‘మహా’ పోల్స్ డే.. మరాఠీ కార్డుతో ఠాక్రేలు, అభివృద్ధి ఎజెండాతో ఫడ్నవిస్
మహారాష్ట్ర పురపోరు కు సర్వం సిద్ధమైంది. బ్రిహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు గురువారంనాడు పోలింగ్ జరుగనుంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఈ కీలక ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విస్తృత ప్రచారం సాగించాయి. మహాయుతి కూటమి గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఈ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతుందని చెబుతుండగా, ఐక్యంగా బరిలోకి దిగిన ఠాక్రే సోదరులు సైతం గెలుపుపై ధీమాతో ఉన్నారు.

