loader

ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. 30 శాతం పెరిగిన రోగులు

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యధిక స్థాయిలో పెరిగిపోతుండడంతో శ్వాసకోశ వ్యాధుల రోగులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. రోజువారీ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య కన్నా 20 నుంచి 30 శాతం ఎక్కువగా శ్వాసకోశ వ్యాధుల రోగుల సంఖ్య ఉంటోందని డాక్టర్లు చెప్పారు. జలుబు, దగ్గు, ఊపిరాడకపోవడం, ఛాతీ బిగుసుకుపోవడం, తదితర లక్షణాలతో రోగులు వస్తున్నారని తెలిపారు. కాలుష్యం ఎక్కువగా ఉంటున్న ప్రాంతాల నుంచే రోగులు అధిక సంఖ్యలో వస్తున్నారని డాక్టర్లు తెలిపారు.

బాహుబలి కాదు అంతకు మించి.. భారత్–అమెరికా సంయుక్తంగా చేపడుతున్న ప్రాజెక్ట్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్దమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి బ్లూబర్డ్‑6 ప్రయోగం జరగనుంది. ఈ ఉపగ్రహాన్ని LVM-03 M6 అనే రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనుంది బ్లూబర్డ్ శాటిలైట్. భారత్‑అమెరికా సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని చేపడుతున్నాయి. బాహుబలి 2 రాకెట్ అన్నట్లు LVM- 03 అప్‌గ్రేడ్ అయింది.. 6.5 టన్నుల బరువున్న అమెరికాకు చెందిన బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశ పెట్టనుంది..

సంక్రాంతి ప్రయాణికులకు..రేపట్నుంచే స్పెషల్ ట్రైన్స్ బుకింగ్స్‌ ప్రారంభం!

సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ స్పెషల్ ట్రైన్లకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఆదివారం(డిసెంబర్ 14) ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే ఇప్పటికే నడుస్తున్న కొన్ని వీక్లీ స్పెషల్ ట్రైన్లను సంక్రాంతి రద్దీ ముగిసే వరకు మరికొన్ని వారాల పాటు పొడిగిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే అత్యాధునిక స్లీపింగ్ పాడ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం చర్లపల్లి, కాచిగూడ […]

‘పంచాయతీ’ ముగియగానే పరిషత్ ఎన్నికలకు సమాయత్తం

రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు మూడో విడత ముగియగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. మూడో విడత 17న నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. దీంతో ఈ నెల 20 నాటికి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. ఇక జిల్లాల కలెక్టర్లను సమన్వయం చేసుకుంటూ పరిషత్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సర్వం సిద్ధమైతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈ నెల 23, 27 తేదీల్లో విడుదల చేసేలా ఎన్నికల సంఘానికి […]

మియాపూర్‌లో డ్రగ్స్ పట్టివేత

డ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురు, ఇద్దరు వినియోగదారులను మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు శనివారం మియాపూర్, ప్రేమ్‌నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2లక్షల విలువైన 55 ఎల్‌ఎస్‌డి పేపర్స్, గ్రాము కొకైన్, 3 గ్రాముల ఎండిఎంఏ, గంజాయి కేక్, 56 గ్రాముల హ్యాష్ ఆయిల్, 10 గ్రాముల మేజిక్ మష్రూమ్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న వారిని మియాపూర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పంచాయతీ ఎన్నికలకు వెళ్తుండగా యాక్సిడెంట్‌.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

మెదక్‌ జిల్లాలో దారుణం జరిగింది. పెద్ద శంకరంపేట వద్ద బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మృతులను కామారెడ్డి జిల్లా మాగి గ్రామానికి చెందిన లింగమయ్య, సాయవ్వ, సాయి, మానసగా గుర్తించారు. రేపు జరగబోయే రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

రామేశ్వరం కేఫ్‌లో అఖిలేశ్‌ యాదవ్‌తో కేటీఆర్‌ భోజనం

హైదరాబాద్‌లోని రామేశ్వరం కేఫ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి  బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భోజనం చేశారు. ఇరువురు నేతలకు కేఫ్‌ యజమాని శరత్‌ ఘనస్వాగతం పలికారు. భోజనం సందర్భంగా కేటీఆర్‌, అఖిలేశ్‌ యాదవ్‌ కేఫ్‌ రుచులను ఆస్వాదిస్తూనే రాజకీయ, సమకాలీన అంశాలపై చర్చించుకున్నారు. అద్భుతమైన రుచులు అంటూ యజమాని శరత్‌ను అఖిలేశ్‌యాదవ్‌ అభినందించారు. భోజనం అనంతరం ఇరువురు నేతలు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నివాసానికి వెళ్లారు

సాయి జాధవ్‌‌ అరుదైన ఘనత- IMA నుంచి పాసైన మొదటి మహిళా అధికారిణిగా రికార్డు

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘ఇండియన్ మిలిటరీ అకాడమీ’ (ఐఎంఏ)  నుంచి మొట్ట మొదటిసారిగా ఓ మహిళా అధికారి పాసయ్యారు.  93 సంవత్సరాల ఐఎంఏ చరిత్రలో తొలిసారిగా ఈ అరుదైన ఘనతను మహారాష్ట్రలోని కొల్హాపూర్ వాస్తవ్యురాలు సాయి జాధవ్ సొంతం చేసుకున్నారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని దెహ్రాదూన్​లో ఉన్న ఈ అకాడమీలో దాదాపు 6 నెలల కఠిన సైనిక శిక్షణను ఆమె పూర్తి చేసుకొని సైన్యంలో చేరారు. ఐఎంఏ నుంచి పట్టభద్రురాలైన తొలి మహిళా సైనిక అధికారిణిగా నిలిచారు.

లక్ష మంది ఫ్యాన్స్ ఎంట్రీస్‌తో.. ఉస్తాద్‌ భగత్‌ సింగ్ దేఖ్‌లేంగే సాలా సాంగ్ లాంచ్‌

పవన్‌ కల్యాణ్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం ఉస్తాద్‌ భగత్‌ సింగ్. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ సింగిల్‌ దేఖ్‌ లేంగే సాలా నెట్టింటిని షేక్ చేస్తోంది. మేకర్స్‌ మొట్టమొదటి సారి లక్ష మంది ఫ్యాన్స్ ఎంట్రీస్‌తో దేఖ్‌లేంగే సాలా సాంగ్ లిరిక్‌ షీట్‌ను లాంచ్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్‌ కంపోజ్‌ చేసిన ఈ పాటను భాస్కర బట్ల రాయగా.. విశాల్‌ దడ్‌లానీ పాడాడు.

హైదరాబాద్‌లో మెస్సీ మేనియా.. లెజెండ్‌ను చూసి ఫ్యాన్స్ దిల్ ఖుష్

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మేనియాతో హైదరాబాద్ ఊగిపోయింది. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో రేవంత్ రెడ్డితో కలిసి ఫుట్‌బాల్ ఆడాడు. అనంతరం గ్రౌండ్ మొత్తం తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశాడు. మెస్సీని అంత దగ్గరగా చూసిన అభిమానుల దిల్ ఖుష్ అయ్యాయి. చాలా మంది భావోద్వేగానికి గురయ్యారు కూడా. ఈ కార్యక్రమంలో కాంగ్రెత్ నేత విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON