loader

రొమాంటిక్ ‘రెబల్ సాబ్’.. పాన్ ఇండియా బ్యాచిలర్ వచ్చేశాడు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమా నుంచి ‘రెబల్ సాబ్’ ఫస్ట్ సింగిల్ విడుదలైంది. . ప్రభాస్ స్టైలిష్ లుక్స్, పవర్‌ఫుల్ బీట్స్ తో సాగే ఈ పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.  ఎన్నో ఏళ్ల తర్వాత ప్రభాస్ ఒక కలర్ ఫుల్ సాంగ్ తో, వందల మంది డ్యాన్సర్లతో స్టెప్పులేస్తూ కనిపించడం అభిమానులకు విజువల్ ట్రీట్ అనే చెప్పాలి.

విహారయాత్రలో విషాదం.. జంఝావతి డ్యామ్‍‌లో పడి ముగ్గురు గల్లంతు

ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం రోజున జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఆరుగురు గల్లంతయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లాలో జంఝావతి రబ్బర్ డ్యామ్‌లో వద్దకు పిక్నిక్ కోసమని వెళ్లారు.డ్యాంలో ఈతకొట్టేందుకు దిగి ప్రమాదవశాత్తూ డ్యామ్‌లో మునిగి గల్లంతయ్యారు. అనంతగిరి మండలం జీనబాడు వద్ద ఉన్న రైవాడ రిజర్వాయర్‌ వద్ద ప్రమాదవశాత్తూ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతు కాగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. గల్లంతైన మరో ఇద్దరి కోసం పోలీసులు గజఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు.

ఒక్కడినే చేశా: ఇమంది రవి

సినిమాల పైరసీ తాను ఒక్కడినే చేశానని, తనకు ఎవరూ సహకరించలేదని ఐ బొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవి విచారణలో చెప్పాడు. అరెస్టు చేసేందుకు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు వెళ్లగా రవి రెండు గంటల వరకు ఇంటి డోర్ తీయలేదు. ఈ సమయంలో తన వద్ద ఉన్న హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లో ఐ బొమ్మకు సంబంధించిన ఐపి అడ్రస్‌లు, వెబ్‌సైట్ వివరాలు డిలిట్ చేశాడు. పైరసీ సినిమాలు చూసే అలవాటుతో వెబ్‌సైట్‌ను క్రియేట్ చేశానని చెప్పాడు.

దక్షిణాఫ్రికాలో ప్రధాని మోదీ బిజీ బిజీ.. పలు దేశాల ప్రముఖులతో సమావేశాలు..

జీ-20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ చేరుకున్న ప్రధాని మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రధాని మోదీ ఆదివారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, జపాన్ ప్రధానమంత్రి సనే తకైచితో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు మెలోనితో జరిగిన సమావేశంలో భారతదేశం, ఇటలీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంపై ప్రధాని చర్చించారు. అనంతరం జపాన్ ప్రధాని తకైచితో ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్య రంగాలలో ద్వైపాక్షిక సహకారం గురించి చర్చించారు.

పుట్టపర్తిలో లోకేశ్ ప్రజాదర్బార్..

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని క్యాంప్ సైట్‌లో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు వినతులు వెల్లువెత్తాయి. ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చిన వినతులను ఆయన స్వీకరించారు. వారి సమస్యలను ఆయన సావధానంగా విన్నారు. ఈ సమస్యలు పరిష్కరిస్తానని ఈ సందర్భంగా వారికి మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

క్లాట్‌ 2026 పరీక్ష తేదీ వచ్చేసింది.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌

దేశవ్యాప్తంగా 24 నేషనల్ లా యూనివర్సిటీల్లో 2026-27 UG, PG లా కోర్సుల్లో కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) 2026 అడ్మిట్‌కార్డులు తాజాగా విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో మొబైల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ వివరాల లాగిన్‌ అయి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌ 2026) డిసెంబర్‌ 7న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనుంది.

ఘనంగా సత్యసాయి శతజయంతి వేడుకలు-హాజరైన ఉపరాష్ట్రపతి, తెలుగు రాష్ట్రాల సీఎంలు

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని హిల్‌వ్యూ ఆడిటోరియంలో శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌, త్రిపుర గవర్నర్‌ ఇంద్రసేనారెడ్డి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ మంత్రి నారా లోకేశ్‌, తమిళనాడు మంత్రి శేఖర్‌బాబు తదితరులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అంతకుముందు స్వర్ణ రథంపై సత్యసాయి చిత్రపటాన్ని ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకువచ్చారు. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి.

పవన్‌ కల్యాణ్‌ 20 ఏండ్ల నుంచి నాకు మంచి ఫ్రెండ్‌.. విజయసాయి రెడ్డి

అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని విజయసాయి రెడ్డి ప్రకటించారు. శ్రీకాకుళంలో ఆదివారం నాడు రెడ్డి సంక్షేమ సంఘం కార్యక్రమంలో విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతానికి నేను రైతును మాత్రమే అని తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. 20 ఏండ్ల క్రితం నుంచే పవన్‌ కల్యాణ్‌ తనకు మిత్రుడని తెలిపారు. తాను ఎప్పుడూ పవన్‌ కల్యాణ్‌ను విమర్శించలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా పవన్‌ కల్యాణ్‌ను విమర్శించనని చెప్పారు.

స్మృతి మంధాన తండ్రికి అస్వస్థత -పెళ్లి వాయిదా!

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం అర్ధాంతరంగా వాయిదా పడింది, ఆదివారం (నవంబర్ 23) సాయంత్రం 4:30 గంటలకు స్మృతి మంధాన వివాహ వేడుక జరగాల్సి ఉంది. ఈ పెళ్లి కోసం ఇప్పటికే మెహందీ, హల్దీ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. అయితే వివాహ ఆదివారం తెల్లవారుజామున శ్రీనివాస్ మంధానకి గుండెపోటు రావడంతో ఆయన్ని వెంటనే హుటాహుటాన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో స్మృతి మంధాన – పలాష్ ముచ్చల్ వివాహం […]

తెలంగాణ సిఎంవొ, మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూప్స్ హ్యాక్

సైబర్ నేరాలకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవరూ అతీతులు కారు. తెలంగాణలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం వాట్సాప్ గ్రూప్‌తో పాటు, పలువురు మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూప్‌లను హ్యాక్ చేశారు. ఎస్‌బిఐ అకౌంట్ ఆధార్ వెరిఫికేషన్ పేరుతో ప్రమాదకర ఎపికె ఫైల్స్‌ని కేటుగాళ్లు పంపించారు. వెంటనే సదురు ప్రమాదకరమైన లింకులు క్లిక్ చేసి ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలని పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON