loader

‘వందేమాతరం’పై పార్లమెంటులో చర్చ.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ విమర్శలు

పార్లమెంటులో 10 గంటల పాటు వందేమాతరం గేయంపై చర్చ జరగడంపై బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు విశాల్ దద్లానీ విమర్శలు గుప్పించారు. నిన్న వందేమాతరం దేశభక్తి గేయంపై పార్లమెంటులో 10 గంటల పాటు చర్చ జరిగింది. జనాలకు ఇది బాగా నచ్చింది. ఈ చర్చ కారణంగా దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారమైపోయింది. ఇండిగో, వాయు కాలుష్య సమస్యలు కూడా తొలగిపోయాయి. పార్లమెంటు కోసం నిమిషానికి రూ.2.5 లక్షల చొప్పున 600 నిమిషాల పాటు చర్చకు   ఎంత […]

ప్రధాని మోదీ, అమిత్ షాలతో రాహుల్ గాంధీ భేటీ.. పీఎంఓలో 88 నిమిషాలు

్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలతో పీఎంఓలో రాహుల్ గాంధీ భేటీ కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకంగా 88 నిమిషాల పాటు వీరు ముగ్గురు సమావేశం కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సహా పలు ఖాళీలపై ఈ ముగ్గురు నేతల ఉన్నత స్థాయి కమిటీ చర్చించింది. ఈ భేటీలో పలు నియామకాలను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ తన అభ్యంతరాలను సమర్పించారు. అయితే వీరు ముగ్గురు సుదీర్ఘంగా భేటీ కావడమే […]

కజక్ బెల్లీ డాన్సర్స్‌పై దృష్టి సారించిన దర్యాప్తు సంస్థలు

గోవా నైట్‌క్లబ్‌లో జరిగిన ప్రమాద సమయంలో ‘షోలో’ చిత్రంలోని ‘మెహబూబా మెహబూబా’ పాటతో అందరి దృష్టిని ఆకర్షించిన బెల్లీ డాన్సర్‌ క్రిస్టినా పైనా దర్యాప్తు సంస్థలు తాజాగా దృష్టి సారించారు. క్రిస్టినా బిజినెస్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్టు,అయితే వీసా ఇంకా అప్రూవ్ కాలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. చెల్లుబాటయ్యే పర్మిట్ లేకుండా ఆమె ఇండియాలో పనిచేస్తున్నారా అనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

మహిళా డీఎస్పీపై సంచలన ఆరోపణలు .. ప్రేమించానని రూ.2 కోట్ల వసూలు

ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌లో వ్యాపారి దీపక్ టండన్ , రాష్ట్రంలో పనిచేస్తున్న మహిళా డీఎస్పీ కల్పనా వర్మ తన నుంచి రూ. 2 కోట్లకుపైగా వసూలు చేసిందని ఆయన ఆరోపించారు. 2021లో కల్పనా వర్మను ఆయన తొలిసారి కలిశారు. ఆ తర్వాత ఇద్దరూ సంబంధంలోకి వెళ్లారని చెప్పారు. దీపక్ రూ. 2 కోట్లు కల్పనాకు ఇచ్చానని తెలిపారు. రూ. 1 లక్ష  బ్రేస్‌లెట్, రూ. 5 లక్షల బంగారు గొలుసు, రూ. 12 లక్షల విలువైన డైమండ్ రింగ్ […]

నాలుగేళ్ల చిన్నారికి స్క్రబ్ టైఫస్ వైరస్

గజపతినగరం ఏరియా ఆస్పత్రిలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదైంది. బొండపల్లి మండలం మరువాడ గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారికి మూడు రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో ఏరియా ఆస్పత్రిలో స్క్రబ్ టైఫస్ టెస్ట్ చేశారు. రిపోర్టులో పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ర్యాపిడ్ టెస్ట్, ఎలీసా టెస్ట్‌లో కూడా పాజిటివ్ వచ్చిందని గజపతినగరం ఏరియా ఆస్పత్రి వైద్యాధికారి ప్రవీణ్ చెప్పారు. దీంతో మరువాడ గ్రామంలో అధికారులు క్లోరినేషన్‌ను చేపట్టారు.

‘పూర్తి వివరాలతో హాజరవ్వండి’- ఇండిగో CEOకు డీజీసీఏ ఆదేశాలు

దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోకు ఎదురైన భారీ సంక్షోభం నేపథ్యంలో, విమాన భద్రత నియంత్రణ సంస్థ డీజీసీఏ కఠినంగా స్పందించింది. ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌ను గురువారం తన కార్యాలయానికి రావాలని ఆదేశించింది. డీజీసీఏ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఎల్బర్స్ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు డీజీసీఏ కార్యాలయానికి రానున్నారు. ఆయనతో పాటు విమాన సంస్థలోని సంబంధిత విభాగాల సీనియర్ అధికారులు కూడా తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేేశాలు జారీ చేసింది డీజీసీఏం.

బీరంగూడలో దారుణం.. ప్రియుడిని బ్యాట్‌తో కొట్టి చంపిన ప్రియురాలి తండ్రి

సంగారెడ్డి జిల్లా బీరంగూడ ఇసుకబావి ప్రాంతంలో దారుణమైన పరువు హత్య జరిగింది. 10వ తరగతి నుంచి ప్రేమించుకుంటున్న శ్రావణ్ సాయి (20), యువతి (19)ల మధ్య సంబంధం తెలిసి యువతి తల్లిదండ్రుల్లో ఆగ్రహం పెరిగింది. ఇంజినీరింగ్ చదువుతున్న శ్రావణ్ సాయిని పెళ్లి విషయంలో మాట్లాడుకుందామని శ్రీజ తల్లిదండ్రులు ఇంటికి పిలిచారు. ఇంటికి వచ్చిన యువకుడిని వారు బ్యాట్‌లతో, కత్తెరలతో దారుణంగా కొట్టి చంపారు. తీవ్ర గాయాలతో సాయి పడిపోవడంతో, యువతి బంధువులు అతన్ని ఆసుపత్రికి తరలించి అక్కడి […]

తన మతంలో ఇలా జరిగితే ఊరుకుంటారా?-పరకామణి కేసులో జగన్ పై పవన్ కల్యాణ్ విమర్శలు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇస్లాం, క్రైస్తవ మతాలకు ఒకలా, హిందూ మతానికి మరోలా నిబంధనలు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. పరాకామణి కేసు చిన్నదన్న జగన్ వ్యాఖ్యలను, తన మతంలో ఇలా జరిగి ఉంటే ఇలాగే స్పందించేవారా ఇని ప్రశ్నించారు. మెజారిటీ పేరిట హిందువులు వివక్షకు గురవుతున్నారని అన్నారు. హిందువులు మెజారిటీ అనేది ఒక భ్రమ. కులం, మతం, భాష, ప్రాంతాల వారీగా వారు విడిపోయి ఉన్నారు […]

18 బ్యాంకుల నుంచి రూ.5,572 కోట్లు తీసుకున్న అన్మోల్ అంబానీ

అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ అంబానీకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) షాక్ ఇచ్చింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కంపెనీ తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమవడంతో అన్మోల్ అంబానీపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. యూనియన్ బ్యాంక్‌కు రూ.228 కోట్ల మేర నష్టం వాటిల్లిన వ్యవహారంలో ఈ కేసు నమోదైంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థ యూనియన్ బ్యాంక్ సహా మొత్తం 18 బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రూ.5,572 కోట్లకు పైగా […]

ఘోర ప్రమాదం.. రెండు భవనాలు కూలి 19 మంది మృతి

మొరాకో దేశంలోని ఫెజ్ నగరంలో విషాదం జరిగింది. అల్-ముస్తఖ్బల్ ప్రాంతంలో మధ్యరాత్రి రెండు పక్కపక్కన ఉన్న నాలుగు అంతస్తుల నివాస భవనాలు కుప్పకూలడంతో కనీసం 19 మంది మరణించారు. మరో 16 మంది తీవ్ర గాయాలతో ఫెజ్ యూనివర్సిటీ హాస్పిటల్‌కు తరలించబడ్డారు. కూలిన శిథిలాలలో మరికొందరు చిక్కుకుని ఉండవచ్చని భావిస్తూ, రాత్రంతా శోధన కొనసాగించారు. మరణించినవారిలో పిల్లలు కూడా ఉన్నారని ఫెజ్ ప్రధాన మ్యాప్ వార్తా సంస్థ తెలిపింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON