loader

పశ్చిమబెంగాల్‌లో రెండు నిఫా వైరస్ కేసులు

పశ్చిమ బెంగాల్‌లో రెండు నిఫా వైరస్ కేసులు బయటపడ్డాయి. ఐసిఎంఆర్ లోని వైరస్ రీసెర్చి అండ్ డయాగ్నస్టిక్ లేబొరేటరీలో ఈ కేసులను నిన్న ( జనవరి 11) కనుగొన్నారు. జంతువుల నుంచి సంక్రమించే ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపించే ప్రాణాంతకం కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ’(హెల్త్ ), లతో కేంద్ర హెల్త్ సెక్రటరీ పరిస్థితిని సమీక్షించారు. వేగంగా నివారణ చర్యలు చేపట్టడంలో సమన్వయం వహిస్తామని భరోసా ఇచ్చారు. […]

సంక్రాంతి వేళ చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి కానుక… గురుదక్షిణతో తెలంగాణకు దెబ్బ

ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని, విచారణ అర్హత లేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం – నల్లమల సాగర్ కు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. సంక్రాంతి పండుగ వేళ రేవంత్ చంద్రబాబుకు ఇచ్చిన గిఫ్ట్.. సుప్రీం కోర్టులో వేసిన ఈ బలహీనమైన రిట్టు.’అని మాజీమంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు.

ట్రాన్సిట్ వీసా అవసరం లేదు.. భారతీయులకు జర్మనీ శుభవార్త..

భారతీయులకు జర్మనీ తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. జర్మనీ మీదుగా ప్రయాణించే భారతీయులు గతంలో ట్రాన్సిట్ వీసాను తీసుకోవాల్సి వచ్చేది. ఈ నిబంధన నుంచి భారతీయులకు తాజాగా జర్మనీ మినహాయింపు ఇచ్చింది. దీంతో, భారతీయులకు అంతర్జాతీయ ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి. దరఖాస్తులు చేసుకోవడం, వీసా కోసం వేచి చూడటం వంటి ఇక్కట్ల నుంచి విముక్తి లభించింది. భారతీయులకు వీసా ఫ్రీ ట్రాన్సిట్ సదుపాయాన్ని కల్పించినందుకు జర్మనీ ఛాన్సలర్‌కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.

50 ఏళ్ల డంప్‌యార్డ్‌లో అద్భుతం.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

చెన్నైలోని పెరుంగుడి డంప్‌యార్డ్‌ను బయో మైనింగ్ ద్వారా అత్యాధునిక ఫర్నిచర్‌గా మార్చిన తీరుకు మంత్రముగ్ధులైన ఆనంద్ మహీంద్రా ఈ ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 50 ఏళ్లుగా చెత్త కొండగా ఉన్న పెరుంగుడి డంప్‌యార్డ్ ప్రాంతం ఇప్పుడు అందమైన ఫర్నిచర్‌గా ఎలా మారిందో వివరిస్తూ.. భారతదేశ వ్యర్థాల సమస్యకు ఇది ఒక గొప్ప పరిష్కారమని ఆనంద్ మహీంద్రా కొనియాడారు. చెన్నై నగరం వ్యర్థాల నుంచి సంపద సృష్టించడంలో ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.

భారీ అగ్నిప్రమాదం.. 30 ఇళ్లు దగ్ధం..

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం సారలంకలో ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి దాదాపు 30 ఇళ్లు దగ్ధమయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే స్పందించి.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక శకటాలు.. ఘటనా స్థలానికి చేరుకునే సరికే ఇళ్లన్ని పూర్తిగా కాలిపోయాయి. దాంతో పలు కుటుంబాలకు చెందిన ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ మంటల్లో సంక్రాంతి పండగ కోసం తెచ్చుకున్న దుస్తులు, కొత్త వస్తువులు సైతం కాలిపోయాయి. పండగ వేళ ఇలాంటి పరిస్థితి […]

ప్రభుత్వ అజెండాగా రోడ్డు ప్రమాదాల నివారణ: సిఎం

‘అరైవ్ అలైవ్’ రోడ్ సేఫ్టీ ప్రచార కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ట్రాఫిక్ ఉల్లంఘనల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. చలానాలు వేయకుండానే నియంత్రణ చర్యలు చేపట్టాలి. చలానా మొత్తం వాహన యజమాని నుంచి వసూలు చేసేలా చూడాలి. తప్పని పరిస్థితుల్లో చలానా వేయాలి.. డిస్కౌంట్లు ఇవ్వాలి. మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కూడా కేసులు పెట్టాలి. రోడ్డు ప్రమాదాల నివారణను ప్రభుత్వం అజెండాగా తీసుకోబోతోంది’’ అని అన్నారు.

పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌

సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైండని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. రైతులకు రైతుభరోసా ఇయ్యలేదని, కనీసం యూరియా బస్తాలు కూడా ఇయ్యడం లేదని, ఆసరా పెన్షన్‌లను పెంచుతానని చెప్పి పెంచలేదని, మహిళలకు రూ.2,500 ఇయ్యలేదని రేవంత్‌ తీరును తప్పుపట్టారు. మహబూబ్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కతరని చెప్పారు.

కరూర్‌ తొక్కిసలాట కేసు.. ముగిసిన విజయ్‌ సిబిఐ విచారణ

తమిళనాడులో తీవ్ర విషాదం మిగిల్చిన కరూర్‌ తొక్కిసలాట కేసులో టీవీకే చీఫ్‌, నటుడు విజయ్‌ సిబిఐ విచారణ ముగిసింది. విచారణ కోసం సోమవారం విజయ్, ఢిల్లీలోని సిబిఐ కార్యాలయానికి వెళ్లారు. దాదాపు ఆరు గంటలపాటు సిబిఐ ఆయనను ప్రశ్నించింది. విచారణ అనంతరం ఆయన తిరిగి వెళ్లిపోయారు.ఇప్పటికే తమిళగ వెట్రి కజగం (టీవీకే) కు చెందిన పలువురు ఆఫీసు బేరర్లను సిబిఐ అధికారులు ప్రశ్నించారు. దీంతో ఈ కేసులో సిబిఐ.. చార్జిషీటు దాఖలు చేసే అవకాశం ఉంది.

‘ఏఐ’ సాంకేతికతతో నిజమైన ఓటర్లకు తిప్పలు- సీఈసీకి సీఎం మమత మరో లేఖ!

బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘంపై మరోసారి విమర్శలు గుప్పించారు. “ఎన్నికల సంఘం 2002 నాటి ఓటర్ల జాబితాను డిజిటలైజ్ చేసింది. ఇందుకోసం ‘ఏఐ టూల్స్’ వినియోగించింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఏఐ చేసిన తప్పుల వల్ల అర్హులైన, నిజమైన ఓటర్ల వివరాల్లో భారీగా తేడాలు వచ్చాయి. ఆ తప్పులను సాకుగా చూపి, అసలైన ఓటర్లను కూడా ‘లాజికల్ డిస్క్రిపెన్సీస్’ జాబితాలో చేర్చారు. దీనివల్ల లక్షలాది మంది సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు […]

కాశ్మీర్ లో పోలీసుల కీలక ఆపరేషన్.. తొలిసారి మసీదుల్లో తనిఖీలు..

జమ్మూ-కాశ్మీర్ లో పోలీసులు కీలకమైన ఆపరేషన్ మొదలుపెట్టారు. తీవ్రవాదానికి అడ్డాగా మారిన ఈ ప్రాంతంలో మసీదుల్ని జల్లెడ పడుతున్నారు. ప్రతి మసీదుకు వెళ్లి, పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం నాలుగు పేజీల ఫాంలు రెడీ చేశారు. మసీదుల్లో ఉండే ప్రతి ఒక్కరూ ఈ డాక్యుమెంట్ నింపాల్సి ఉంటుంది. మసీదు పెద్దతోపాటు, ప్రార్థనలు చేయించే వారు, సేవా కార్యక్రమాలు చూసే వారితోపాటు అక్కడికి వచ్చే వారి సంఖ్య, వారి పేర్లు, ఇతర వివరాల్ని కూడా నమోదు చేసుకుంటున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON