loader

ఫైనల్​లో శ్రీలంకపై విజయం- టీ20 సిరీస్ భారత్​ సొంతం

శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్​లో భారత్ 15 పరుగుల తేడాతో​ విజయం సాధించింది. శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత మహిళల జట్టు  చివరి మ్యాచ్​ కూడా గెలిచి శ్రీలంకను వైట్​వాష్ చేసింది. ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్  20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 176 పరుగుల లక్ష్యంతో ఛేదనకు శ్రీలంక మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది.

దుర్గగుడి ‘కరెంట్ కట్’పై చర్యలు – గొట్టిపాటి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై విద్యుత్ సరఫరా నిలిచిపోవడం పట్ల భక్తుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ అంశాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఘటనపై సమగ్ర విచారణ జరిపిన మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రాథమిక నివేదికను స్వీకరించారు. విద్యుత్ శాఖ మరియు దేవస్థానం అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లే ఈ అపశ్రుతి చోటుచేసుకుందని ఆయన నిర్ధారించారు. భక్తులు ఇబ్బంది పడటం, ఆలయ ప్రాంగణం చీకటిమయం కావడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ.. నల్గొండ కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్..!

కొత్తగా నాలుగు కమిషనరేట్ల ఏర్పాటుతో సోమవారమే సీనియర్ ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం ఐఏఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేసింది. ఆరుగురు ఐఏఎస్‌లకు స్థాన చలనం కల్పించింది. జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా ఇ.సృజన. టి. వినయ్ కష్ణా రెడ్డి బదిలీ అయ్యారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. నల్గొండ కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్, నారాయణపేట అడిషనల్ కలెక్టర్‌గా ఉమాశంకర్ ప్రసాద్, అదిలాబాద్ జాయింట్ కమిషనర్‌గా వై.శ్రీలీల, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్దిశాఖ డైరెక్టర్‌గా శృతి ఒఝా […]

ఏపీలో కొత్త జిల్లాలు.. డిసెంబర్‌ 31 నుంచి అమల్లోకి..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి తుది నోటిఫికేషన్‌ను విడుదల చేస్తూ రెండు కొత్త జిల్లాల ఏర్పాటు, ఒక జిల్లా కేంద్రం మార్పు, అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల సృష్టికి అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మార్పులు డిసెంబర్‌ 31 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా, రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మార్చుతూ ప్రభుత్వం తుది నిర్ణయం […]

యెమెన్ రేవులో ఆయుధ నౌకపై సౌదీ అరేబియా బాంబుల దాడి

యెమెన్ రేవు పట్టణం ముకల్లాపై మంగళవారం సౌదీ అరేబియా బాంబుల వర్షం కురిపించింది. యుద్ధాలతో ధ్వంసమవుతున్న ఈ దేశం లోని వేర్పాటు వర్గాలకు ఆయుధాలు అందించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుంచి ఆయుధ నౌక ఈ రేవు పట్టణానికి రావడమే ప్రధాన కారణం. ఎమిరాటి చర్యలు (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) అత్యంత ప్రమాదకరమైనవిగా తాము గమనించామని సౌదీ అరేబియా హెచ్చరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తూర్పుతీరం లోని రేవు పట్టణం ఫుజైరా నుంచి ఈ నౌకలు […]

విధ్వంసానికి కాదు.. అభివృద్ధికి పెట్టుబడులు పెట్టండి: యుఎన్ చీఫ్

ప్రపంచ దేశాధినేతలు విధ్వంసానికి కాకుండా అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ తన నూతన సంవత్సర సందేశంలో సూచించారు. కొత్త సంవత్సరం లోకి అడుగుపెడుతున్న మనం ప్రస్తుతం గందరగోళం, అనిశ్చితి పరిస్థితుల్లో ఉన్నామని ప్రపంచంలో నాలుగోవంతు జనాభా జీవితాలు సంక్షోభంలో చిక్కుకున్నాయని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా 200 మిలియన్ మంది కన్నా ఎక్కువ మందికి మానవతా సాయం అవసరమని, దాదాపు 120 మిలియన్ మంది యుద్ధాలు, సంక్షోభం, ప్రకృతి వైపరీత్యాలు, లేదా […]

బడ్జెట్ కోసం ఆర్థిక వేత్తలతో ప్రధాని మోడీ భేటీ..

రానున్న ఆర్థిక బడ్జెట్ కోసం ఆర్థిక వేత్తల, వివిధ రంగాల నిపుణుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం భేటీ నిర్వహించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం ఇంకా కొనసాగుతోందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బెరీ, నీతి ఆయోగ్ సిఇఒ బివిఆర్ సుబ్రహ్మణ్యం, ఆయోగ్ ఇతర సభ్యులు , ఆర్థిక వేత్తలు, వివిధ రంగాల నిపుణులు […]

దుర్గం చెరువుకు హైడ్రా ట్రీట్‌మెంట్.. 5 ఎకరాల కబ్జా క్లియర్.

క‌బ్జాల‌పై ప్ర‌జావాణిలో వ‌చ్చిన ఫిర్యాదు మేర‌కు సీక్రేట్ లేక్‌గా పేరుగాంచిన దుర్గంచెరువును క‌బ్జాల చెర నుంచి హైడ్రా విడిపిస్తోంది. మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ వైపు దుర్గం చెరువులో దాదాపు 5 ఎక‌రాల మేర ఉన్న క‌బ్జాల‌ను హైడ్రా తొల‌గించింది. వాహ‌నాల పార్కింగ్ కోసం వినియోగించి ప్ర‌తి నెలా రూ. 50 ల‌క్ష‌ల వ‌ర‌కూ అద్దెలు వ‌సూలు చేస్తున్న దందాకు హైడ్రా చెక్ పెట్టింది. అక్క‌డి వాహ‌నాల‌ను ఖాళీ చేయించి ప్ర‌స్తుతానికి ఫెన్సింగ్ వేసింది. త‌ర్వాత మ‌ట్టిని తొల‌గించేందుకు […]

రేపు దేశ వ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె

గిగ్‌వర్కర్లు డిసెంబర్ 31బుధవారం సమ్మెకు పిలుపునిచ్చారు. దీనివల్ల దేశ వ్యాప్తంగా డెలివరీ సర్వీసులు నిలిచిపోనున్నాయి. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలకు చెందిన గిగ్‌వర్కర్లు 10 నిమిషాల డెలివరీ మోడల్ తమకు సురక్షితం కాదని, దాన్నిరద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ కంపెనీలను కార్మిక చట్టాల పరిధి లోకి తీసుకు రావాలని, ప్రమాదకరమైన 10 నిమిషాల డెలివరీ మోడల్‌ను పూర్తిగా నిషేధించాలని, మెరుగైన వేతనాలు , సామాజిక భద్రత, ఉండాలని […]

సంక్రాంతి రద్దీ.. కేంద్ర మంత్రికి కోమటిరెడ్డి లేఖ

సంక్రాంతి పండుగకు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కి పెద్ద ఎత్తున ప్రజలు పయనమవుతారు. టోల్‌ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే ఈసారి సంక్రాంతికి టోల్‌ గేట్ ఫీజు రద్దు చేయాలని రాష్ట్ర ఆర్‌ అండ్‌ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. జనవరి 9 నుంచి 14 వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ, జనవరి 16 నుంచి 18 వరకు విజయవాడ హైదరాబాద్ రూట్‌లో టోల్ ఫీజు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON