loader

‘హుక్ స్టెప్’లతో ఊపేసిన మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి ‘ మన శంకర వరప్రసాద్ గారు ‘. ప్రీరిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసిన ‘హుక్ స్టెప్’ సాంగ్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. భీమ్స్ కంపోజ్ చేసిన ఈ డ్యాన్స్ నంబర్ కి చిరంజీవి తన హుక్ స్టెప్పులతో అదరగొట్టారు. వింటేజ్ మెగాస్టార్ ని గుర్తు చేశారు. ‘హుక్ స్టెప్’ పాటని సింగర్ బాబా సెహగల్ పాడారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత చిరంజీవి కోసం పాట పాడారు. రామజోగయ్య శాస్త్రి ఈ […]

రాజాసాబ్ టికెట్ ధరలు భారీగా పెంపు- AP లో

రాజాసాబ్ నిర్మాతల  విజ్ఞప్తి  మేరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ఎపి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  జనవరి 8న ప్రీమియర్ షోకు టికెట్ ధర రూ.1,000గా నిర్ణయించారు. స్పెషల్ షోకు కూడా అనుమతి ఇచ్చింది. ఇక, జనవరి 9వ తేదీ  నుంచి 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.150, మల్టీప్లెక్సుల్లో రూ.200 పెంచుకోవడానికి అనుమతిస్తూ ఎపి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, తెలంగాణలోనూ ఈమూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు చిత్ర నిర్మాతలు […]

రష్యా అడ్డుకున్నా.. వెనెజువెలా చమురు నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా

వెనెజువెలా చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించిన అమెరికారెండు వారాలుగా వెనెజువెలాకు చెందిన చమురునౌకను  స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది. అక్కడికి ప్రత్యేక నౌకను పంపింది. కానీ, సముద్ర జలాల్లో ఆటుపోట్ల కారణంగా స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాలేదు. ఇదే క్రమంలో రష్యా ఆ నౌకకు మద్దతుగా సబ్ మెరైన్, యుద్ధ నౌకను మోహరించింది. అయినప్పటికీ అమెరికా ఆ నౌకను ఐస్ లాండ్ తీరంలో స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది.

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్… భద్రతా బలగాల ఉచ్చులో ముగ్గురు టెర్రరిస్టులు

జమ్మూకశ్మీర్‌ లోని కథువా జిల్లాలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. బిలావర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమద్ నల్లా సమీపంలో ఒక టెర్రరిస్టును స్థానికులు గుర్తించారు. ధన్ను పరోల్ వద్ద కూడా ఉదయం అతన్ని చూసినట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో అదనపు బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి.ఎస్‌ఓజీతో పాటు సీఆర్‌పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్టు జమ్మూ ఐజీపీ భీమ్ సేన్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో […]

ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు

తమిళనాడు ఊటీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మనవాడ సమీపంలో ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారికి అక్కడే స్థానికంగా ఉన్న పలాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఊదగై మెడికల్ కాలేజీకి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు […]

కళాశాలలో ప్రిన్సిపల్‌పై ఫిర్యాదు జిల్లా అధికారి విచారణ

అల్లాదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్‌, అధ్యాపకుల మధ్య ఏర్పడిన విభేదాలపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) మాధవి బుధవారం విచారణ నిర్వహించారు. ఇకపై కళాశాలలో ఇలాంటి సంఘటనలు జరగకుండా క్రమశిక్షణ పాటించాలని, తప్పిదాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కళాశాల ప్రిన్సిపాల్ సత్తయ్య తమను అకారణంగా వేధిస్తున్నారని అధ్యాపకుడు శంకర్ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుకు మద్దతుగా కొందరు గ్రామస్తులు కళాశాల వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

విజయ్ చివరి సినిమాకి సెన్సార్ అడ్డంకులు.. ‘జన నాయకుడు’

‘జన నాయగన్‌’ సినిమా గత డిసెంబరులోనే సెన్సార్ బోర్డుకు వెళ్లగా.. కొన్ని సన్నివేశాలు, సంభాషణలపై అభ్యంతరాలతో సెన్సార్ సభ్యులు సూచించిన మార్పులు చేసి, మళ్లీ బోర్డుకు సమర్పించారట. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా సెన్సార్‌ బోర్డు నుంచి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో కేవీఎన్‌ ప్రొడక్షన్‌ తరఫున మద్రాసు హైకోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్‌ దాఖలైంది. దీనిపైనే బుధవారం వాదనలు జరిగాయి. తీర్పును జనవరి 9వ తేదీ ఉదయానికి రిజర్వ్ చేయడంతో, ఆ రోజు రిలీజయ్యే అవకాశాలు […]

‘బ్లడ్ మాఫియా’పై కేంద్రం సీరియస్

మూగజీవాల రక్తాన్ని సేకరిస్తున్న బ్లడ్ మాఫియా వ్యవహారాన్ని కేంద్రం సీరియస్‌గా పరిగణించింది. కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కాచిగూడలోని సిఎన్‌కె ఇంపోర్టు అండ్ ఎక్స్‌పోర్టు కంపెనీలో నగర పోలీసులతో కలిసి తనిఖీలను నిర్వహించింది. సుమారు వెయ్యి లీటర్ల మూగజీవాల రక్తానికి సంబంధించి నిల్వఉంచిన ప్యాకెట్లను సీజ్ చేశారు. రక్తం ప్యాకెట్లను హరియానాలోని పాలీ మెడిక్యూర్ కంపెనీకి పంపిస్తున్నట్లుగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. అయితే, ఈ మూగ జీవాల రక్తంతో ఏం చేస్తున్నారన్న […]

రూ. లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ నందిగామ మండల అధికారులు

రంగారెడ్డి జిల్లాలోని నందిగామ మండలానికి చెందిన ఇద్దరు మండల పరిషత్‌ అధికారులు, ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇండ్ల నిర్మాణం కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. కార్యదర్శి ఎంపీవో వైద్యవత్‌ తేజ్‌ సింగ్, ఎంపీడీవో పొన్న సుమతితో చర్చలు జరిపి రెండున్నర లక్షలు బాధితుడి నుంచి డిమాండ్‌ చేశారు. బుధవారం ముగ్గురు లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులు ముగ్గురిని రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON