loader

2025లో ట్రెండ్ సెట్టర్​గా చెర్రీ సాంగ్

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ మరోసారి స్టార్ పవర్‌తో అదరగొట్టారు. ’పెద్ది’ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ’చికిరి చికిరి’ ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ పాట ఇప్పుడు  పెద్ద సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో అయితే ఫుల్ ట్రెండీగా మారింది. నెటిజన్లు ఇప్పటికే ఈ పాటకు వేలల్లో రీల్స్​ చేశారు. విడుదలైన కేవలం ఒక నెలలోనే, ఒక్క తెలుగు వర్షన్ లోనే 100 మిలియన్ల వ్యూస్‌ను దాటగా, ఐదు భాషల్లో కలిపి మొత్తం 150 మిలియన్లకు […]

సింగరేణి సీఎండీగా ఐఏఎస్ కృష్ణ భాస్కర్ నియామకం

సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఐఏఎస్ అధికారి కృష్ణ భాస్కర్‌ను నియమించారు. ప్రస్తుతం టీజీ జెన్‌కో సీఎండీగా పనిచేస్తూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్న 2012 ఐఏఎస్ అధికారి కృష్ణ భాస్కర్ ను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సింగరేణి ఇన్‌చార్జి చైర్మన్‌గా కొనసాగించనున్నారు. ప్రస్తుతం సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్న బలరాం పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో కృష్ణ భాస్కర్ ను నియమించారు.

గ్రీన్​పై కాసుల వర్షం- IPL రికార్డులన్నీ బ్రేక్- రూ.25.20 కోట్లకు KKR సొంతం

2026 సీజన్​కు సంబంధించిన ఐపీఎల్ మినీ వేలంలో గత రికార్డులన్నీ బద్దలయ్యాయి. మొదట్నుంచి అనుకున్నట్లుగానే ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​ కామెరూన్ గ్రీన్​కు భారీ డిమాండ్ ఏర్పడింది. అతడిని కోల్​కతా నైట్​రైడర్స్ జట్టు రూ.25.20 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ మినీ వేలం చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా గ్రీన్ ఆల్​టైమ్ రికార్డ్ కొట్టాడు. ఇక ఓవరాల్​గా ఐపీఎల్ వేలం చరిత్రలో ఇది మూడో అత్యధిక ధర. గతేడాది మెగా వేలంలో స్టార్ బ్యాటర్ రిషభ్ […]

లోకేష్ సభలో లేకపోవడం లోటుగా ఉంది: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ పండుగకు మంత్రి లోకేష్ గారు హాజరు కాకపోవడం లోటుగా ఉంది. ఇంత మెగా ఈవెంట్ కానీ, నాడు మెగా డీఎస్సీ కానీ లోకేష్ గారి ఆలోచనే. లోకేష్ గారికి అభ్యర్థులు అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నా’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.

గెలిచిన సర్పంచ్‌ను పార్టీలోకి తీసుకుంటే గాంధీ భవన్‌ను ముట్టడిస్తాం..

తాండూర్ మండలం మాదారం 3 ఇంక్లైన్ గ్రామపంచాయతీ ఇండిపెండెంట్‌గా గెలిచిన సర్పంచ్ చందనాల రవి కుమార్‌ను పార్టీలోకి తీసుకుంటే గాంధీ భవన్‌ను ముట్టడిస్తామని కాంగ్రెస్‌ నాయకులు నూతన సర్పంచ్‌ మండలంలోని ఒక నాయకుడి ద్వారా కాంగ్రెస్ పార్టీ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ సర్పంచ్ మద్దతుదారుడిగా పోటీ చేసి ఓడిన పుట్ట శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ రెడ్డి ఆరోపించారు.

ఏపీలో త్వరలోడిజిటిల్ హెల్త్ రికార్డులు: వైద్యారోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సమీక్షించారు. ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్ తో కలిసి వైద్యారోగ్య రంగంలో ప్రభుత్వం అమలు చేస్తోన్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు చర్చించారు. ‘వైద్యారోగ్య రంగంలో వివిధ ప్రమాణాలను అందుకునేలా డబ్ల్యూహెచ్ఓ లాంటి సంస్థలు నిర్దేశించిన అంశాలను అమలు చేస్తున్నాం. ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను సంజీవని ప్రాజెక్టు ద్వారా రూపొందిస్తున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీబిజీ.. కేంద్ర మంత్రులతో కీలక అంశాలపై చర్చలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. సోనియా గాంధీకి ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌’ను అందజేశారు. అలాగే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై, రాష్ట్రంలో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (YIIRS) ఏర్పాటుకు సహకరించాలని కోరారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు హైదరాబాద్‌కు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధి, విద్య, ఆర్థిక అంశాలపై ముఖ్యమంత్రి ఈ […]

రుషికొండ ప్యాలెస్‌పై సబ్ కమిటీ కీలక నిర్ణయం

విశాఖపట్నం రుషికొండపై నిర్మించిన వివాదాస్పద భవనాలను లగ్జరీ హోటల్‌గా మార్చేందుకు ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. టాటా గ్రూప్‌కు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ IHCL-తాజ్ గ్రూప్) , లీలా ప్యాలెస్ హోటల్స్ సహా లెమన్ ట్రీ, మహీంద్రా, మారియట్ వంటి సంస్థలు ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (GoM) వివిధ ఆప్షన్లను ఖరారు చేసిన తర్వాత తమ సిఫారసులను ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ ముందు […]

తనపై సీబీఐ విచారణ కోరుతూ సీఎం చంద్రబాబుకు లేఖ…హైకోర్టులోనూ రిట్ పిటిషన్

నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం 14 కేసులు నమోదు చేసింది. ‘నాపై అక్రమ కేసులు మీతో సంబంధం లేకుండా నమోదు చేసి ఉంటే వాటిపైన సీబీఐ చేత విచారణ జరిపించి నిజనిజాలు నిగ్గు తేల్చి నాపై మోపబడిన కేసులు సీబీఐ విచారణలో రుజువైతే ఏ విక్షకైనా సిద్ధంగా ఉన్నాను’అని మాజీమంత్రి లేఖలో పేర్కొన్నారు. మరోవైపు తనపై నమోదైన 9 అక్రమ కేసుల్లో సీబీఐ విచారణ కోరుతూ ఏపీ […]

ఢిల్లీ సర్కారు సంచలన నిర్ణయం.. పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే పెట్రోల్ బంద్

దట్టమైన పొగమంచు రాజధాని ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో.. కాలుష్యంపై యుద్ధం ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం అత్యున్నత స్థాయి నియంత్రణలైన GRAP-IV చర్యలను అమలు చేస్తోంది. దీనిలో భాగంగానే డిసెంబర్ 18వ తేదీ నుంచి కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ (PUC) లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నిరాకరించబడుతుందని పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా ప్రకటించారు. అంతేకాకుండా BS-VI ప్రమాణాల కంటే తక్కువ ఉన్న ఢిల్లీయేతర వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON