loader

ప్రపంచానికి అన్నపూర్ణగా..చైనాను దాటేసి వరల్డ్‌ నెంబర్‌ వన్‌గా భారత్‌!

భారతదేశం వ్యవసాయంలో మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. జనవరి 4న భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా అవతరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ప్రకటించారు. ఈ విషయంలో భారతదేశం చైనాను అధిగమించింది. దేశం మొత్తం వరి ఉత్పత్తి 150.18 మిలియన్ టన్నులకు చేరుకోగా, చైనా ఉత్పత్తి 145.28 మిలియన్ టన్నులుగా ఉంది. భారత్‌ ప్రపంచానికి అన్నపూర్ణగా మారింది. భారతదేశం ఇప్పుడు  పెద్ద మొత్తంలో బియ్యాన్ని ఎగుమతి చేస్తోందని, తగినంత ఆహార ధాన్యాల […]

ఫోన్ ట్యాపింగ్.. బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి నవీన్ రావు విచారించిన సిట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆదివారం బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి నవీన్ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారించింది. సుమారు ఏడు గంటలు నవీన్ రావును విచారించిన అధికారులు స్టేట్‌మెంట్‌ను నమోదు చేసుకున్నారు. ప్రత్యేక డివైజ్ లు ఉపయోగించి అప్పటి ప్రతి పక్ష నేతలు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయించారని, ప్రయివేట్ పరికరాలు ఎక్కడ కొనుగోలు చేశారు, వాటిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ […]

సంక్రాంతికి ఊరెళ్తున్నారా..? హైదరాబాద్ వాసులకు సీపీ సజ్జనర్‌ ప్రత్యేక విజ్ఞప్తి

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే నగరవాసులకు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ శ్రీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్ కీలక సూచనలు చేశారు. పండుగ వేళ చాలామంది కుటుంబ సమేతంగా ఊర్లకు వెళ్తుంటారని, ఇదే అదనుగా భావించి దొంగలు చోరీలకు పాల్పడే అవకాశముందని సీపీ పేర్కొన్నారు.నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచరాదని ప్రయాణానికి ముందే సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లోగానీ, బీట్‌ ఆఫీసర్‌కు గానీ సమాచారం ఇస్తే.. పెట్రోలింగ్‌లో భాగంగా సిబ్బంది ఆయా ఇళ్లపై ప్రత్యేక నిఘా […]

ఏపీలోని ఆ ఊర్లోకి రాజకీయ నేతలకు నో ఎంట్రీ.. ఏకంగా బోర్డే పాతేశారు..

కర్నూలు జిల్లాలోని పెద్ద హరివాణం కొత్త మండలంగా  ప్రకటించి పెద్ద హరివాణం మండలంలోకి 22 ఊర్లను కూడా కేటాయించింది. అయితే మెజారిటీ గ్రామాల ప్రజల పెద్ద హరివాణం మండల ఏర్పాటును అంగీకరించలేదు. 16 గ్రామాల ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. నిరసన దీక్షలు చేపట్టారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఆదోని మండలాన్ని, ఆదోని -1, ఆదోని -2గా విభజించింది. తాజాగా పెద్ద హరివాణం మండల కేంద్రం చేసేవరకూ ఏ రాజకీయ నాయకుడిని కూడా ఊర్లోకి రానివ్వకూడదని నిర్ణయించారు.ఆ […]

మేం భారత్​కు వెళ్లం- ICCకి బంగ్లాదేశ్ బోర్డు లేఖ

భారత్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్​కప్ కోసం తమ జట్టును ఇక్కడికి పంపేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిరాకరించింది. ఈ మేరకు తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. తమ జట్టు మ్యాచ్​లను భారత్​లో కాకుండా శ్రీలంకకు షిఫ్ట్ చేయాలని ఐసీసీకి అధికారికంగా లేఖ రాసినట్లు, భారత్​లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్యా బంగ్లాదేశ్ ప్లేయర్లను అక్కడికి పంపవద్దని ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు […]

ఐఏఎస్‌ అధికారి భార్య అనుమానస్పద మృతి.. కేసు నమోదు చేసిన పోలీసులు

విజయవాడలో ఐఏఎస్‌ అధికారి భార్య అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఐఏఎస్‌ అధికారి గుజ్జర కిషో‌ భార్య సత్యదీపిక గొంతుకు ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో గత నెల 31న ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె మరుసటి రోజు చికిత్స పొందుతూ మరణించారు. ఆమె మృతి పట్ల బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తూ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కిషోర్‌ కుమార్‌ ఏపీ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ కృష్ణా కెనాల్‌ పీడీగా […]

తమిళనాడు, బంగాల్​లో NDA విజయం ఖాయం : అమిత్​ షా

త్వరలో తమిళనాడు, బంగాల్​లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ కూటమి విజయం సాధిస్తుందని తమిళనాడులోని పుదుక్కోట్టైలో జరిగిన బీజేపీ ర్యాలీలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార డీఎంకే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ‘అవినీతి మంత్రుల సైన్యంతో రాష్ట్రం పురోగమించగలదా?’ అని అమిత్ షా ప్రశ్నించారు. డీఎంకే వంశపారంపర్య పాలనను శాశ్వతంగా కొనసాగించాలనే లక్ష్యంతో పనిచేస్తోందని, కానీ ఆ కల నెరవేరదని పేర్కొన్నారు.

బాలకార్మికుల విముక్తి కోసం ఆపరేషన్​ స్మైల్​

బడికి వెళ్లి బలపం పట్టాల్సిన పిల్లలు ఇటుక బట్టీలు, హోటళ్లు, కర్మాగారాల్లో కూలీలుగా, వీధుల్లో తిరుగుతూ యాచకులుగా మారుతున్నారు. పోలీసు శాఖ ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌ డివిజన్‌లలో బాల కార్మికులను గుర్తించడం కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ నెల 31వ తేదీ వరకు తనిఖీలు నిర్వహిస్తారు. బాల కార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడం, తల్లిదండ్రులకు అప్పగించడం, కౌన్సెలింగ్‌ నిర్వహించడం చేస్తుంటారు. ఇప్పటి వరకు రెండు డివిజన్లలో 453 బాల కార్మికులను గుర్తించి వారికి పనుల […]

నీటి పంపకాలపై త్వరలో స్పష్టత: సీఎం చంద్రబాబు

నీటి పంపకాల అంశానికి సంబంధించి అన్ని విషయాలను త్వరలోనే ప్రజలకు తెలియజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం పూర్తిగా అధ్యయనం చేసి, వివరంగా మాట్లాడుతామని ఆయన స్పష్టం చేశారు. నీటి వనరుల నిర్వహణలో రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను తన విన్నపం మేరకు ఆపించినట్టు చెప్పిన నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కోట వినుత డ్రైవర్‌ హత్యకేసులో మరో ట్విస్ట్.. ప్రకంపనలు సృష్టిస్తున్న వీడియో..!

కోట వినుత డ్రైవర్‌ రాయుడు హత్యకేసులో మరో ట్విస్ట్ నెలకొంది. వినుత భర్త  చంద్రబాబు విడుదల చేసిన వీడియో ప్రకంపనలు రేపుతోంది. ముందస్తు ప్రణాళికతోనే రాయుడు హత్య జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయుడు హత్య విషయం చెన్నై పోలీసుల కంటే ముందే.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ఎలా తెలిసిందని, రాయుడు రిలీజ్‌ చేసిన సెల్ఫీ వీడియోలో ఉన్న సమాచారం కొంతేనని.. తమ దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయని వినుత భర్త చంద్రబాబు తెలిపారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON