loader

కొండగట్టులో గిరి ప్రదక్షిణ… తాజాగా రోడ్డును పరిశీలించిన కలెక్టర్

కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనలో ఇక్కడ గిరి ప్రదక్షిణ వసతికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. తాజాగా కొండగట్టు గిరిప్రదక్షిణ కొరకు రోడ్డు పరిశీలన జరిగింది. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సోమవారం కొండగట్టులో పర్యటించారు. అరుణాచలం, సింహాచలం తరహాలో గిరిప్రదక్షిణ ఏర్పాట్ల కు ప్రణాళిక చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. ఇందుకుగాను దాదాపు 40 ఫీట్ల రోడ్డు వెడల్పు పనులు, విద్యుత్ దీపాలు, అంచనా వ్యయాల గురించి ప్రభుత్వానికి […]

నటి పూనమ్‌ కౌర్‌ మొదటిసారి బయటకు వచ్చింది. ఆమె కామెంట్స్ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి.

ఆ యాక్టర్‌ తన భార్యాపిల్లల వద్దకు వెళ్లాలనుకున్నప్పుడు ఆ డైరెక్టర్‌ వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడు. అందరు భార్యల విషయంలో ఇదే చేశాడు. అందరు నన్ను, ఆయన్ని అబ్యూస్‌ చేశారు. నా లైఫ్‌ని నాశనం చేసిన వ్యక్తిని గురువుగా భావిస్తారా? ఒక గురువు స్నేహితుడి జీవితాన్ని అలా చేస్తారా? ఇదంతా  డబ్బు కోసమే చేశారు` అని సంచలన ఆరోపణలు చేసింది ఒక నటుడికి వ్యతిరేకంగా మాట్లాడాలని అలా మాట్లాడకపోతే తన న్యూడ్‌ వీడియోలు మార్కెట్‌లో విడుదల చేస్తామని కడప నుంచి […]

హైకోర్టును ఆశ్రయించిన రాజాసాబ్, మనశంకర వర ప్రసాద్ నిర్మాతలు..!

సంక్రాంతికి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన ‘మన శంకరవరప్రసాద్’, ‘రాజా సాబ్’ చిత్రాల ప్రత్యేక షోల అనుమతి కోసం నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ మంగళవారు ఈ రెండు సినిమాల ప్రొడ్యూసర్స్ అప్పీల్ చేశారు. సింగిల్ జడ్డి ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని, టికెట్ ధర పెంపు, ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వాలని తమ అప్పీల్‌ను అత్యవసర పిటిషన్ కింద విచారణకు స్వీకరించాలని కోరారు. నిర్మాతల అప్పీల్‌పై బుధవారం హైకోర్టు విచారించనుంది.

నాకు నేనుగా లొంగిపోలేదు: పీఎల్‌జీఏ చీఫ్ బర్సే దేవా

ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కీలక నేత బర్సే దేవా పలు కీలక విషయాలను వెల్లడించారు నాకు నేనుగా తెలంగాణా పోలీసుల ముందు లొంగిపోలేదు. ఒక పనిమీద బయటకు వెళుతుంటే.. పోలీసులు పట్టుకున్నారు. దీంతో లొంగిపోవాల్సి వచ్చింది. మావోయిస్టు పార్టీ ఈ మధ్య ఉనికి కోల్పోయిందని తాను భావించానని దేవా తెలిపారు. టవర్ వెపన్స్, హెలికాప్టర్ షాట్ వెపన్స్‌ను పోలీసుల నుంచే తీసుకెళ్లామని ఆయన చెప్పారు. అడవుల్లో ఉన్న మరికొందరు మావోయిస్టులపై తాను ఎలాంటి కామెంట్స్ చేయనని […]

బ్యాంకింగ్‌ రంగంలో AI ప్రకంపనలు.. ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలు మాయం!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) రాకతో దాదాపు అన్ని రంగాలు ప్రభావితం అవుతున్నాయి. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్‌లో మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం, బ్యాంకులు AI వినియోగాన్ని పెంచుతున్నాయి. అదే సమయంలో ఫిజికల్‌ బ్రాంచ్ నెట్‌వర్క్‌ను తగ్గించడం కొనసాగిస్తున్నాయి. 2026 నుంచి పెద్ద మొత్తంలో బ్యాంక్‌ ఉద్యోగాలు కోల్పోవచ్చని పేర్కొంది. రాబోయే ఐదు సంవత్సరాలలో 200,000 కంటే ఎక్కువ బ్యాంకింగ్ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్ అంచనా వేసింది.

నోబెల్ గ్రహీత అమర్తసేన్‌కు ‘సర్’ నోటీసులా?

కేంద్ర ఎన్నికల సంఘంపై తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ విమర్శలు గుప్పించారు. SIR విచారణకు హాజరు కావాలని, నోబెల్ గ్రహీత అమర్తసేన్‌కు నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు. ఇప్పటికే టీమ్ ఇండియా పేసర్ మహమ్మద్ షమీ, తృణమూల్ కాంగ్రెస్‌ఎంపీ, నటుడు దేవ్‌కు కూడా ఈసీ నోటీసులు ఇవ్వడాన్ని ఆయన ప్రస్తావించారు. అమర్తసేన్‌ ఒక నోబెల్ గ్రహీత, దేశం గర్వించదగ్గ, ఆయనను విచారణకు ఎలా పిలుస్తారు? బెంగాల్ ప్రజలను బీజేపీ ఈసీ లక్షంగా చేసుకున్నాయి. ” అని అభిషేక్ […]

బ్లోఔట్‌ క్యాపింగ్‌కు మరో వారం పడుతుంది: జిల్లా కలెక్టర్

రుసుమండ బ్లోఔట్‌లో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు ఓఎన్‌జీసీ సిబ్బందితోపాటు జిల్లా అధికారులు నిరంతరాయంగా పని చేస్తున్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఇరుసుమండ బ్లోఔట్‌కు క్యాపింగ్ చేయటానికి మరో వారం రోజుల సమయం పడుతుందన్నారు. అయితే ఈ మంటల కారణంగా ఇప్పటివరకు ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణం నష్టం కానీ జరగలేదని చెప్పారు. సుమారు 80 నుంచి 100 కొబ్బరి చెట్లు 2 ఎకరాల పంట భూమికి […]

డ్రగ్స్‌ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ రకుల్‌ సోదరుడు

డ్రగ్స్‌ కేసులో హీరోయిన్ రకుల్‌ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌ ప్రీత్ సింగ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. డ్రగ్స్‌ పెడ్లర్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ.. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ అమన్.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసులో అమన్‌ ప్రీత్‌ సింగ్‌ ఏ7గా ఉన్నాడు. గతేడాది డిసెంబర్ లో ఈగల్ టీమ్ కు పట్టబడిన డ్రగ్స్‌ పెడ్లర్స్‌తో అమన్ కు సంబంధాలు ఉన్నాయని  వారి నుంచి అమన్ పలుసార్లు డ్రగ్స్ […]

అమెరికాలో పుంజుకున్న ప్రభాస్ ‘ది రాజా సాబ్’ అడ్వాన్స్ బుకింగులు

ట్రేడ్ అనలిస్టుల సమాచారం ప్రకారం ఇప్పటివరకు ‘రాజా సాబ్’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఇప్పటివరకు 6 లక్షల డాలర్లు దాటి వసూలు చేసింది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను ప్రత్యాంగీరా సినిమాస్ సుమారు 18 నుంచి 20 కోట్ల మధ్య దక్కించుకుందని సమాచారం. అంటే బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 2.8 నుండి 3 మిలియన్ డాలర్ల వసూలు చేయాల్సి ఉంది. ఈ లెక్కన చూస్తే ఈ సినిమాకు బిజినెస్ పరంగా రిస్క్ కొంచెం తక్కువగానే […]

కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కసితో ఎదురుచూస్తున్నారు… కేటీఆర్

తెలంగాణ సాధించిన కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కసితో ఎదురుచూస్తున్నారని అన్నారు. జనగామ జిల్లాలో ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన సభలో కేటీఆర్ మాట్లాడుతూ… మూటలు మోసుడు తప్ప రేవంత్ రెడ్డి ఏం తెల్వదని విమర్శించారు. తెలంగాణను 60 సంవత్సరాల పాటు రాచిరంపాన పెట్టిన కాంగ్రెస్ పార్టీ అనే విషయం మర్చిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని అన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON