loader

మోండా మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం

సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీరామ ఎంటర్ ప్రైజెస్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగతో అలముకోవడంతో  మార్కెట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.స్థనికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

శివమెత్తిన పాండ్యా.. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో రికార్డు..!

పొట్టి ప్రపంచకప్‌ కోసం వెయింటింగ్.. అన్నట్టుగా హార్దిక్ పాండ్యా చెలరేగిపోతున్నాడు. మూడు నెలల తర్వాత పునరాగమనం మ్యాచ్‌లోనూ అభిమానులకు పూనకాలు తెప్పించిన పాండ్యా.. టీ20ల్లో వేగవంతమైన అర్ధ శతకం బాదేశాడు. సిరీస్ డిసైడర్ ఐదో మ్యాచ్‌లో శివమెత్తిన ఈ ఆల్‌రౌండర్ దక్షిణాఫ్రికా బౌలర్లను ఊచకోత కోస్తూ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. తద్వారా ఈ ఫార్మాట్లో టీమిండియా తరఫున రెండో వేగవంతమైన ఫిఫ్టీ నమోదు చేశాడీ హిట్టర్.

స్టార్ సెలబ్రెటీలకు బిగ్ షాక్.. ED సంచలన నిర్ణయం

ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా, మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, నటుడు సోనూ సూద్, మాజీ ఎంపీ మిమీ చక్రవర్తికి చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ‘1XBet’ అనే వివాదాస్పద ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినందుకు వీరిపై చర్యలు తీసుకున్నారు. ఈ సెలబ్రిటీలు ఆ సంస్థ నుంచి భారీగా నగదు తీసుకున్నట్లు ఆధారాలు లభించాయి.

ఒకేమ్యాచ్‌లో సంజూ డబుల్ ధమాకా.. టీ20ల్లో రికార్డుల మోత..!

టీ20 క్రికెట్‌లో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న సంజూ శాంసన్ రికార్డుల మోత మోగించాడు. అహ్మదాబాద్‌ టీ20లో ఓపెనర్‌గా ఉన్నంత సేపు దంచేసిన సంజూ.. అంతర్జాతీయంగా వెయ్యి పరుగుల క్లబ్‌లో చేరాడు. టీమిండియా తరఫున టీ20ల్లో అత్యంత వేగంగా 1,000 రన్స్ పూర్తి చేసుకున్న నాలుగో బ్యాటర్‌గా నిలిచాడీ లెఫ్ట్ హ్యాండర్. 679 బంతుల్లోనే ఈ మైలురాయికి చేరుకున్న సంజూ మాజీ సారథి హార్దిక్ పాండ్యా రికార్డు సమం చేశాడు.

స్పీకర్ సమక్షంలో చాయ్‌ పే చర్చ.. హాజరైన ప్రధాని మోదీ, ప్రియాంకా గాంధీ

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. సమావేశాల నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు సభ్యులకు స్పీకర్ ఓం బిర్లా తేనీటి విందు ఇచ్చారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకా గాంధీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, రామ్మోహన్‌ నాయుడు, పలువురు అఖిలపక్ష ఎంపీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రియాంక నియోజకవర్గం వయనాడ్‌ గురించి మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష ఎంపీలు కూడా టీ పార్టీలో చేరారు. […]

సతాయిస్తున్న యూట్యూబ్, వీడియో ప్లే చేయలేక యూజర్ల ఇక్కట్లు.!

ప్రముఖ వీడియో ప్లాట్ ఫామ్ యూట్యూబ్ డౌన్ అయ్యింది. ఈ విషయాన్ని గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారు. ప్రముఖ ఔటేజ్ రిపోర్ట్ ప్లాట్ ఫామ్ downdetector నుంచి యూజర్లు ఈ సమస్య గురించి విపరీతంగా రిపోర్ట్ అందించారు. యూట్యూబ్ డౌన్ గురించి శుక్రవారం సాయంత్రం, అంటే ఈరోజు సాయంత్రం 6:30 గంటల నుంచి రిపోర్ట్ లు నమోదు అయ్యాయి. అయితే, ఇది రెండు నిమిషాల్లోనే వేల సంఖ్యలో యూజర్లు ఈ సమస్య చూస్తున్నట్లు రిపోర్ట్ […]

కేయూ పరిధిలో బీటెక్‌ పరీక్షలు వాయిదా

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఈనెల 22 నుంచి జరగాల్సిన బీటెక్‌(3,5, 7 సెమిస్టర్లు) పరీక్షలు వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కట్ల రాజేందర్‌ తెలిపారు. వాయిదా పడిన పరీక్షలు ఈనెల 29 నుంచి జరుగుతాయని, పరీక్షల పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామని, విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.

తమిళనాడులో ముసాయిదా ‘SIR‌’ ఓటర్ల జాబితా ప్రచురణ.. 97 లక్షల మంది ఓటర్లు తొలగింపు

తమిళనాడులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR‌) తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్‌ శుక్రవారం విడుదల చేసింది. ఆ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 97 లక్షల మంది ఓటర్లను తొలగించారు.6,44,881 మంది ఓటర్లు బదిలీ అయినట్లుగా, 3,39,278 మంది ఓటర్లు పలు ప్రదేశాల్లో నమోదు చేసుకున్నట్లుగా, 26,94,672 మంది ఓటర్లు మరణించినట్లుగా జాబితాలో పేర్కొన్నారు. ప్రస్తుతం 5.43 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

ప్రధాని మోదీ చెవికి పోగు.. ఒమన్ పర్యటన వీడియో వైరల్..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒమన్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. ప్రధాని మోదీ చెవికి ఒక రింగ్ లాంటి పరికరం కనిపించింది. అది ఏంటి అని నెటిజన్లు.. సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే అది ఒక ట్రాన్స్‌లేషన్ పరికరం అని తేలింది. అంటే ప్రధాని మోదీతో మాట్లాడేవారు ఏ భాష మాట్లాడినా అది ఆయనకు అర్థం అయ్యే భాషలో వినిపించే పరికరం. అది ఒక రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ ఇయర్‌పీస్ అని సంబంధిత […]

ఇంత బతుకు బతికి ఏ పార్టీనో చెప్పుకునే దమ్ము లేదు: కేటీఆర్ ఫైర్

పది మంది ఎమ్మెల్యేలతో ఎన్నికలకు వెళ్లే దమ్ముందా?  రేవంత్ రెడ్డికి   కేటీఆర్ సవాల్ విసిరారు. సిరిసిల్లలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డిది కూడా ఓ బతుకేనా అంటూ మండిపడ్డారు.. ఎమ్మెల్యేలు, స్పీకర్‌ను చూస్తే జాలేస్తుందంటూ ఆయన వ్యంగ్యంగా అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆడోళ్లా? మగోళ్లో తెలియడం లేదన్నారు. ఇంత బతుకు బతికి ఏ పార్టీనో చెప్పుకునే దమ్ము లేదంటూ రాజకీయ కండువాలు మార్చిన […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON