loader

బడ్జెట్లో మీకేం కావాలో ప్రభుత్వానికి సలహా ఇవ్వండి

భారతదేశ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే కేంద్ర బడ్జెట్ 2026 రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన అడుగు వేసింది. దేశాభివృద్ధి కేవలం పాలకుల నిర్ణయాలతోనే కాకుండా, ప్రజల భాగస్వామ్యంతో జరగాలనే ఉద్దేశంతో MyGovIndia వేదిక ద్వారా సామాన్యుల నుంచి సలహాలను ఆహ్వానిస్తోంది. గతంలో బడ్జెట్ అంటే కేవలం ఆర్థిక నిపుణులు, పారిశ్రామికవేత్తల అభిప్రాయాలకే పరిమితమయ్యేది. కానీ, మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ మాధ్యమాలను వాడుకుంటూ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వారి అవసరాలను నేరుగా తెలుసుకునేందుకు […]

క్రిస్మస్ వేడుకలు..సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్టియన్ సోదరులకు ప్రభుత్వం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలను స్మరించుకుంటూ మానవ సేవయే మాధవ సేవగా భావించి ప్రేమను పంచాలని, ద్వేషించే వారిని కూడా ప్రేమించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏసుక్రీస్తు బోధనల స్పూర్తితో పనిచేస్తోందని చెప్పిన సీఎం, దుష్ప్రచారాలు, ఇబ్బందులు ఎదురైనా శాంతిని కాపాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.

భూగర్భజలాలు కలుషితమైపోయాయి…తాగు నీరు కొనుక్కోవాల్సిన దుస్థితి: పవన్ కల్యాణ్

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. స్వచ్ఛమైన తాగు నీరు కావాలంటే డబ్బు పోసి కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘అమరజీవి జలధార’ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించిందని తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం… ఆంధ్రరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములుని సదా స్మరించుకోవాలనే ఉద్దేశంతో “అమరజీవి జలధార”గా నామకరణం చేశాం’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.

రూ.4 లక్షలు పెట్టి ఎయిరిండియా విమాన టికెట్ కొన్న యువతి.. నాసిరకం భోజనం, సీటుపై ఈగలు

ప్రముఖ ఫుడ్ వ్లాగర్ పవిత్రా కౌర్ .. ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు ఎయిరిండియా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించగా.. ఈ ప్రయాణంలో తనకు ఎదురైన పరిస్థితులను గుర్తు చేసుకుని.. తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. రూ. 4 లక్షలు పెట్టి.. టికెట్ కొనుగోలు చేసినప్పటికీ.. ఎయిరిండియా విమానంలో సరైన సౌకర్యాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విమానం పరిశుభ్రంగా లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా తన సీటుపై చనిపోయిన ఈగలు ఉన్నాయని తెలిపారు. వీటితోపాటు ప్రయాణికులకు పెట్టిన ఆహారం కూడా నాసిరకంగా ఉందని ఆమె మండిపడ్డారు

చొరబాటుదారుల ఏరివేతకే ఎస్ఐఆర్.. కాంగ్రెస్‌పై మోదీ ఫైర్

ఎన్నికల ప్రక్రియలో చొరబాటుదారులను దూరంగా ఉంచేందుకే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను ఎన్నికల కమిషన్ చేపట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అయితే చొరబాటుదారులను కాపాడేందుకు కొందరు ద్రోహులు ప్రయత్నిస్తున్నారని తప్పుపట్టారు. చొరబాట్లను నిలిపివేసేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అసోంలోని గువాహటిలో శనివారంనాడు జరిగిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ, అసోం, ఈశాన్య రాష్ట్రాలకు దశాబ్దాలుగా కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని,  కాంగ్రెస్ చేసిన తప్పిదాలను తాను సరిదిద్దుతున్నానని చెప్పారు.

తైపీలో దుండగుడి బీభత్సం.. 14 మందికి కత్తిపోట్లు

తైవాన్‌ రాజధాని తైపీలో ఓ దుండగుడు శుక్రవారం సాయంత్రం పొగ బాంబులు విసురుతూ, ఎదురుపడిన వారినల్లా కత్తితో పొడుస్తూ బీభత్సం సృష్టించాడు. తైపీ నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్‌ సమీపంలోగల సబ్‌వే వద్ద ప్రయాణికులపై దాడికి దిగాడు. దుండగుడి దాడిలో మొత్తం 14 మంది కత్తిపోట్లకు గురయ్యారు. వారిలో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మిగతా 11 మంది చికిత్స పొందుతున్నారు. కాగా దాడి అనంతరం దుండగుడు పోలీసులకు చిక్కకుండా తప్పించుకునేందుకు ఎత్తయిన భవనం పైనుంచి దూకాడు. తీవ్రంగా గాయపడి మరణించాడు. .

ట్రాఫిక్‌ పోలీస్‌ ఐడీని పొరపాటున పడేసిన మహిళ.. దారుణంగా కొట్టిన పోలీస్‌ అధికారి

స్కూటీపై వెళ్తున్న మహిళను ట్రాఫిక్‌ పోలీసులు ఆపారు. దీంతో ట్రాఫిక్‌ పోలీస్‌ ఐడీని ఆ మహిళ అడిగింది. వాగ్వాదం సందర్భంగా పొరపాటున అది కిందపడింది. ఈ నేపథ్యంలో ఆ ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారి రెచ్చిపోయాడు. ఆ మహిళను దారుణంగా కొట్టాడు.ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారి దౌర్జన్యంపై ఫిర్యాదు చేసేందుకు ఆ మహిళ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. అయితే ఆమె నుంచి […]

జనవరి 26 నాటికి ఏ రోడ్డుపైనా చెత్త కనిపించకూడదు: సీఎం చంద్రబాబు

ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అది తాత్కాలికమే అవుతుందని, అందులో ప్రజలు భాగస్వాములైతేనే అది శాశ్వతమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా  నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్నారు.వచ్చే ఏడాది జూన్‌ నాటికి ఏపీని ప్లాస్టిక్‌ రహిత రాష్ట్రంగా మారుస్తాం. ఇప్పటికే సచివాలయంలో ప్లాస్టిక్‌ వాడకుండా చర్యలు చేపట్టాం. ప్రస్తుతం 26 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలు ఉన్నాయి. అవసరమైతే 100 రథాలు ఏర్పాటు చేసి పొడిచెత్త సేకరిస్తాం.జనవరి 26 నాటికి ఏ రోడ్డుపైనా చెత్త కనిపించకూడదు. […]

గువాహటి ఎయిర్‌పోర్టు కొత్త టెర్మినల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ..

ప్రధాని నరేంద్రమోదీ అస్సాం రాజధాని గువాహటి లోని లోకప్రియ గోపినాథ్‌ బర్దోలోయ్‌ అంతర్జాయ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ను శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ టెర్మినల్‌ను ఏడాదికి 1.31 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగల సామర్థ్యంలో నిర్మించారు. అస్సాం తొలి ముఖ్యమంత్రి గోపినాథ్‌ బర్దోలోయ్‌ పేరు మీద గువాహటి విమానాశ్రయానికి ఆ పేరు పెట్టారు. విమానాశ్రయం వెలుపల గోపినాథ్‌ బర్దొలోయ్‌కు చెందిన 80 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని గతంలో ప్రధాని మోదీ చేతుల […]

MGNREGAను బలహీనపర్చడం అంటే పేదల ప్రయోజనాలపై దాడి చేయడమే: సోనియా గాంధీ

నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. ఎవరినీ సంప్రదించకుండానే ఈ పథకం స్వరూపాన్ని మార్చేశారని ఆరోపించారు. ఈ చర్య పేదల ప్రయోజనాలను విరుద్ధంగా ఉందన్నారు. ఈ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడమే కాకుండా, పథకం ఉనికినే ప్రశ్నార్థకం చేసిందని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరచడం అంటే దేశవ్యాప్తంగా ఉన్న రైతులు, కూలీలు, భూమిలేని నిరుపేదల ప్రయోజనాలపై దాడి చేయడమేనని సోనియా గాంధీ స్పష్టం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON