loader

TCC షెడ్యూల్ విడుదల, NETS–2026 ఫలితాలు విడుదల

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (TCC Exams) పరీక్షల తేదీలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్షలను జనవరి 10 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ (NETS)–2026 పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఈ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు NTA వెల్లడించింది.

పిల్లల్ని కనకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు..నవనీత్ రాణాకు ఒవైసీ కౌంటర్

కొందరు వ్యక్తులు పిల్లలను ఎక్కువగా కని హిందుస్థాన్‌ను పాకిస్థాన్‌గా మార్చాలని చూస్తున్నారని..  నవనీత్ రాణా చేసిన వ్యాఖ్యలకు ఒవైసీ సమాధానమిచ్చారు. తనకు ఆరుగురు సంతానం ఉన్నారని.. మీరు నలుగురు పిల్లలను కనకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారని ప్రశ్నించారు. మీకు ఇష్టమైతే 8 మందిని కనండి..  మాకేం అభ్యంతరం లేదని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో ఇద్దరు  కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారు పంచాయతీ లేదా  స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే నిబంధన ఉందని ఈ సందర్భంగా ఒవైసీ గుర్తు చేశారు.

సిద్దిపేటలో జూనియర్ డాక్టర్ ఆత్మ హత్య

సిద్దిపేటలో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య కలకలం రేపింది. సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న లావణ్య ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజులుగా వ్యక్తిగత కారణాలు, తీవ్ర ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఐవీ ఇంజెక్షన్ ద్వారా గడ్డి మందును ఎక్కించుకున్నారు. తోటి జూనియర్ డాక్టర్లు గమనించి వెంటనే సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం […]

జనసేన పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరికీ అవకాశాలు వస్తాయి…: నాగబాబు

జనసేన పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ అవకాశాలు వస్తాయని ఎన్ఆర్ఐ జనసేన శ్రేణులతో సోమవారం జరిగిన వర్చువల్ సమావేశంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. కూటమిలో సర్దుబాటు కోసం కొంతమందికి త్యాగాలు చేయాల్సిన బాధ్యత ఉంటుందని, దానికి తాను కూడా ఒక ఉదాహరణ అని, పార్టీ కోసం పని చేసే ప్రతీ ఒక్కరికీ కొద్దిగా ఆలస్యం అయినా తప్పనిసరిగా అవకాశాలు వస్తాయని చెప్పారు.  కూటమి కలయిక సుదీర్ఘ కాలం ఉండాలని ప్రజలు […]

ఏపీ సర్కార్.. ఆ సమస్య పరిష్కారానికి ‘రెవెన్యూ క్లినిక్’

జిల్లా కలెక్టరేట్లలో ప్రతివారం నిర్వహించే గ్రీవెన్స్‌డేలో వచ్చే అర్జీల్లో అధికశాతం భూముల సమస్యలపైనే ఉంటున్నాయి. ప్రజలు పడుతున్న ఈ ఇబ్బందులను పరిష్కరించేందుకు రెవెన్యూ క్లినిక్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ఈ రెవెన్యూ క్లినిక్‌ పనిచేస్తుంది. రెవెన్యూ క్లినిక్‌లో రెవెన్యూ అధికారులతో పాటు జిల్లాలోని తహసీల్దార్లు అందుబాటులో ఉంటారు. ప్రజల నుండి పట్టాదారు పాస్‌పుస్తకం, రీసర్వే వంటి 14 రకాల సమస్యలపై అర్జీలు స్వీకరించేందుకు ప్రత్యేక టేబుళ్లు అందుబాటులో ఉంటాయి.

బిసి హాస్టల్‌లో యాసిడ్ తాగిన యువతి..పరిస్థితి విషమం

నల్లగొండ జిల్లా కేంద్రంలోని బిసి హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ చదువుతున్న అనుముల మండలం, హజారి గూడెం గ్రామానికి చెందిన ఎర్రబోయిన హిమశ్రీ (19) అనే విద్యార్థిని సోమవారం యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. తెల్లవారుజామున హాస్టల్ ఆవరణలో ఉన్న బాత్రూంలు కడిగే యాసిడ్‌ను సేవించి రూమ్ లోకి వచ్చి వాంతులు చేసుకుంది. గమనించిన తోటి విద్యార్థినులు చికిత్స కోసం నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సర్‌’కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తా: మమతా బెనర్జీ

రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కమిషన్ కొనసాగిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ ( సర్)కు వ్యతిరేకంగా మంగళవారం కోర్టుకు వెళ్తానని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ హెచ్చరించారు ఓటర్ల జాబితాల్లోంచి ఎలాంటి సరైన కారణాలు లేకుండా ఓటర్ల పేర్లను ఏకపక్ష నిర్ణయాలతో తొలగిస్తున్నారని , దీంతో సాధారణంగా జరగాల్సిన ఈ ప్రక్రియ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు భయాందోళనలకు దారి తీస్తోందని విమర్శించారు.

వాహనదారులకు కేంద్రం శుభవార్త.. సరికొత్త రూల్ ఫిబ్రవరి 1 నుండి అమలు

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కార్లు, జీపులు, వ్యాన్‌లకు సంబంధించిన ఫాస్టాగ్‌ల కోసం ‘నో యువర్ వెహికల్’ (KYV) ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ప్రకటించింది. ఈ కొత్త నిబంధన ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది. కొత్త ఫాస్టాగ్‌లకే కాకుండా, ఇప్పటికే జారీ చేసిన ఫాస్టాగ్‌లకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈ మార్పులతో వెరిఫికేషన్ బాధ్యత పూర్తిగా బ్యాంకులపైనే ఉంటుందని, వినియోగదారులకు ఇబ్బందులు లేని ప్రయాణ అనుభవాన్ని అందించడమే […]

బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి కాల్చివేత.. మూడు వారాల్లో ఐదో ఘటన

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై హత్యాకాండలు ఆగడం లేదు. సోమవారం సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో అందరూ చూస్తుండగానే మరో హిందూ యువకుడిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతను అక్కడికక్కడే మృతిచెందగా, దుండగులు పరారయ్యారు. బంగ్లాదేశ్‌లోని జస్సోర్ జిల్లా కేశబ్పూర్ ఉపజిల్లా వార్డు నెంబర్-17లోని కొపలియా బజార్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మృతుడు కేశబ్రూర్ ఉపజిల్లాలోని అరువా గ్రామానికి చెందిన రాణాప్రతాప్ (45)గా గుర్తించారు

సాహితీ ఇన్‌ఫ్రా స్కాం రూ. 3000 కోట్లుగా తేల్చిన సిసిఎస్ పోలీసులు

రియల్ ఎస్టేట్ పేరిట భారీ మోసానికి పాల్పడ్డ సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు నాలుగేళ్ల విచారణ అనంతరం మొత్తం రూ. 3000 కోట్ల రూపాయల స్కామ్‌గా దీనిని తేల్చారు. ‘ఫ్రీ లాంచ్ ఆఫర్’ పేరుతో అతి తక్కువ ధరకు ప్లాట్లు, ఫ్లాట్లు ఇస్తామంటూ వేలాది మంది కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశారు సాహితీ యాజమాన్యం. ఈ కేసులో మొత్తం 64 కేసులు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON