loader

స్క్రబ్‌ టైఫస్‌ మలేరియా, డెంగీలాంటిదే..భయం అక్కర్లేదు-ఏపీ ఆరోగ్య శాఖ

ఏపీలో స్క్రబ్‌టైఫస్‌పై జరుగుతున్న ప్రచారంపై ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ స్పందించింది. స్క్రబ్‌టైఫస్‌ కొత్త వ్యాధి కాదని ఏపీ ఆరోగ్య శాఖ కమిషనర్‌ వీరపాండ్యన్‌ తెలిపారు. ఇది కూడా డెంగీ, మలేరియాలాంటిదే అని పేర్కొన్నారుఈ ఏడాది 1566, గత ఏడాది 1613 కేసులు వచ్చాయని తెలిపారు. స్క్రబ్‌టైఫస్‌ వల్ల వెంటనే మరణించరని పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో  స్క్రబ్‌టైఫస్‌కు చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. జ్వరం వచ్చిన ఐదో రోజు నుంచి 20వ రోజు మధ్యలో ఈ వ్యాధి బయటపడే […]

భోజ్‌పురి నటుడికి బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్.. సల్మాన్ ఖాన్‌ను కలిస్తే..

బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు తనను బెదిరిస్తున్నాడంటూ భోజ్‌పురి నటుడు పవన్ సింగ్ తాజాగా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు బిగ్‌బాస్‌లో సల్మాన్ ఖాన్‌తో కలిసి పాల్గొంటే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్టు తెలిపారు. తమ నుంచి డబ్బులు కూడా డిమాండ్ చేశారని అన్నారు. వరుసపెట్టి టెక్స్ట్ మెసేజీలు కూడా పంపించి బెదిరింపులకు దిగారని అన్నారు. తమ హెచ్చరికలను ఖాతరు చేయకుండా సల్మాన్ ఖాన్‌ను కలిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్టు తెలిపారు.

ఐదుగురు విద్యార్థుల మృతి కేసు- బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ పేరుతో ఏఎస్సై కుమారుడి అక్రమాలు

చిలకలూరిపేట బైపాస్‌లో ఈనెల 4న హైవేపై కంటైనర్‌ను ఆపి ఐదుగురు బీటెక్‌ విద్యార్థుల మృతికి కారణమైన భారీ కంటైనర్‌ను ఆపిన వ్యక్తి నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో పని చేసే ఏఎస్సై కుమారుడే అని గుర్తించారు. బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌గా అవతారం ఎత్తి జాతీయ రహదారులు, బైపాస్‌ల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు గంజాయి సరఫరా, విక్రయాలు చేస్తూ కాలేజీ విద్యార్థులను మత్తులోకి దింపుతున్న కుమారుడి నేరాలకు  కొన్నేళ్లుగా నరసరావుపేటలోనే పోస్టింగ్‌ వేయించుకుంటూ తండ్రి సహకరిస్తున్నట్లు పోలీసుశాఖలోనే చర్చ నడుస్తోంది.

500 కోట్ల సూట్‌కేస్ ఉండాల్సిందే..నవజ్యోత్ కౌర్ సిద్ధూను సస్పెండ్ చేసిన కాంగ్రెస్

భారత మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య, పంజాబ్ మాజీ ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్ సిద్ధూపై కాంగ్రెస్ వేటు వేసింది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కాంగ్రెస్ 2027కి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనను ప్రకటిస్తేనే ఆయన మళ్లీ పోటీ చేస్తారని చెప్పారు. రూ.500 కోట్లు సూట్ కేసు ఇచ్చేవారే ముఖ్యమంత్రి అవుతారని.. ఆ పదవిని కొనడానికి అంత డబ్బు తమ వద్ద లేవని సంచలన ఆరోపణలు చేసింది.

అదానీ చేతికి విశాఖ స్టీల్ ప్లాంట్..సైలెంట్‌‌గా ప్రైవేటీకరణ.. షర్మిల సంచలన కామెంట్స్

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. అధికార పక్షంపై సంచలన ఆరోపణలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని చెబుతున్న కేంద్రం..”అమ్మేది లేదంటూనే విశాఖ స్టీల్ ప్లాంట్ గౌతమ్ అదానీ చేతిలో పెడుతున్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని, అమ్మబోమని, ఆదుకుంటామని బీజేపీ చెప్పేవన్నీ ఉత్తి కబుర్లు మాత్రమే. “విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మే కుట్ర మోదీదైతే, దాన్ని అమలు చేస్తున్నది సీఎం చంద్రబాబు. ఒక చేత్తో సాయం అని చెప్పి.. మరో చేత్తో లాక్కుంటున్నారు.

ప్రధాని పదవీకాలాన్ని నెహ్రూ జైలు జీవితంతో పోల్చిన ప్రియాంక

దేశ తొలి ప్రధానమంత్రి నెహ్రూపై పదేపదే ప్రధానమంత్రి, బీజేపీ విమర్శలు చేస్తుండటంపై ప్రియాంక గాంధీ ఘాటుగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నేళ్లుగా పదవిలో కొనసాగుతున్నారో దాదాపు అన్నేళ్లపాటు దేశ స్వాతంత్ర్య కోసం జవహర్ లాల్ నెహ్రూ జైలు జీవితం గడిపారని గుర్తుచేశారు. ఆయన (నెహ్రూ) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)ను ప్రారంభించకుంటే మీరు మంగళ్‌యాన్ చేపట్టి ఉండేవారు కాదు. ఆయన డీఆర్‌డీఓ ఏర్పాటు చేయకుంటే తేజస్‌లు ఉండేవి కావు అని ప్రియాంక అన్నారు.

ఫ్యూచర్ సిటీలో జూపార్క్ ఏర్పాటు.. కుదిరిన ఒప్పందం

ఫ్యూచర్ సిటీలో కొత్త జూపార్క్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. జూపార్క్ ఏర్పాటుకు వంతారా ఎంవొయు కుదుర్చుకుంది. సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ మేరకు సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జూపార్క్ ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. వన్యప్రాణులకు సేవ అనే నినాదంతో వంతారా పని చేస్తోందని కొనియాడారు. వంతారా సంస్థ ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీకి చెందినది

జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక!

జపాన్‌ తీరంలో తీవ్ర భూకపం తలెత్తింది. భూకంపం తీవ్రత రిక్టార్‌ స్కేల్‌పై దాదాపు 7.2గా నమోదైంది. సముద్రం అలలు 10 అడుగుల మేర ఎగసిపడుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర జపాన్ అంతటా సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. జపాన్ తూర్పు తీరంలో సంభవించిన భారీ భూకంపం కారణంగా హొక్కైడో, అమోరి, ఇవాటే ప్రిఫెక్చర్ల పసిఫిక్ దీవులకు ముందస్తు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

పుదుచ్చేరిలో విజయ్‌ బహిరంగ సభకు అనుమతి..అయితే కొన్ని షరతులు..!

పుదుచ్చేరిలో టీవీకే పార్టీ చీఫ్‌ విజయ్‌ నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు అక్కడి పోలీసులు అనుమతి మంజూరు చేశారు. పోలీసులు విధించిన షరతుల మేరకు విజయ్‌ సభా వేదికపై నుంచి కాకుండా ప్రచారం రథంపై నుంచే మాట్లాడనున్నారు. సభకు 5 వేల మందికి మించి హాజరు కాకూడదు. పాసులు ఉన్నవాళ్లు మాత్రమే సభకు రావాలి. ఈ షరతుల నేపథ్యంలో పుదుచ్చేరి సమీపంలోని తమిళనాడు జిల్లాలకు చెందిన వారు సభకు రావద్దని టీవీకే కోరింది.

రామ్మోహన్‌ నాయుడు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి..మాజీ స్పీకర్‌ డిమాండ్‌

కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు ముందస్తు సమన్వయం సమీక్షలు చేయకపోవడం వల్ల ఇండిగో వంటి ప్రధాన ఎయిర్‌లైన్స్‌ కుప్పకూలాయని తమ్మినేని సీతారాం అన్నారు. ఈ సంక్షోభానికి నైతిక బాధ్యత వహించి రామ్మోహన్‌ నాయుడు తన  మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రామ్మోహన్‌ నాయుడు అసమర్థత వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ ప్రతిష్ట దిగజారిపోయిందని అన్నారు. తన శాఖలోని పరిణామాలు అంచనా వేయకుండా  నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON