loader

సెమిస్టర్ ప్రశ్నపత్రాల లీకేజీ.. 35 మంది ఏఈవో అభ్యర్దుల ప్రవేశాలు రద్దు..!

జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో ప్రశ్నపత్రాల లీకేజీ కలకలం రేపింది. సెమిస్టర్ ప్రశ్నపత్రాలను లీక్ చేసిన వ్యవహారంలో నలుగురు సిబ్బందిపై వేటు వేశారు యూనివర్సిటీ అధికారులు. అంతేకాదు 35 మంది ఇన్ సర్వీస్ బీఎస్సీ అగ్రికల్చర్ అభ్యర్దుల ప్రవేశాలను సైతం రద్దు చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీపై సమగ్ర విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. 2025- 26 థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ప్రశ్నపత్రాలు లీక్ అయినట్టు, వాట్సప్‌తో ఇలతర వ్యవసాయ కళాశాలల విద్యార్ధులకు పంపినట్టు నిర్ధరణకు వచ్చారు.

అమెరికాలో డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టు.. ఇద్దరు భారతీయుల అరెస్ట్‌

అమెరికాలో భారీ డ్రగ్‌ రాకెట్‌ గుట్టురట్టయ్యింది. ఇండియానాలో ట్రక్కులో డ్రగ్స్‌ను స్మగ్లింగ్‌ చేస్తున్న ఇద్దరు భారతీయులను హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం అరెస్ట్‌ చేసింది. ట్రక్కులో 140 కిలోల కొకైన్‌ పట్టుబడడం సంచలనం రేపింది. గురుప్రీత్‌సింగ్‌ , జస్వీర్‌సింగ్‌లను అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. ఇద్దరు కూడా అమెరికాలో అక్రమంగా ఉన్నట్టు గుర్తించారు. రూ. 63.01 కోట్ల విలువైన 309 పౌండ్ల కొకైన్ రవాణా చేస్తూ ఈ ఇద్దరు పట్టుబడ్డారు.

జర్మనీ రాజధాని బెర్లిన్ లో పవర్ కట్.. రెండు రోజులుగా అంధకారంలోనే

జర్మనీ రాజధాని బెర్లిన్ రెండు రోజులుగా చీకట్లోనే మగ్గుతోంది. తీవ్ర బ్లాకౌట్ కారణంగా 2 రోజులుగా కరెంటు లేక అల్లాడుతోంది. విద్యుత్ సరఫరా చేసే కేబుళ్లను కొందరు కావాలనే కట్ చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు అనుమానిస్తున్నారు. పవర్ కట్ కారణంగా 45,000 ఇండ్లు, 1,120 సంస్థలు చీకట్లోనే ఉన్నాయి. అసలే శీతాకాలం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ రాజధానిలో ఇలా రెండు రోజులపాటు పవర్ కట్ కావడం ఇదే మొదటిసారి. మరోవైపు

మహిళల శక్తి నాకు తెలుసు – ఆన్‌లైన్‌లో పొదుపు సంఘాలకు రుణాలు: చంద్రబాబు

ఆన్‌లైన్‌లోనే పొదుపు సంఘాలు రుణాలు తీసుకునే సదుపాయం వస్తుంది. నా మాట విన్న కుటుంబాలు ఇప్పుడు బాగుపడ్డాయి, ఏడాదిలో లక్షమంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని సీఎం చంద్రబాబు అన్నారు.గుంటూరులో నిర్వహిస్తున్న జాతీయ సరస్‌ మేళాలో  ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం స్వయంగా పరిశీలించారు. ఒక స్టాల్‌లో ఏర్పాటు చేసిన మాడుగుల హల్వా రుచి చూసి టేస్ట్‌ బాగుందని నిర్వాహకులను అభినందించారు. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను సీఎం ఆసక్తిగా తిలకించారు.

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులపై వైఎస్‌ జగన్‌ మొసలి కన్నీరు : ఏపీ మంత్రి పార్థసారథి

మంత్రి పార్థసారథి మీడియా సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులపై వైఎస్‌ జగన్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అని జగన్‌ వ్యాఖ్యనించడాన్ని తప్పుబట్టారు. ఐదేండ్ల పాటు ఏపీకి రాజధాని లేకుండా చేసిన ఆయనకు మాట్లాడే అర్హత లేదని తెలిపారు. ఇంకా అమరావతి మీద విషం చిమ్మడం అనేది సరైనది కాదని అన్నారు. ఎంఎస్‌ఎంఈ సూక్ష్మ,మధ్య తరహ ఎంటర్‌ప్రైనర్‌లో పార్కుల ఏర్పాటకు అవసరమయ్యే రూ.250 కోట్ల మంజూరుకు కేబినేట్‌ ఆమోదం తెలిపిందన్నారు.

మేడారం జాతరకు కెసిఆర్‌ను ఆహ్వానించిన మంత్రులు

జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర జరగనుంది. ఈ మహాజాతరకు సర్కార్ పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రముఖులకు మేడారం మహా జాతర ఆహ్వాన పత్రికలను అధికారికంగా అందజేశారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను సర్కార్ ఆహ్వానించింది. గురువారం మంత్రులు సీతక్క, కొండా సురేఖలు.. ఎర్రవల్లిలోని కెసిఆర్ నివాసానికి చేరుకుని ఆయనను కలిశారు. మేడారం జాతరకు రావాలని […]

తమిళనాడు ఎన్నికలు.. బీజేపీ-ఏఐఏడీఎంకే మధ్య సీట్లు ఖరారు..?

త్వరలోనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు పొత్తులు, సీట్ల కోసం అప్పుడే కసరత్తు ప్రారంభించాయి. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా, ఏఐఏడీఎంకే కీలక నేత పళనిస్వామి మధ్య సీట్ల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి పోటీ చేయబోయే సీట్లు, మంత్రి పదవుల విషయంలో అమిత్ షా ఆచితూచి అడుగులేస్తున్నారు. అక్కడ మొత్తం 234 అసెంబ్లీ సీట్లకుగాను, 56 సీట్లు కావాలని అమిత్ షా.. […]

నిరుద్యోగులు ప్రశ్నిస్తే అరెస్టులు..సీఎం రేవంత్‌ రెడ్డిపై హరీష్‌ రావు ధ్వజం

నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లపై రేవంత్ సర్కారు సాగిస్తున్న దమన కాండపై మాజీ మంత్రి హరీష్‌ రావు తీవ్రంగా మండిపడ్డారు. నిన్న దిల్‍సుఖ్‍నగర్, నేడు అశోక్ నగర్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై పోలీసులు క్రూరంగా విరుచుకుపడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిరుద్యోగులు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నవు. నెలల తరబడి విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతూ కాలం వెళ్లదీస్తున్నవని సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు

మగవాళ్ళ మూడ్..నటి వివాదాస్పద పోస్ట్..నెటిజన్ల ఆగ్రహం.

వీధుల్లో తిరిగే కుక్కలను చూసి వీధి కుక్కల మూడ్ ను ఎవరు అర్థం చేసుకోలేరు” అన్న సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై రమ్య తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ చేశారు. ‘మరి మగవాళ్ల మైండ్ ను కూడా చదవలేం. వాళ్ళు ఎప్పుడు లైంగికదాడి చేస్తారో.. ఎప్పుడు హత్య చేస్తారో తెలియదు. కాబట్టి వాళ్లందరినీ జైలులో పెట్టాలా?’ అని ఇన్స్టాలో ఓ పోస్టు చేశారు. దీంతో కుక్కలతో పోలుస్తావా? అంటూ కొందరు పురుషులు నటి రమ్యపై భగ్గుమంటున్నారు. […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON