చివరి టి20లోనూ భారత్ దే విజయం
న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన ఐదో, చివరి టి20లో ఆతిథ్య భారత జట్టు 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా 4-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. తర్వాత లక్ష ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది.

