13కు చేరిన మృతుల సంఖ్య.. ఘటనా స్థలిని పరిశీలించిన హోం మంత్రి..!
ఢిల్లీ కారు పేలుడు ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనంతరం.. సంఘటనా స్థలానికంటే ముందు ఎల్‌ఎన్‌జేపీలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను షా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితితో పాటు పేలుడు గురించిన సమాచారాన్ని ఆయన తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పేలుడు జరిగిన ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్దకు వెళ్లారు షా. పేలుడులో తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్నవారిలో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు13 మంది చనిపోయారని సమాచారం.

