loader

పవన్ కళ్యాణ్ రూట్‌లోనే నాగబాబు.. తెరపైకి కొత్త డిమాండ్..

పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే కోరారు. అయితే పవన్ కళ్యాణ్ సూచించిన విధంగానే పవన్ కళ్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రజా ప్రతినిధులు అందరూ తమ వాణి వినిపించాలని సూచించారు. పెనుగొండ సుబ్బారాయుడు నేతృత్వంలో పలువురు ఆర్యవైశ్య నేతలు.. ఎమ్మెల్సీ నాగబాబు సమక్షంలో ఆదివారం జనసేన పార్టీలో చేరారు.

శ్రీలంకపై భారత్ ఘనవిజయం

శ్రీలంకతో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ మహిళా జట్టు 30 పరుగుల తేడాగా విజయం సాధించింది. దీనితో 5 మ్యాచ్​ల సిరీస్​లో 4 విజయాల అధిక్యంలోకి వెళ్లింది.  చివరి మ్యాచ్​లో కూడా గెలిచి శ్రీలంకను వైట్​వాష్ చేస్తారో లేదో చూడాలి. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోర్ చేసింది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 221 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచింది. అయితే భారత్ విధించిన 221 టార్గెట్​ను […]

31 నుంచి యుజిసి నెట్ పరీక్షలు

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2025(యుజిసి నెట్) పరీక్షలు బుధవారం(డిసెంబర్ 31) నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 7 వరకు రోజుకు రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో యుజిసి నెట్ పరీక్ష జరుగనున్నది. యుజిసి నెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలు… 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలు… 200 మార్కులు కేటాయిస్తారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది. లాంగ్వేజెస్ మినహా ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీలో ఉంటుంది.

అంతర్జాతీయ క్రికెట్‌లో మంధాన మరో రికార్డు.. రెండో భారతీయురాలిగా ఘనత..!

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరో ఘనత సాధించింది. అన్ని ఫార్మాట్లలోనూ అదరగొడుతున్న భారత వైస్ కెప్టెన్ 10 వేల పరుగుల క్లబ్‌లో చేరింది. అంతర్జాతీయంగా ఈ మైలురాయిని అధిగమించిన నాలుగో క్రికెటర్‌గా, రెండో భారతీయురాలిగా రికార్డు నెలకొల్పింది. త్రివేండ్రంలో జరుగుతున్న నాలుగో టీ20లో 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆమె ఈ క్లబ్‌లో చేరింది. మంధాన కంటే ముందు మిథాలీ రాజ్ ఈ క్లబ్‌లో చేరింది.

‘మత మార్పిడి రాకెట్లను- AI టూల్స్ వాడి నిర్మూలించండి’- పోలీసులకు యోగి ఆర్డర్​!

మత మార్పిడి రాకెట్లను నిర్మూలించడానికి కృత్రిమ మేధస్సు (ఏఐ), ఇతర ఆధునిక సాంకేతిక సాధనాలను ఉపయోగించాలని ఉత్తర్​ప్రదేశ్ పోలీసులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. సోషల్ మీడియా, సైబర్ నేరాలపై కఠినమైన నిఘా ఉంచాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే లేదా కుల, మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని కోరారు.

ఫిల్మ్‌ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నిక

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. ఫిల్మ్‌ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నికయ్యారు. ఇక వైస్‌ ప్రసిడెంట్‌గా సూర్యదేవర నాగవంశీ ఎన్నిక కాగా.. ఫిల్మ్‌ చాంబర్ కార్యదర్శిగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. అయితే నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సురేష్ బాబు ఏడాది పాటు పదవిలో కొనసాగనున్నారు. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల్లో నాలుగు సెక్టార్ల నుంచి 43 శాతం పోలింగ్ మాత్రమే నమోదు అయింది మొత్తం 3వేల 287 ఓట్లకు […]

క్వీన్స్ కామన్వెల్త్ ఎస్సే కాంపిటీషన్‌లో తెలుగు బాలికకు అరుదైన గౌరవం

ప్రపంచవ్యాప్తంగా పేరొందిన క్వీన్స్ కామన్వెల్త్ ఎస్సే కాంపిటీషన్ (QCEC)–2025లో విజేతలలో ఒకరిగా నిలిచి తెలుగు సమాజానికి గర్వకారణంగా మారింది ఆచంట లక్ష్మీ మనోజ్ఞ. చిన్న వయసులోనే వసుధైవ కుటుంబకమ్” అనే సార్వకాలిక–సార్వజనీన దృక్పథాన్ని తన కవిత్వంలో ప్రతిబింబిస్తూ, వలసవాద ధోరణులను ప్రశ్నించే సాహిత్య దృష్టిని ఆవిష్కరించడం ఆమె ప్రతిభకు నిదర్శనం. సింగపూర్‌లోని Crescent Girls’ Schoolలో సెకండరీ–2 చదువుతున్న మనోజ్ఞ.. చదువుతో పాటు సంగీతం, సాహిత్యం, పియానో, నృత్యం వంటి అనేక రంగాల్లో తన ప్రజ్ఞను వికసింపజేస్తోంది.

హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం..

నగరంలోని సోమాజిగూడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.సోమాజీగూడలోని ఆల్పైన్ హైట్స్ అపార్ట్‌మెంట్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్‌లోని 5వ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్మేయడంతో పాటు.. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్ రిజల్ట్ – ప్రొగ్రెసివ్ ప్యానల్ విజయం

తెలుగు ఫిల్మ్ చాంబర్ ఎన్నికల్లో పెద్ద నిర్మాతలు సత్తా చాటారు. మన ప్యానల్ పేరిట చిన్న నిర్మాతలు, ప్రొగ్రెసివ్ ప్యానల్ పేరుతో పెద్ద నిర్మాతలు బరిలో నిలిచారు. టాప్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు ‘ప్రొగ్రెసివ్ ప్యానల్’ను బలపరచగా… సి.కల్యాణ్, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు ‘మన ప్యానెల్’ను బలపరిచారు.నిర్మాతల సెక్టార్‌లో ప్రొగ్రెసివ్ ప్యానల్ నుంచి ఐదుగురు, మన ప్యానల్ నుంచి ఏడుగురు గెలుపొందారు. ప్రొగ్రెసివ్ ప్యానల్ అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధించారు.

ఎర్రవల్లి టు హైదరాబాద్.. రేపు అసెంబ్లీకి కెసిఆర్

సోమవారం (డిసెంబర్ 29) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీకి హాజరుకావాలని బిఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కెసిఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ నుంచి కెసిఆర్ హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. తాను అసెంబ్లీ సమావేశాలకు వస్తానని అధికార పక్షం ఎలాంటి ఎజెండాను ఖరారు చేస్తుందో చూసి ముందుకు వెళ్దామని పార్టీ నేతలతో కెసిఆర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON