loader

ఎన్నికల సమయం లోనే ఉగ్రదాడులా ?: సిద్ధరామయ్య

దేశంలో ఎన్నికల సమయంలోనే ఉగ్రదాడులు జరుగుతుండడానికి కారణాలేమిటని కర్ణాటక సిఎం సిద్ధరామయ్య సందేహాన్ని వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి ప్రకటనపై విపక్షం బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. బుధవారం తన ఎక్స్ ఖాతా ద్వారా సిఎం సిద్ధరామయ్య ఎన్నికల సమయం లోనే ఉగ్రమూకల దాడులు జరగడానికి కారణాలేమిటని ప్రశ్నించారు. మంగళవారం బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్‌పూర్తయిన తరువాత సిద్ధరామయ్య వ్యాఖ్యలు వచ్చాయి. దేశంలో బాంబు పేలుళ్లు జరగకూడదని, అమాయక ప్రజలు చనిపోతారని పేర్కొన్నారు

రెడ్ కలర్ ఎకోస్పోర్ట్ కారు స్వాధీనం.. ఎక్కడ దొరికిందంటే..

ఢిల్లీ పేలుడు ఘటనలో అనుమానిత స్పోర్ట్స్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్నట్లు ఫరీదాబాద్ పోలీసులు ప్రకటించారు. ఖండవాలి గ్రామం దగ్గర పార్క్ చేసిన ఉన్న కారును స్వాధీనం చేసుకుని తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాది డా.ఉమర్ పేరుపై రిజిస్టర్‌ అయిన ఎకో స్పోర్ట్స్ కారు DL10CK0458 కోసం ఢిల్లీ, హర్యానా, కశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఉదయం నుంచి గాలించారు. ఆ కారు డాక్టర్ ఉమర్ కు చెందిన ఖండవాలి ఇంటి వెలుపల ఆపి ఉంచినట్లు […]

ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కార్ పరుగులు పెడుతోంది: మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ లో ఇకపై నమో అంటే నరేంద్ర మోడీ కాదు… నాయుడు అండ్ మోడీ. ఇద్దరు సమర్థ నేతల నేతృత్వాన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన యుఎస్ – ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ సమ్మిట్‌లో మంత్రి లోకేశ్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు మా లక్ష్యం $2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక […]

ఢిల్లీ పేలుడు ఘ‌ట‌న ఉగ్ర‌వాదుల చ‌ర్యే : కేంద్రం

ఢిల్లీ పేలుడు ఘ‌ట‌న‌ను కేంద్ర కేబినెట్ తీవ్రంగా ఖండించింది. ఈ పేలుడు ఘ‌ట‌న ఉగ్ర‌వాదుల చ‌ర్యే అని కేంద్రం పేర్కొంది. ఈ ఘ‌ట‌న‌కు కార‌కులైన వారిని చ‌ట్టం ముందు నిల‌బెడుతామ‌ని తెలిపింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని కేంద్రం కేబినెట్ ఆమోదించిన‌ట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ వెల్ల‌డించారు. ఉగ్ర‌వాదంపై పోరు కొసాగుతుంద‌ని స్ప‌ష్టం చేసింది కేబినెట్. ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న తీరు, భ‌ద్ర‌తా చ‌ర్య‌లను మోదీకి అమిత్ షా వివ‌రించిన‌ట్లు స‌మాచారం.

ఆస్పత్రి నుంచి ధర్మేంద్ర, గోవిందా డిశ్చార్జి

బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర, గోవింద బుధవారంనాడు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక్కడి బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటున్న 89 ఏళ్ల ధర్మేంద్ర ఉదయాన్నే ఇంటికి వెళ్లారు. ఆయనకు ఇంట్లోనే చికిత్స అందజేయనున్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. మరోవైపు స్వల్ప అనారోగ్యానికి గురైన మరో నటుడు గోవిందా(61) మంగళవారంనాడు రాత్రి కొంత స్పృహ కోల్పోవడంతో క్రిటీ కేర్ ఆస్పత్రికి వచ్చారు. అక్కడ వైద్యుల పరీక్షల అనంతరం బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు.

డిసెంబర్ 6న భారీ పేలుళ్లకు ప్లాన్.. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారం

ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ నబీ.. అసలు టార్గెట్ ఇప్పుడు కాదని.. డిసెంబర్ 6వ తేదీ అని తేలింది. 1996 డిసెంబర్ 6వ తేదీన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసిన రోజు సందర్భంగా.. ఈ ఏడాది డిసెంబర్ 6వ తేదీన భారీ మొత్తంలో పేలుళ్లకు పాల్పడేందుకు ప్లాన్ చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితేఈ ప్లాన్‌లో భాగంగా పేలుడు పదార్థాలను తరలిస్తుండగా.. అనుకోకుండా ఈ పేలుడు జరిగినట్లు గుర్తించారు.

సిఐడి సిట్ విచారణకు హజరయిన ప్రకాశ్ రాజ్

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ బుధవారం విచారణకు హాజరయ్యారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌పై నమోదయిన కేసులను సిఐడికి బదిలి చేయడంతో విచారణకు హజరు కావాలని సిఐడి సిట్ అధికారులు నోటిసులు ఇచ్చారు. ప్రకాశ్ రాజ్‌ను గంటపాట్నర పాటు సిట్ అధికారులు పలు కోణాల్లో ప్రశ్నించినట్లు సమాచారం. విచారణ అనంతరం ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పేనన్నారు. బ్యాంక్ స్టేట్‌మెంట్, బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు సంబంధించిన సమాచారం అధికారులకు ఇచ్చానని […]

#SSMB29 నుంచి ప్రియాంక ఫస్ట్ లుక్ వచ్చేసింది..

సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్  పాన్ వరల్డ్ మూవీ #SSMB29. మూవీ కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా టైటిల్, గ్లింప్స్ విడుదల చేసేందుకు #GlobTrotter అనే పేరుతో పెద్ద ఈవెంట్ కు మేకర్స్ ప్లాన్ చేశారు. తాజాగా హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. పసుపు కలర్ శారీలో గన్ కాలుస్తున్న ప్రియాంక పోస్టర్ ను వదిలారు. ఇందులో ఆమె మందాకిని […]

చంచల్‌గూడ జైల్లో రౌడీ షీటర్ల మధ్య ఘర్షణ

చంచల్‌గూడ జైల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఖైదీలుగా ఉన్న ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య ఘర్షణ జరిగింది. రౌడీ షీటర్ల జాబ్రిపై మరో రౌడీ షీటర్ దస్తగిరి దాడి చేశాడు. ఈ ఘర్షణలో ములాఖత్‌ రూమ్‌లో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. జాబ్రి, దస్తగిరిల మధ్య ఉన్న పాత కక్షల నేపథ్యంలోనే జైల్లో దాడి చేసుకున్నట్లు సమాచారం.  ఈ ఘటనను జైలు అధికారులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది.

కేంద్రం వైఫల్యం వల్లే దిల్లీలో పేలుడు- ఖర్గే

కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే దిల్లీలో బాంబు పేలుడు జరిగిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఉగ్ర మూకలకు భయాన్ని కలిగించేలా, వారికి గట్టి హెచ్చరిక పంపేలా దోషులకు కఠిన శిక్షను విధించాలని ఆయన డిమాండ్ చేశారు. భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించే ఇంటెలిజెన్స్ బ్యూరో, సీబీఐ లాంటి అత్యున్నత స్థాయి సంస్థలకు నెలవైన దేశ రాజధానిలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. చాలా భద్రతా విభాగాలు ఉన్నప్పటికీ, దిల్లీలో బాంబు పేలుడును ఆపడంలో […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON