చైనా మంజాపై.. సీపీ సజ్జనార్‌కు HRC నోటీసులు జారీ..
పతంగుల పండుగ వేళ నగరాన్ని వణికిస్తున్న చైనా మాంజా (సింథటిక్ దారం) వినియోగంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ప్రాణాంతకంగా మారిన ఈ దారం వాడకంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఈ మాంజా అమ్మకాలను, వినియోగాన్ని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న ఈ దారాన్ని నియంత్రించడంలో పోలీసుల వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.

