loader

దేశాభివృద్ధి పట్ల మన నిబద్ధతను బలోపేతం చేద్దాం: రాష్ట్రపతి

కొత్త సంవత్సరం 2026సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశాభివృద్ధి,సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణకు మన నిబద్ధత మరింత బలోపేతం చేద్దామని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు. పునరుత్పాదక శక్తికి,సానుకూల మార్పుకు కొత్త సంవత్సరం సంకేతం అవుతుందన్నారు. ఆత్మ పరిశీలనకు, తాజా నిర్ణయాలకు ఇదొక అవకాశమని వివరించారు. మన జీవితాల్లో కొత్త సంవత్సరం ఆనందం, పురోభివృద్ధి, ఆనందం అందించగలదని ఆశిస్తున్నట్టు చెప్పారు.

రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వ పాలన మరిచిపోలేని విజయాలను అందించింది. ఎన్నో మైలురాళ్లను చేరుకుంది. అనేక సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు 2025 ఏడాది నాంది పలికింది. ఇదే స్ఫూర్తితో ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం ప్రారంభమయ్యే 2026 నూతన సంవత్సరం అందరి జీవితాలలో కొత్త కాంతులు నింపాలని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2026’ అని అన్నారు.

పెళ్లి పీటలపై వరుడి సర్‌ప్రైజ్‌.. వధువు షాక్‌

తమిళ స్టార్ హీరో సూర్య ఓ అభిమాని వివాహ వేడుకకు సడన్‌గా హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అరవింద్ అనే యువకుడు తన వివాహం సందర్భంగా కాబోయే భార్య కాజల్‌కు మర్చిపోలేని బహుమతి ఇవ్వాలనుకున్నాడు. కాజల్కు హీరో సూర్య అంటే ఎన‌లేని అభిమానం. అరవింద్ తమ పెళ్లికి సూర్యను ఆహ్వానించారు. ఊహించని విధంగా తన అభిమాన హీరో కళ్లముందు ప్రత్యక్షమయ్యేసరికి ఒక్కసారిగా షాకయిన కాజల్‌ కాసేపు నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు. సూర్యను చూసినప్పుడు వధువు ఇచ్చిన రియాక్షన్ […]

అర్జున్‌కు ప్రధాని మోడీ అభినందనలు

దోహా వేదికగా జరిగిన ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేశిని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం అభినందించారు. అర్జున్ విజయం దేశ యువతకు స్ఫూర్తిగా పనిచేస్తుందన్నారు. ప్రపంచ చెస్‌లో భారత్ హవా నడుస్తుందన్నారు. దీనికి ప్రపంచ చెస్‌లో దేశ క్రీడాకారులు సాధిస్తున్న పతకాలే నిదర్శనమన్నారు. బ్లెట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు సాధించి అర్జున్ భారత ఖ్యాతిని ఇనుమడింప చేశాడని ప్రశంసించారు.

కొండాపూర్ లో రూ. 1,000 కోట్ల పెట్టుబడితో నూతన పరిశ్రమలు

మెదక్ జిల్లా కొండాపూర్ ఇండస్ట్రియల్ పార్కులో వెయ్యి కోట్ల పెట్టుబడితో నిర్మాణాలు పూర్తి చేసుకున్న పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని,ఇండస్ట్రియల్ పార్కులో మొత్తం 64 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో 36 పరిశ్రమలు నిర్మాణాలు పూర్తి చేసుకుని కార్యకలాపాలు మొదలు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. బుధవారం సాయంత్రం సచివాలయంలో తనను కలిసిన కొండాపూర్ పారిశ్రామికవేత్తల సంఘం ప్రతినిధులతో శ్రీధర్ బాబు బేటీ అయ్యారు.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కదిరి, కొవ్వూరు మున్సిపాలిటీల గ్రేడ్ పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండు మున్సిపాలిటీల గ్రేడ్ పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూర్ మున్సిపాలిటీ హోదా గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 1 కు పెంచుతూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.సత్యసాయి జిల్లాలోని కదిరి మున్సిపాలిటీ హోదా పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. స్పెషల్ గ్రేడ్‌లో ఉన్న కదిరి మున్సిపాలిటీ హోదాను సెలక్షన్ గ్రేడ్‌కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

26/11 హీరో సదానంద్.. మహారాష్ట్ర కొత్త పోలీస్ చీఫ్‌

మహారాష్ట్ర రాజధాని ముంబైలో 2008 నవంబర్‌ 26న జరిగిన ఉగ్రవాద దాడిలో పలువురిని కాపాడిన హీరో పోలీస్‌ అధికారి ఆ రాష్ట్ర పోలీస్‌ బాస్‌ అయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సదానంద్ డేట్‌ (Sadanand Date)ను మహారాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. జనవరి 3న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత డీజీపీ రష్మి శుక్లా స్థానాన్ని ఆయన భర్తీ చేస్తారు. రెండేళ్ల పాటు ఆ పదవిలో […]

ఏపీలో కూటమి ప్రభుత్వం విఫలం : వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి

ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు. 2025లో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందిందని విమర్శించారు. చిన్నారులు, మహిళలు, యువతులపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. బెల్టు షాపులు, మద్యం దుకాణాలను విచ్చలవిడిగా నెలకొల్పి ప్రజల జీవితాలతో చెలగాటమాడాయని పేర్కొన్నారు. డీజీపీ విడుదల చేసిన వార్షిక నివేదికలో నేరాల సంఖ్య పెరిగిపోయాయని వెల్లడించడం ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ పనితీరును తెలియజేస్తుందని వెల్లడించారు.

బీర్ బాటిల్‌తో సారా టెండూల్కర్‌.. సోషల్ మీడియాలో వీడియో వైరల్?

సారా టెండూల్కర్‌ ప్రస్తుతం గోవాలో హాలిడే ఎంజాయ్ చేస్తోంది. ఈ వెకేషన్‌కి సంబంధించి ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా సారా టెండూల్కర్‌ కనిపించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ క్లిప్‌లో ముగ్గురు ఫ్రెండ్స్‌తో కలిసి అర్రోజిం బీచ్‌ రోడ్డులో సారా నడుచుకుంటూ వెళ్తోంది. రెడ్ కలర్ షార్ట్స్ వేసుకుని గోవా వీధుల్లో సారా చక్కర్లు కొడుతోంది. అంతవరకు బాగానే అనిపించినా, ఆమె చేతిలో ఒక బీర్ బాటిల్ కనిపించడంతో సోషల్ మీడియా  యూజర్ల ఆన్‌లైన్‌లో రెస్పాన్స్ […]

ఏపీ,తెలంగాణ మధ్య పురాతన వస్తువుల విభజన కోసం కొత్త కమిటీ

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పురాతన వస్తువుల విభజన కోసం కొత్త కమిటీ ఏర్పాటు అయింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మ్యూజియంలో ఉంచిన పురాతన వస్తువుల విభజన కోసం ఈ కమిటీ ఏర్పాటు చేయబడింది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం -2014 నిబంధనల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య వస్తువుల పంపకం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ ఛైర్ పర్సన్‌గా  తేజస్వీ పొడపాటి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON