
అన్నాడీఎంకేలోని అంతర్గత విభేదాలను పరిష్కరించడం బీజేపీకి ఇప్పుడు సవాలుగా మారింది. అన్నాడీఎంకేలోని మూడు వర్గాలను ఒకతాటిపైకి తీసుకొస్తేనే బలమైన డిఎంకెను కొట్టగలమని కమలనాథులు భావిస్తున్నారు. తద్వారా చల్లాచెదురైన అన్నాడీఎంకే ఓటు బ్యాంకును ఒకటి చేర్చి.. ఎలాగైనా తమిళనాడులో అధికార పగ్గాలు సొంతం చేసుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. బిజెపితో ఒప్పందాలు జరుగుతున్నాయని తెలిసిన వెంటనే అన్నాడీఎంకే కూటమి నుంచి ముస్లిం మైనారిటీ పార్టీ అయిన ఎస్డిపిఐ బయటకు వచ్చింది. ఆ వెంటనే డిఎంకెను కూడా కలిసి మద్దతు ప్రకటించింది.