loader

పవనన్న జిజ్ఞాస అద్భుతం.. ఆయన తపన యువతకు స్ఫూర్తి: నారా లోకేష్

పవనన్న జిజ్ఞాస అద్భుతం.. ఆయన తపన నేటి తరానికి స్ఫూర్తి అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ” పవన్ కళ్యాణ్ గారికి మనః పూర్వక అభినందనలు. పురాతన జపనీస్ కత్తిసాము కళ ‘కెంజుట్సు’లో అధికారికంగా ప్రవేశం పొందిన పవనన్న జిజ్ఞాస అద్భుతం. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, ఎంత విజ్ఞానం సంపాదించినా ఇంకా కొత్త అంశాలు నేర్చుకోవాలనే పవనన్న తపన నేటి తరానికి స్ఫూర్తి.” అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.

అల్లరి మూకలు సమాజాన్ని నాశనం చేస్తున్నాయన్న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్​

ఇరాన్​ అంతటా నిరసనలు విస్తరిస్తున్న నేపథ్యంలో​ అధ్యక్షుడు పెజెష్కియాన్​ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసనకారుల వాదనలు వినేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే కొంతమంది అల్లరి మూకలు మొత్తం సమాజాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అదే విధంగా ఇరాన్​లో జరుగుతున్న నిరసనల్లో ఇప్పటివరకు దాదాపు 203మంది చనిపోయినట్లు వార్త కథనాలు వెలువడ్డాయి. మృతుల్లో 162 మంది నిరసనకారులు ఉండగా, 41 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయ క్రికెట్లో 28 వేల పరుగులు పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 28,000 పరుగులు పూర్తి చేశాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. వడోదరలో జరిగిన భారత్- న్యూజిలాండ్ మొదటి వన్డే మ్యాచ్‌లో 25 పరుగులు చేయడంతో కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అత్యంత వేగంగా 28 వేల అంతర్జాతీయ పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ విషయంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు.. విరాట్ కోహ్లీ, సచిన్‌ కంటే 20 ఇన్నింగ్స్‌లు తక్కువ సమయంలోనే […]

జమ్మూకశ్మీర్‌లో డ్రోన్ల కలకలం.. నియంత్రణ రేఖ వద్ద దాడులు

జమ్మూకాశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం రేగింది. నౌషెరా సెక్టార్‌లో నియంత్రణ రేఖ సమీపంలో ఆదివారం సాయంత్రం పాకిస్తాన్ డ్రోన్‌పై భారత సైన్యం కాల్పులు జరిపింది. ఈ దాడుల్లో మరిన్ని డ్రోన్‌లను గుర్తించినట్లు భారత భద్రతా బలగాలు ధృవీకరించాయి. డ్రోన్లు తుపాకులు లేదా మాదకద్రవ్యాలను జారవిడిచాయా? అని తనిఖీ చేయడానికి సైన్యం ఆ ప్రాంతంలో పరిశీలిస్తోంది. శనివారం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ వైపు నుండి వచ్చిన డ్రోన్ సాంబా సెక్టార్‌లో ఆయుధాల సముదాయాన్ని జారవిడిచింది. మెషిన్ గన్లు డ్రోన్లను […]

కోహ్లీ, గిల్ విధ్వంసం.. కేఎల్ రాహుల్ మాస్ ఫినిషింగ్

2026 నూతన సంవత్సరాన్ని టీమిండియా విజయంతో ఘనంగా ప్రారంభించింది. బరోడా క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. 301 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు, ఆరంభంలో తడబడినప్పటికీ, సీనియర్ బ్యాటర్ల అనుభవం, యువ ఆటగాళ్ళ పోరాట పటిమతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది.

బాక్స్‌లోంచి బయటకొచ్చి నిలువెత్తు ఫొటోపై సంతకం.. భారత దిగ్గజాలకు వినూత్న సత్కారం..!

భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లకు వడోదరలో వినూత్న సన్మానం జరిగింది.సరికొత్తగా ఆలోచించిన బరోడా క్రికెట్ అసోసియేషన్ ‘రో-కో’ను ‘ఔట్ ఆఫ్ ది బాక్స్‌’ స్వాగతంతో ఆశ్చర్యపరిచింది. ఇద్దరూ బాక్స్ లోంచి బయటకు వచ్చి.. పూలగుత్తులను స్వీకరించారు.అనంతరం తమ నిలువెత్తు ఫొటోగ్రాఫ్‌ మీద విరాట్, హిట్‌మ్యాన్ సంతకాలు చేశారు.

శబరిమల బంగారం చోరీ వ్యవహారం.. పినరయి సర్కార్‌పై అమిత్‌షా నిప్పులు

సంచలనం సృష్టించిన శబరిమల బంగారం చోరీ వ్యవహారంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విమర్శలు గుప్పించారు. బంగారం మాయం కావడానికి బాధ్యులైన వారికి ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఆరోపించారు. ఈ ఘటన కేవలం కేరళకే పరమితం కాదని, దేశవ్యాప్తంగా ఉన్న భక్తులతో ముడిపడిన అంశమని చెప్పారు. కీలకమైన పుణ్యక్షేత్రంలోని విలువైన వస్తువులను కాపాడటంలో విఫలమైన ప్రభుత్వం ప్రజల మత విశ్వాసాలను ఎలా కాపాడుతుందని ప్రశ్నించారు.

చైనా మాంజా తగిలి.. ప్రాణాలతో బయటపడ్డ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

ఓ యువకుడు చైనా మాంజా బారిన పడి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి చైతన్య (27) చైనా మాంజా తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ మీదుగా హఫీజ్‌పేట్‌ వైపు తన బైకుపై వెళ్తుండగా.. ఒక్కసారిగా చైనా మాంజా అతడికి తగలడంతో.. చైతన్యకు భుజం నుంచి ఛాతి వరకు తీవ్ర గాయాలయ్యాయి. మాంజా ఛాతికి తగలడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. అదే గొంతుకు తగిలి ఉంటే ప్రాణాలు పోయేవని వైద్యులు తెలిపారు.

ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా భారత్​లో మాత్రం స్థిరత్వం : ప్రధాని మోదీ

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న సమయంలో భారత్​ రాజకీయ స్థిరత్వం, సుస్థిరతతో ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని అన్నారు. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా పయనిస్తుందని వెల్లడించారు. పరిశ్రమలకు సిద్ధంగా ఉన్న కార్మిక శక్తి అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం గుజరాత్​ కఛ్​లో ఏర్పాటు చేసిన వైబ్రెంట్​ గుజరాత్​ ప్రాంతీయ సదస్సును ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు.

పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం

టాలీవుడ్ స్టార్ హీరో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అరుదైన, ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన ‘కెంజుట్సు’లో అధికారికంగా ప్రవేశం పొందడం ద్వారా అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. మూడు దశాబ్దాలకు పైగా మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆయన అంకితభావానికి నిదర్శనంగా, ‘సోగో బుడో కన్‌రి కై’ నుంచి ఫిఫ్త్ డాన్ పురస్కారం, ‘టకెడా షింగెన్ క్లాన్’లో తొలి తెలుగు వ్యక్తిగా ప్రవేశం పొందారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON