తికర మ్యాచ్ వడోదర బిసిఎ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ జెయింట్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఆడిన నాలుగు మ్యాచుల్లో విజయం సాధించి.. ఆర్‌సిబి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఇక ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండు మ్యాచుల్లో గెలిచిన గుజరాత్ మూడోస్థానంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే అభిమానుల్లో […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON