loader

హెచ్-1బి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

అమెరికా వీసా ఇంటర్వ్యూలలో ఏర్పడిన తీవ్ర ఆలస్యాల కారణంగా భారత్‌లోనే చిక్కుకుపోయిన తమ H-1B ఉద్యోగులకు అమెజాన్ సంస్థ ఊరటనిచ్చింది. వీసా సమస్యలతో మానసిక ఒత్తిడిలో ఉన్న సిబ్బందికి తాత్కాలిక వెసులుబాటు కల్పిస్తూ, మార్చి 2 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఈ నిర్ణయం వీసా ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగులు ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందకుండా ఉండేందుకు తీసుకున్న చర్యగా భావిస్తున్నారు.

తల్లిదండ్రుల వాట్సాప్‌నకు ఇంటర్ విద్యార్థుల హాల్ టికెట్లు

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది 2026 వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్ టికెట్లను వారి తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్లకు పంపనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థులు వారి పదో తరగతి హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని,సెకండ్ ఇయర్ విద్యార్థులు వారి మొదటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా హాల్ టికెట్ ప్రివ్యూను డౌన్‌లోడ్ చేసుకోవాలని.

రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

పోలీసు కేసు నుంచి పేరును తొలగించేందుకు బాధితుడి నుంచి ఎస్సై లంచం తీసుకుంటూ ఏసీబీకి అధికారులకు చిక్కాడు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని కొల్లూరు పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై ఎం రమేశ్‌ శుక్రవారం రూ.20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. 30 వేలకు గాను గత డిసెంబర్‌ నెలలో రూ.5 వేలు తీసుకున్న ఎస్సై శుక్రవారం మరో రూ.20 వేలు తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ఎస్సైను హైదరాబాద్‌ ఏసీబీ కోర్టులో […]

టెట్ ఎగ్జామ్ నిర్వహణకు సర్వం సిద్ధం..

తెలంగాణ టెట్ ఎగ్జామ్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. జనవరి 3 నుంచి జనవరి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 18 జిల్లాల్లో  97 కేంద్రాలలో టెట్ పరీక్షలు జరగనున్నాయి. పేపర్-1 కు మొత్తం 85,538 మంది అప్లై చేసుకోగా అందులో సర్వీసులో ఉన్న టీచర్లు 27,389 మంది, పేపర్-2 కు మొత్తం 1,52,216 మంది దరఖాస్తు చేయగా సర్వీసు టీచర్లు 44,281 మంది ఉన్నారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే 7093708883, […]

X గ్రోక్​లో అశ్లీల కంటెంట్​- వెంటనే తొలగించాలని కేంద్రం వార్నింగ్​

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన ఏఐ చాట్‌బాట్‌ గ్రోక్‌ మరోసారి వివాదంలో చిక్కుకుంది. మహిళల ఫొటోలను అశ్లీలంగా మార్చాలని ప్రాంప్ట్‌ ఇస్తే, గ్రోక్‌ వాటిని అశ్లీల చిత్రాలుగా మార్చుతుండటం వివాదాస్పదమవుతోంది. దీంతో మహిళల మార్ఫింగ్‌ ఫొటోలు సామాజికమాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆందోళన వ్యక్తం చేశారు.  అసభ్యకరమైన ట్రెండ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రికి ప్రియాంక చతుర్వేది విజ్ఞప్తి చేశారు. మరోవైపు గ్రోక్‌లో రిమూవ్‌ దిస్‌ పిక్చర్‌ పేరిట […]

ఐదు బిల్లులకు ఆమోదం తెలిపిన తెలంగాణ అసెంబ్లీ..

తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు శుక్రవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టగా.. శాసనసభ వాటికి ఆమోదం తెలిపింది. నగర పాలనలో మరింత పారదర్శకత కోసం తెలంగాణ మున్సిపాలిటీల నాలుగో సవరణ బిల్లుతో పాటు.. జీహెచ్‌ఎంసీకి సంబంధించిన రెండు సవరణ బిల్లులను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లును, మోటార్ వాహనాల పన్ను సవరణ బిల్లును ఆమోదించారు.

బంగ్లాదేశ్ పేసర్‌ను ఐపీఎల్ ఆడనిస్తారా?.. బీసీసీఐ ఏమన్నదంటే..?

బంగ్లాలో మైనార్టీలపై హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆ దేశంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ బంగ్లాదేశ్ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రెహ్మన్‌ను కొనడాన్ని తప్పు పడతున్నారు కొందరు. దాంతో ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌ను పంతొమ్మిదో సీజన్ ఆడనిస్తారా? లేదా? అనేది తెలియడం లేదు. బీసీసీఐ మాత్రం ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌లో ఆడించడంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని అంటోంది.

ఈసడించుకుంటే 10 రోజుల్లోనే మారతాడు…ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు

గరికపాటి నరసింహారావుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు యూట్యూబర్ అన్వేష్. అయితే అన్వేష్ వ్యాఖ్యలకు మహా సహస్రవధాని గరికపాటి నరసింహారావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేరస్థుడికి పది సంవత్సరాలు శిక్ష వేసినా మారుతాడో లేదో కానీ సమాజం ఛీ కొడితే మాత్రం మార్పు వస్తుంది అంటూ గరికపాటి నరసింహారావు పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అలా చేస్తే పదిరోజుల్లోనే మరుతాడని చెప్పుకొచ్చారు. ఎలాంటి మచ్చలేని వాళ్లపై ఇక్కడ బురద చల్లుతున్నారంటూ గరికపాటి నరసింహారావు మండిపడ్డారు.

శ్రీలంక సమీపంలో ఆవర్తనం… ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు

ప్రస్తుతం తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఇప్పటికే వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని… శ్రీలంక తీరానికి సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించింది. వీటి ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండగా ఏపీలో తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు.

కాల్వలో బోల్తాపడిన బస్సు.. విద్యార్థులకు గాయాలు..

ఖమ్మం జిల్లాలోని గణేశ్‌పాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్దులగూడెంలోని సుమారు వందమంది విద్యార్థులతో వెళ్తున్న వివేకానంద విద్యాలయం స్కూల్ బస్సు అదుపు తప్పి కాల్వలో బోల్తా పడింది. వేగంగా బస్సు నడపడంతో అదుపు తప్పి కాల్వలోకి పల్టీ కొట్టినట్లు.. స్థానికులు చెబుతున్నారు. కాల్వలో నీరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిది. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపాడని విద్యార్థులు తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON