loader

కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్..

హర్యానాలో రూ.1.17 కోట్లకు అమ్ముడై, దేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌గా నిలిచిన వీఐపీ నంబర్ ప్లేట్ HR88B8888 మళ్లీ వేలానికి సిద్ధమైంది. రోములస్ సొల్యూషన్స్ డైరెక్టర్ అయిన సుధీర్ కుమార్, అయితే రూ.1.17 కోట్ల బిడ్ మొత్తాన్ని డిసెంబర్ 1న మధ్యాహ్నం 12 గంటల్లోపు ఆయన చెల్లింపు చేయలేకపోయారు.బిడ్ మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి ప్రయత్నించానని.. అది విఫలమైందని తెలిపారు. అంతేకాకుండా, నంబర్ ప్లేట్ కోసం ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయడాన్ని తన కుటుంబం కూడా […]

మున్సిపాలిటీల విలీన ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం

జీహెచ్‌ఎంసీ లో‘మున్సిపాలిటీల విలీన ఆర్డినెన్స్‌’కు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. ఈ ఫైల్‌ ప్రభుత్వానికి చేరడంతో దీనిపై కాసేపట్లో గెలిట్‌ విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇటీవల గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)ను విస్తరించేందుకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.ఔటర్‌ రింగ్‌ రోడ్‌(ఓఆర్‌ఆర్‌)కి లోపల, బయట, దానిని ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలనే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. తెలంగాణ మున్సిపాలిటీల చట్టాలకు అవసరమైన సవరణలు చేయాలని తీర్మానించింది.

హైదరాబాద్‌లో బాలీవుడ్ స్టార్ అజయ్​ దేవ్‌​గణ్​ ఫిల్మ్​ సిటీ…!

ప్రముఖ బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్‌… హైదరాబాద్‌లో ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు ముందుకు రాగా, హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ నిర్వహిస్తుండగా అయితే సమ్మిట్ సందర్బంగా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్… ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. హైదరాబాద్‌లో ఫిల్మ్ సిటీ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయనున్నారు.

మరో కేసులో దోషిగా షేక్‌ హసీనా.. ఐదేళ్ల జైలుశిక్ష

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కు మరో అవినీతి కేసులో ఎదురుదెబ్బ తగిలింది. పూర్బాచల్ న్యూ టౌన్ ప్రాజెక్టు భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఢాకా లోని ప్రత్యేక కోర్టు ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. సోమవారం ఈ సంచలన తీర్పును వెలువరించింది ఇదే కేసులో హసీనా సోదరి షేక్ రెహానాకు ఏడేళ్లు, ఆమె మేనకోడలు, బ్రిటిష్ ఎంపీ తులిప్ సిద్ధిఖీకి రెండేళ్ల జైలుశిక్షను కోర్టు ఖరారు చేసింది.

ఎయిడ్స్ రోగులకు గుడ్​న్యూస్ – త్వరలో 90 వేల మందికి పింఛన్లు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల వల్ల హెచ్‌ఐవీ పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 59 ఏఆర్టీ సెంటర్లలో మందుల కొరత లేకుండా చూస్తున్నామన్నారు. బాధితులకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 90 వేల మంది ఎయిడ్స్ రోగులకు పింఛన్లు ఇచ్చే అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉందని ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సదస్సులో […]

ఆల్ టైమ్ రికార్డుల్లో వైకుంఠ ద్వార దర్శనం బుక్కింగ్

వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని శ్రీవారి దర్శన భాగ్యం కోసం భారీగా భక్తులు తిరుమల దర్శనం లక్కీ డీప్ లో బుక్కింగ్స్ చేరుకున్నారు. దీంతో రేపు (మంగళవారం) మధ్యాహ్నం తర్వాత లక్కీ డ్రా తీసి భక్తులకు టీటీడీ టోకెన్లను కేటాయించనుంది. ఈ డిప్ లో ఎంపికైన వారికి మెస్సెజ్ లు వస్తాయి. టీటీడీ ప్రకటించిన లక్కీ డీప్ కోసం 1.8లక్షల టోకెన్ల కోసం 9.6 లక్షల మంది రిజిస్ట్రేషన్ ల ద్వారా 24,05,237 మంది భక్తులు తమ […]

ఎస్ఐఆర్‌పై చర్చకు మాకు కొంత సమయం కావాలి

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై చర్చ జరపాలని కోరుతున్న విపక్షాల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చడం లేదని, ఎస్ఐఆర్, ఎన్నికల సంస్కరణలపై చర్చకు టైమ్‌లైన్ షరతు పెట్టవద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజైన సోమవారంనాడు రాజ్యసభలో కిరణ్ రిజిజు మాట్లాడుతూ, అఖిలపక్ష సమావేశంలో విపక్ష పార్టీలు తమ దృష్టికి తీసుకువచ్చిన ఏ అంశాన్ని కూడా తాము తక్కువగా చూడటం లేదని చెప్పారు.

బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీలు రివర్స్ – జకియా ఖానం రాజీనామా ఉపసంహరణ

రాజీనామాలు చేసిన ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీల్లో ఇద్దరు వెనక్కి తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నారు. మండలి చైర్మన్ గా కూడా ఉన్న జకియా ఖానం తన రాజీనామ లేఖను ఉపసంహరించుకున్నట్లు శాసన మండలి చైర్మెన్ మోషేన్ రాజుకు చెప్పారు. తాను పునరాలోచన చేసుకున్నానని రాజీనామా లేఖ ఉపసంహరించుకున్నానని చైర్మెన్ మోషేన్ రాజుకు లేఖ ఇచ్చారు. మరో ఎమ్మెల్సీ పోతుల సునీత విచారణకు హాజరు కాలేదు. పోతుల సునిత విచారణ హాజరు కాకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

76వ ప్రజాదర్బార్ నిర్వహించి మంత్రి లోకేశ్

రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 76వ ప్రజాదర్బార్​కు తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రి లోకేశ్ కి విన్నవించారు. వారి నుంచి వినతులను స్వీకరించిన మంత్రి, కొందరికి అక్కడికక్కడే తక్షణ పరిష్కారం చూపించారు. అందరి సమస్యలు ఓపిగ్గా వింటూ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. మంత్రి లోకేశ్​ను స్వయంగా కలిసి సమస్యలు విన్నవించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేశ్, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొని […]

చందానగర్‌లో అగ్ని ప్రమాదం.. గుడిసెలు దగ్ధం

చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ భవన నిర్మాణ సంస్థ వద్ద.. కార్మికులు వేసుకున్న గుడిసెలకు మంటలు అంటుకున్నాయి. అక్కడ దాదాపు 50 గుడిసెలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ప్రమాదానికి గల కారణంగా తెలియ రాలేదు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON