loader

అతి త్వరలో మళ్లీ కలుద్దాం.. ‘వారణాసి’పై మహేష్ బాబు, రాజమౌళి ట్వీట్లు వైరల్

గ్లోబ్ ట్రాటింగ్ ఈవెంట్‌కు హాజరైన అభిమానులకు, మీడియాకు మహేష్, రాజమౌళి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానుల ఓర్పు, క్రమశిక్షణను రాజమౌళి ప్రశంసించారు. టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోకి వస్తున్న ఆదరణకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలియజేసింది. “నా అభిమానులు, మీడియా, దూర ప్రాంతాల నుండి వచ్చి చిత్ర బృందాన్ని ఎంతో ఆప్యాయతతో ఆదరించి ప్రేమ కురిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అతి త్వరలో మనందరం మళ్లీ కలుద్దాం” అని మహేష్ బాబు […]

ఆన్‌లైన్ గేమ్స్‌తో.. ఊరు ఊరంతా ఆగమాగం.

స్మార్ట్‌ఫోన్ల కారణంగా ఆన్‌లైన్ పేకాట, బెట్టింగ్‌ల వ్యసనం మెదక్ జిల్లా, నిజాంపేటలోని చల్మెడ వంటి గ్రామాలను చుట్టుముట్టింది. సుమారు 20 మంది యువకులు తక్కువ టైమ్‌లో ఎక్కువ డబ్బు ఆశించి, లక్షల రూపాయలు అప్పుల పాలయ్యారు. ఈ అప్పులు తీర్చడానికి తల్లిదండ్రులు తమకున్న పొలాలు, భూములు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అధిక వడ్డీకి అప్పులిచ్చే ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారుల వేధింపులతో కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. ఆన్‌లైన్ గేమ్స్ ఉచ్చులో పడకుండా యువత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

రామోజీ ఎక్స్‌లెన్స్‌ అవార్డులు చరిత్ర సృష్టించబోతున్నాయి : ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

రామోజీరావు ఓ కుగ్రామం నుంచి వచ్చి ఎంతో గొప్ప స్థాయికి ఎదిగారని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ కొనిడాయారు. రామోజీ గ్రూప్‌ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్స్‌లెన్స్‌ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాధాకృష్ణన్‌ ప్రసంగించారు. సిబ్బందిలో రామోజీరావు బృంద స్ఫూర్తిని నింపేవారుని అన్నారు. ఆలోచనలను సంస్థలుగా తీర్చిదిద్దిన వ్యక్తి రామోజీరావని కొనిడాయారు

లాలూ నివాసాన్ని వీడిన మరో ముగ్గురు కుమార్తెలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఘోర పరాజయం తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అంతర్గత కలహాలు తీవ్రస్థాయికి చేరాయి. రెండో కుమార్తె రోహిణి ఆచార్య తర్వాత ఆయన మరో ముగ్గురు కుమార్తెలు కూడా ఆ ఇంటి నుంచి వెళ్లిపోయారు. లాలూ మరో ముగ్గురు కుమార్తెలైన రాజలక్ష్మి, రాగిణి, చందా కూడా పాట్నాలోని కుటుంబ నివాసాన్ని వీడారు. తమ పిల్లలతో కలిసి ఆదివారం ఢిల్లీ వెళ్లారు. దీంతో లాలూ కుటుంబం మరింతగా చీలిపోయింది.

ప్రముఖ అమెరికన్ సింగర్ అకాన్ కి బెంగళూరులో అవమానం

ప్రముఖ అమెరికన్ గాయకుడు అకాన్ ఇండియా టూర్ లో భాగంగా నవంబర్ 14 న బెంగళూరులో నిర్వహించిన కన్సర్ట్ లో పెర్ఫామ్ చేశాడు. ఈ ఈవెంట్ లో ప్రేక్షకులు ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కచేరీ సమయంలో ముందు వరుసలో ఉన్న కొంతమంది అభిమానులు అకాన్ ప్యాంట్ ను లాగిన ఘటన బయటకు రావడంతో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలో బెంగళూరు ప్రదర్శన సమయంలో జరిగిన ఘటన ఇప్పుడు నగరంపై విమర్శలు రావడానికి […]

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ కార్యక్రమం ప్రారంభం..

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ కార్యక్రమం రామోజీ ఫిలిం సిటీలో ఇవాళ(ఆదివారం) సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అలాగే ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పాల్గొన్నారు. జర్నలిజం, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా ఏడు రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డులను ప్రధానం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా […]

సభల్లో ఖాళీ కుర్చీలున్న వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు .. ఉద్ధవ్‌ ఠాక్రే

మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బీహార్‌ ఎన్నికల ఫలితాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ర్యాలీలను ఉద్ధవ్‌ ఠాక్రే ప్రస్తావించారు. ఆయన సభల్లో కనిపించిన భారీ జనసమూహం నిజమైనదా లేదా ‘ఏఐ’ ద్వారా సృష్టించారా? అని ప్రశ్నించారు. ‘భారీ జనసమూహాన్ని పొందిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. ఖాళీ కుర్చీలను ఆకర్షించిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజాస్వామ్యం లెక్క ఇది. దీనిని అర్థం చేసుకోవడం కష్టం’ […]

చంద్రబాబు, లోకేశ్‌ గొప్పల కోసం వందల కోట్లు ఖర్చు చేశారు..గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజం

విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ పార్టనర్‌షిస్‌ సమ్మిట్‌తో లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శలు గుప్పించారు. గతంలో 2014-19 మధ్యలో ఇలాగే మూడుసార్లు సీఐఐ సదస్సులు నిర్వహించి.. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చంద్రబాబు నమ్మించారని గుర్తుచేశారు. పాత సినిమాకు చంద్రబాబు కొత్త పేరు పెట్టారని విమర్శించారు. లులు చైర్మన్‌ చంద్రబాబు ఆస్థాన విద్వాంసుడు అని గుడివాడ అమర్‌నాథ్‌ ఎద్దేవా చేశారు. ఏ సదస్సు […]

యుద్ధ ఖైదీలను మార్చుకునేందుకు సిద్ధమవుతున్న ఉక్రెయిన్‌-రష్యా..!

రష్యా-ఉక్రెయిన్ వివాదం మూడేళ్లుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో రెండు దేశాలు కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యాయి. టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరిగాయని ఉక్రెయిన్ జాతీయ భద్రత, రక్షణ మండలి కార్యదర్శి రుస్తం ఉమెరోవ్ శనివారం తెలిపారు. 2022లో ఇస్తాంబుల్‌లో ఏర్పాటు చేసిన ఖైదీల మార్పిడికి సంబంధించిన నియమాలను అమలు చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. తుది సాంకేతిక, విధానపరమైన నిర్ణయాలు త్వరలో తీసుకుంటామని ఉమెరోవ్ చెప్పారు.

మెక్సికోలో రెచ్చిపోయిన జెన్‌ జెడ్ ..నిరసనల్లో చెలరేగిన హింస

జెన్ జెడ్ ఉద్యమం ఉత్తర అమెరికాను తాకింది. తాజాగా మెక్సికోలో వేలాది మంది యువత రోడ్లపైకి వచ్చిన నిసనలు చేశారు. దేశ అధ్యక్షురాలు క్లాడియా షిన్‌బామ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ ప్యాలెస్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను ముసుగులు ధరించిన కొందరు నిరసనకారులు కూల్చేశారు.అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిరసనకారులపైకి టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. కాగా, ఈ ఘర్షణల్లో 100 మంది పోలీసులకు గాయాలయ్యాయని సిటీ సిటిజెన్ సేఫ్టీ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON