loader

ఏపీలోని పాస్టర్లకు గుడ్‌న్యూస్: …సీఎం చంద్రబాబు

క్రీస్తు త్యాగాలను స్మరిస్తూ ఆయన చూపిన బాటను అనుసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. క్రైస్తవులకు సంక్షేమం, ఆర్థిక చేయూత అందించింది తమ ప్రభుత్వమేనని అన్నారు. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. క్రిస్మస్ కేట్ కట్ చేసి మత పెద్దలకు తినిపించారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించారు. డిసెంబర్ 2024 నుంచి నవంబర్ 2025 వరకు రూ.51 కోట్ల సాయాన్ని ఈ నెల 24వ తేదీ లోగా వారి ఖాతాల్లో వేస్తాం’అని […]

రాష్ట్రానికి పెట్టుబడులు రావడం కెసిఆర్ కు ఇష్టం లేదు కావొచ్చు – మంత్రి శ్రీధర్

గ్లోబల్ సమ్మిట్ ఒప్పందాలపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న పెట్టుబడులు, తద్వారా యువతకు లభించే ఉద్యోగ అవకాశాలు కేసీఆర్‌కు ఇష్టం లేనట్లు కనిపిస్తోందని ఆయన విమర్శించారు. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా అభివృద్ధిని అడ్డుకోకుండా, రాష్ట్ర ప్రగతికి తోడ్పడేలా సలహాలు ఇవ్వాలని మంత్రి సూచించారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఇన్నయ్య అరెస్టు అప్రజాస్వామికం : సిపిఎం

సామాజిక కార్యకర్త, అనాధాశ్రమాన్ని నిర్వహిస్తున్న గాదె ఇన్నయ్యను ఎన్‌ఐఎ అధికారులు అప్రజాస్వామికంగా అరెస్టు చేశారని సిపిఎం తెలంగాణ కమిటీ ఆరోపించింది. ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. ఆపరేషన్ కగార్, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణులను వ్యతిరేకిస్తున్నవారిని, సామాజిక సమస్యలపై స్పందించే వ్యక్తులను అరెస్టులు చేయడం ప్రజాస్వామిక గొంతుకలను అణచివేయడమేనని ఆయనన్నారు.

జనవరి నుంచి తెలంగాణలో కొత్త వ్యవస్థ… రెవెన్యూ శాఖ ఆధునీకరణ

‘భూ ప‌రిపాల‌న వ్య‌వ‌స్ధ‌ను మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా వేగ‌వంతంగా అందించ‌డానికి రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్, స‌ర్వే విభాగాలను ఒకే ప్లాట్ ఫామ్ మీదకు తీసుకువచ్చి భూభార‌తి పోర్ట‌ల్‌తో అనుసంధానం చేస్తున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్రకటించారు. వ‌చ్చే జ‌న‌వ‌రి నెల‌లో ఆధునీక‌రించిన ఈ వ్య‌వ‌స్ధ‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని తెలిపారు. నాంప‌ల్లిలోని సీసీఎల్ఏ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వివిధ విభాగాల‌తో స‌మావేశం నిర్వ‌హించారు

శ్రీశైలం హుండీల ఆదాయం రూ.4 కోట్లు.. భారీగా విదేశీ కరెన్సీలు

ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంలో హుండీల ద్వారా భారీగా ఆదాయం సమకూరింది. సోమవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి మొత్తం రూ. 4,89,38,741/- నగదు లభించిందని ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఈ మొత్తాన్ని భక్తులు గత 27 రోజుల్లో (25.11.2025 నుండి 22.12.2025 వరకు) స్వామి, అమ్మవార్లకు సమర్పించిన నగదు అని వెల్లడించారు. 57  USD, 47 సింగపూర్‌ డాలర్లు, 20 సౌది రియాల్స్, 30  దిర్హమ్స్, 80 ఆస్ట్రేలియా డాలర్లు,15 పౌండ్స్, 25 కెనడా డాలర్లు […]

గోవా జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్

గోవా జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఘనవిజయం సాధించింది.50 సీట్లలో 30 సీట్లు గెలుచుకుని ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు, స్వతంత్ర అభ్యర్థులు 5 సీట్లు గెలుచుకున్నారు. మహారాష్ట్ర గోమంతక్ పార్టీ (ఎండీపీ) రెండు స్థానాల్లో గెలుపొందగా, గోవా ఫార్వార్డ్ పార్టీ (జీఎఫ్‌పీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), రివల్యూషనరీ గోన్స్ పార్టీ (ఆర్‌జీపీ) ఒక్కో సీటు చెప్పున గెలుచుకున్నాయి. బీజేపీ ఈ ఎన్నికల్లో ఎంజీపీతో,  జీఎఫ్‌పీ పొత్తుతో కాంగ్రెస్ […]

ఓటమిలో నిలిచినవారికే గుర్తింపు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. అమరావతి వేదికగా “పదవి-బాధ్యత” పేరుతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో పదవి చిన్నదా, పెద్దదా అన్నది ముఖ్యం కాదని, మనం నిర్వహించే బాధ్యత మాత్రమే గొప్పదని స్పష్టం చేశారు. జనసేనను కేవలం ఎన్నికల కోసం పుట్టిన ప్రాంతీయ పార్టీగా చూడవద్దని పవన్ సూచించారు. దేశ సేవ కోసమే దీనిని స్థాపించినట్లు వెల్లడించారు.

మళ్లీ వార్తల్లోకి ఎక్కిన ఐఏఎస్ టీనా దాబి.. ‘రీల్ స్టార్’ అంటూ స్టూడెంట్స్ విమర్శలు

రాజస్థాన్‌లోని బార్మర్ కలెక్టర్, ఐఏఎస్ అధికారిణి టీనా దాబి మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు ఆమెను రీల్ స్టార్ అని విమర్శించడం.. ఇది కేవలం సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం సృష్టించిన వివాదమేనని ఆమె కొట్టిపారేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాజస్థాన్ యూనివర్సిటీలో పరీక్షా ఫీజుల పెంపును నిరసిస్తూ బార్మర్‌లోని ఎంబీసీ గర్ల్స్ కాలేజీ విద్యార్థులు తీవ్ర ఆందోళన సందర్భంగా జిల్లా కలెక్టర్ టీనా దాబి తమను కలవడానికి నిరాకరించారని.. తమను […]

వైసీపీని పర్మినెంట్‌గా అధికారంలోకి రాకుండా చేస్తా.. అవసరమైతే షర్ట్ మడతపెడతా..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీని పర్మినెంట్‌గా అధికారానికి దూరం చేస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరూ శత్రువులు కాదన్న పవన్ కళ్యాణ్.. విధానాలతోనే తనకు సమస్య అని అన్నారు. ఆకు రౌడీలను ప్రోత్సహించే పార్టీని గుర్తించనన్న పవన్ కళ్యాణ్.. విధానాలపై ప్రశ్నిస్తే ప్రోత్సహిస్తానన్నారు. అలాగే అరాచకాలు మితిమీరి ఇక తప్పదని అనుకుంటే ఆఖరి అస్త్రంగా షర్ట్ మడతపెడతామంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఆ పార్టీ ఓ రౌడీ సమూహంలా కనిపిస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు […]

ముగిసిన రాష్ట్రపతి హైదరాబాద్ శీతాకాల పర్యటన

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ శీతాకాల విడిది ముగిసింది. ఆరు రోజుల శీతాకాల విడిది ముగించుకున్న రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పయనమయ్యారు. ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, సిఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు వీడ్కోలు పలికారు. ఈ నెల 17న హైదరా బాద్ చేరుకున్న ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతి ఏటా రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రావడం ఆనవాయతీ. ఈ సమయంలో రాష్ట్రపతి నిలయం నుంచే అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON