డీక్లెర్క్ సిక్సర్ల మోత.. ఉత్కంఠ విజయంతో బోణీ కొట్టిన ఆర్సీబీ ..!
డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ ఆరంభ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదిరే విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో నడినే డీక్లెర్క్(63 నాటౌట్) సిక్సర్ల మోతతో ముంబై ఇండియన్స్‌కు పరాభవం తప్పలేదు. 65కే సగం వికెట్లు కోల్పోయిన ఆర్సీబీని ఆదుకున్న ఈ సఫారీ చిచ్చరపిడుగు.. ఆఖరి ఓవర్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో జట్టును ఒంటిచేత్తో గెలిపించింది. దాంతో.. ఓటమి ఖాయమనుకున్న మంధాన సేన అనూహ్యంగా 3 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.

