loader

తిరుమల క్యూలైన్‌లో ఇదేంపని.?.. శ్రీలీలపై నెట్టింట దుమారం..

తిరుమల క్యూలైన్ లో యువకుడు శ్రీలీలను వెనుకనుంచి ఫాలో అవుతు శ్రీలీల  కూడా క్యూలైన్ లో ఉన్న విషయం మర్చిపోయి పలు మార్లు ఆ కుర్రాడి వంక నవ్వుతూ చూడటం, అతను సైతం నటిని చూడటం జరిగింది. అతను కూడా శ్రీలీల వంక నవ్వుతూ అదేదో బైట మూవీథియేటర్లో లేదా షాపింగ్ మాల్స్ లో ఉన్న విధంగా ప్రవర్తించారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది.. స్వామివారి దర్శనాలకు వచ్చి ఇదెక్కడి పనులు […]

‘భీమవరం బీట్‌’ సాంగ్‌..సింగర్ స్మితతో కలిసి స్టెప్పులేసిన డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణంరాజు

తెలుగు పాప్ మ్యూజిక్ కి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన సింగర్ స్మిత . తాజాగా ‘భీమవరం బీట్‌’ వీడియో సాంగ్‌ ను రిలీజ్ చేశారు. భీమవరం బీట్‌’ పాటను ర్యాపర్‌ నోయల్‌ తో కలిసి స్మిత రూపొందించారు. ‘భీమవరం బీట్‌’ పాటలో ఇంకో స్పెషల్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ శాసనసభా డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణంరాజు సందడి చేశారు. స్మితతో కలిసి స్టెప్పులు వేసి అలరించారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

గాంధీనగర్లో కలుషిత నీరు కలకలం.. ఆస్పత్రికి బాధితుల క్యూ..

ఇండోర్ లో కలుషిత నీటి వల్ల పలువురు మృతి చెందిన ఘటన మరువక ముందే గుజరాత్ లోని గాంధీనగర్లో కూడా కలుషిత నీరు తాగి పలువురు అనారోగ్యం పాలయ్యారు. కలుషిత నీటి కారణంగా టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నాయి. అక్కడి సివిల్ హాస్పిటల్ లో వంద మందికి పైగా పిల్లలు, పలువురు పెద్దలు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కలుషిత నీరు తాగిన బాధితుల కోసం గాంధీ నగర్ సివిల్ హాస్పిటల్లో ప్రత్యేక వార్డునే ఏర్పాటు చేశారంటే పరిస్థతి ఎంత […]

బుద్ధుని పవిత్ర అవశేషాలు భారత వారసత్వంలో భాగాలు: మోడీ

బుధ్ధుని పవిత్ర అవశేషాలు కేవలం కళాఖండాలు మాత్రమే కాదని, భారత దేశ మహత్తర వారసత్వంలో భాగాలని ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. పిప్రహ్వా వద్ద బుధ్ధునికి సంబంధించిన పవిత్ర అవశేషాలైన ఎముక తునకలు, విలువైన రత్నాల ప్రదర్శనను శనివారం ఆయన ప్రారంభించారు. దక్షిణ ఢిల్లీలో కిలారై పితోరా కల్చరల్ కాంప్లెక్స్‌వద్ద ఈ ప్రదర్శన ఏర్పాటైంది. బౌద్ధ సంప్రదాయంపై పరిశోధన మరింత బలోపేతం అవుతుందన్నారు. భావితరాలకు బౌద్ధ సంప్రదాయం సహజమైన రీతిలో చేరేలా తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని హామీ […]

ఎవరైనా అలా ముస్లిం మహిళను తాకితే చెయ్యి నరికేస్తా: ఎఐఎంఐఎం నేత

ముస్లిం మహిళ ముఖంపై నుంచి హిజాబ్‌ను బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తొలగించడంపై తీవ్ర వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎఐఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ తీవ్ర హెచ్చరిక చేశారు. ఎవరైనా సరే దురుద్దేశంతో ముస్లిం మహిళను తాకడానికి ధైర్యం చేస్తే తాను చెయ్యినరికేస్తానని హెచ్చరించారు. మహారాష్ట్ర లోని జల్నా సిటీలో శుక్రవారం ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తాము సెక్యులర్ పార్టీలమని చెప్పుకునే కొంతమంది నేతలు గూండాలకు, నేరాల సంఘటనలపై అనుకూలత చూపిస్తూ […]

ప్రభుత్వ ఉద్యోగులకు.. కొత్త పెన్షన్ పథకం ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయుల రెండు దశాబ్దాల డిమాండ్‌ను తమిళనాడు ప్రభుత్వం నెరవేర్చింది. కొత్త పెన్షన్ పథకాన్ని సీఎం ఎంకే స్టాలిన్‌ శనివారం ప్రకటించారు. ‘తమిళనాడు అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్’ ద్వారా పాత పెన్షన్ పథకం ప్రయోజనాలు దక్కుతాయని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు చివరిగా తీసుకునే జీతంలో యాభై శాతం అష్యూర్డ్ పెన్షన్ వారికి లభిస్తుందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల 10 శాతం సహకారంతో పాటు పెన్షన్ నిధికి అవసరమైన మొత్తం అదనపు […]

అసెంబ్లీలో తేల్చుకుందాం రండి.. బీఆర్ఎస్ నేతలకు సీఎం సవాల్

బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభకు రాకుండా గులాబీ పార్టీ నేతలు తప్పించుకుతిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బహిరంగ సభల్లో మాట్లాడటం కాదని.. సభకు రండి నిజాలు ఏంటో తేలుద్దామని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని తమను కోరారని.. అయితే మీ బట్టలు ఊడదీస్తామని ఒకరు, తోలు తీస్తామని మరొకరు మాట్లాడారని.. సభకు వచ్చి చర్చలో పాల్గొంటే ఎవరి బట్టలు ఎవరు ఊడదీయాలో ప్రజలే తేల్చేవారని […]

వంద కోట్ల స్కామ్.. మమత ప్రభుత్వంపై బీజేపీ ఆరోపణ

పశ్చిమ బెంగాల్ లో అధికార టీఎంసీపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. మమతా బెనర్జీ ప్రభుత్వం రూ.100 కోట్ల స్కాంకు పాల్పడిందని ఆరోపించింది. పశ్చిమ బెంగాల్ లోని మాల్దా జిల్లాలో వరద బాధితులకు అందించాల్సిన సాయంలో  మమత ఆధ్వర్యంలోని టీఎంసీ ప్రభుత్వం రూ.100 కోట్ల అవినీతికి పాల్పడినట్లు  సోషల్ మీడియా వేదికగా బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు ఎక్స్ లో స్కాంకు సంబంధించి పలు వివరాల్ని బీజేపీ వెల్లడించింది. కోల్ కతా హైకోర్టుకు కాగ్ సమర్పించిన 700 పేజీల నివేదిక […]

‘నువ్వు గుర్తిస్తే ఎంత? – గుర్తించకపోతే ఎంత?’ – కేసీఆర్​పై మంత్రి ఆనం ఆగ్రహం

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​పై రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించే స్థాయి కేసీఆర్​కు లేదన్నారు. దేశంలోనే అత్యధిక పెట్టుబడులు తీసుకువచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పేరుగాంచిందని తెలిపారు. దక్షత కలిగిన పాలన చంద్రబాబు చేస్తున్నారని వెల్లడించారు. దేశ, విదేశాలు సైతం తమ నాయకుడిని హర్షిస్తుంటే కేసీఆర్​ మాత్రం విమర్శిస్తున్నారని మండిపడ్డారు. నువ్వు గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత అంటూ కేసీఆర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పుట్టుకతో అంధులుకు సాధారణ కంటి కంటే పవర్‌ఫుల్‌ చూపు!

కాలిఫోర్నియాకు చెందిన న్యూరోటెక్నాలజీ సంస్థ ఎలోన్ మస్క్ న్యూరాలింక్ అంధులకు శుభవార్త చెప్పింది. ‍ న్యూరాలింక్‌తో పుట్టుకతో అంధులైన వారికి సైతం 2026లో మొదటి మానవ పరీక్షలతో కళ్లు తెప్పించే దిశగా ప్రధాన చర్యలు తీసుకుంటోంది. దృష్టిని పునరుద్ధరించే లక్ష్యంతో న్యూరాలింక్ మెదడు చిప్ అయిన బ్లైండ్‌సైట్ సెప్టెంబర్ 2024లో US FDA నుండి ‘బ్రేక్‌త్రూ డివైజ్‌’ హోదాను పొందింది. 2026 ప్రారంభంలో న్యూరాలింక్ పూర్తిగా అంధులకు పరిమిత దృష్టిని అందించే లక్ష్యంతో బ్లైండ్‌సైట్ మొదటి మానవ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON