loader

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. డబ్బులు పంచుతున్న 11 మంది కాంగ్రెస్‌ నాయకుల అరెస్టు

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో నియోజకవర్గ ఓటర్లు కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసేందుకు ఓటర్లకు డబ్బులు పంచే కార్యక్రమాలను మొదలుపెట్టింది. షేక్‌పేట డివిజన్‌ ఎల్లారెడ్డిగూడలో బహిరంగంగానే డబ్బుల పంపిణీని ప్రారంభించింది. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి చీరలు, డబ్బులు పంపిణీ చేస్తున్నారు. మరోవైపు ఎర్రగడ్డలోనూ కాంగ్రెస్‌ నాయకులు భారీగా డబ్బులు పంచేందుకు సిద్ధమయ్యారు. దీనికోసం హోటల్‌ పాలక్‌లో సమావేశమయ్యారనే సమాచారం తెలిసిన పోలీసులు రైడ్‌ చేశారు. దాదాపు 11 మందిని అరెస్టు చేసి, పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

లక్నోలో రోడ్డు ప్రమాదం… యువ హాకీ ప్లేయర్ దుర్మరణం..!

జాతీయ స్థాయిలో అథ్లెట్‌గా, హాకీ ప్లేయర్‌గా రాణిస్తున్న ఓ యుకెరటం జీవితం అర్ధాంతరంగా ముగిసింది. లక్నోలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జూలీ యాదవ్ అనే 23 ఏళ్ల అమ్మాయి దర్మరణం చెందింది. స్పోర్ట్స్ ఈవెంట్ కోసం ముందుగానే వెళ్లింది. అయితే.. మొబైల్ ఫోన్ ఇంటి వద్దనే మర్చిపోయింది తను. ఫోన్ కోసం ఇంటికి వెళ్తుండగా.. గ్యాస్ సిలిండర్లతో కూడిన ట్రక్కు జూలీ బండిని ఢీకొన్నది. వేగంగా వచ్చిన ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఈ సంఘటనలో తను […]

జూబ్లీహిల్స్ లో భారీ మెజార్టీతో గెలువబోతున్నాం: కెటిఆర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గతంలో కంటే అధిక మెజార్టీతో గెలువబోతున్నామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను తక్కువ అంచనా వేసినవారికి, తెలంగాణ ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేసిన వారికి నవంబర్ 14న మంచి సౌండ్ వినిపిస్తుందని అన్నారు. కడుపు మండిన 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల తరపున 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేసి కాంగ్రెస్‌కు బుద్ది చెప్పబోతున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు.

దయచేసి ఫ్రీ బస్‌ పథకం తీసేయండి.. మహిళల విజ్ఞప్తి

కాంగ్రెస్‌ ప్రభుత్వం, సీఎం రేవంత్‌ రెడ్డి ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చాలా బస్టాప్‌ల్లో మహిళలు కనిపిస్తే బస్ డ్రైవర్లు ఆపకుండానే వెళ్తున్నారని ఇప్పటికే పలువురు ఆరోపిస్తూనే ఉన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూర్‌లో మహిళలు ఆందోళనకు దిగారు. బస్సులను ఆపకపోవడంతో రహదారిపై బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు పథకంతో తమకు మర్యాద లేకుండా పోతుందని ఆవేదన చెందారు. దయచేసి ఈ ఫ్రీ బస్‌ స్కీమ్‌ను ఎత్తివేయండని సీఎం రేవంత్‌ రెడ్డిని విజ్ఞప్తి చేశారు.

నేటికాలంలో అనారోగ్యమే అసలైన పేదరికం – సీఎం చంద్రబాబు

భారీ ఖర్చుతో కూడుకున్న వైద్య సేవలను నిరుపేదలకు ఉచితంగా అందిస్తున్న శంకర కంటి ఆసుపత్రి సేవలు అమూల్యమైనవని సీఎం పేర్కొన్నారు. నంబూరులో శంకర కంటి ఆసుపత్రి నూతన భవనాన్ని కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతీతో కలిసి ప్రారంభించారు. శంకర కంటి ఆసుపత్రి దాదాపు 5 దశాబ్ధాలుగా ఎంతో మంది నిరుపేదలకు అత్యుత్తమ వైద్య సేవలను ఉచితంగా అందించడం అభినందనీయమని. అనారోగ్యమే నిజమైన పేదరికమన్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు శంకర్‌ కంటి ఆసుపత్రి చేస్తున్న కృషిని అభినందిస్తున్నానని తెలిపారు.

ఢిల్లీలో దిగజారుతున్న గాలి నాణ్యత.. జనం నిరసన

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత స్థాయిలు మరింత దిగజారుతున్నాయి. దీంతో ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇండియా గేట్‌ వద్ద భారీ నిరసన చేపట్టారు. ఆప్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలతోపాటు ఢిల్లీ వాసులు ఇండియా గేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. జీవించే హక్కు తమకు ఉన్నదని నినాదాలు చేశారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోనేందుకు ప్రభుత్వం సమర్థవంతమైన విధానాలు రూపొందించాలని డిమాండ్ చేశారు.

మంత్రి కాన్వాయ్‌కే అడ్డుపడుతూ డ్రైవింగ్ చేసిన ఆటో డ్రైవర్..

మంత్రి ప్రయాణిస్తున్న కారుకు ఫుల్లుగా మందు తాగి ఉన్న ఆటో డ్రైవర్ సైడ్ ఇవ్వలేదు. సైరన్ కొట్టానా ఆటో డ్రైవర్ బాలన్న మంత్రి కాన్వాయ్‌కు సైడ్ ఇవ్వలేదు. ఆఖరికి పోలీస్ ఎస్కార్ట్ వాహనంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేసినా కూడా రోడ్డుపై అటు ఇటు అడ్డంగా ఆటో తిప్పుతూ కంగారు పెట్టాడు… ఏకంగా మంత్రి ప్రయాణిస్తున్న కారునే ఢీకొట్టబోయాడు ఆటో డ్రైవర్. మద్యం తాగి ఆటో నడిపి… ప్రమాదానికి గురైతే… ఎవరిది బాధ్యత అంటూ అతని డ్రైవింగ్ […]

సంకీర్ణ ప్రభుత్వంలో చేరే ప్రసక్తే లేదు.. ప్రశాంత్ కిషోర్

బిహార్ ప్రజలు ఇప్పటికీ మార్పును కోరుకోకుంటే వారితోనే ఉంటూ మరో ఐదేళ్లు పనిచేస్తూ వెళ్తాం. ప్రభుత్వంలో చేరే ప్రసక్తి కూడా లేదు. జనసురాజ్ సొంత బలంపైనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. బలం లేకుంటే ప్రతిపక్షంలో కూర్చుంటుంది. అవసరమైతే మరోసారి ఎన్నికకు వెళ్తాం. మేము బీజేపీకి వ్యతిరేకం. సైద్ధాంతికంగా వారితో మేము విభేదిస్తున్నాం’ అని ఆదివారం నాడు ఒక ఇంటర్వూలో ప్రశాంత్ కిషోర్ తెలిపారు. జన్‌సురాజ్ నిర్మాణానికి తాము ఎంతో కష్టపడ్డామని, మార్పు ఇప్పటికే కనిపిస్తోందని, ఫలితాల కోసం […]

పవన్ కళ్యాణ్ పలమనేరు పర్యటనలో అపశ్రుతి..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా పర్యటనలో ఆయనను చూసేందుకు అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కాన్వాయి వచ్చిన సమయంలో ఒక్కసారిగా వారి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే హేమలత అనే మహిళ కిందపడగా.. ఆమె కాలిపై నుంచి పవన్ కళ్యాణ్ కారు వెళ్లింది. ఈ ఘటనలో హేమలతకు గాయాలు కాగా.. పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఓట్ల చోరీ విషయంలో మోదీ, అమిత్ ​షా ఎక్కడికెళ్లినా​ దొరికిపోతారు: రాహుల్​ గాంధీ

ఓట్ల చోరీ విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్ ​షాలు​ దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా చివరకు దొరికిపోతారని కాంగ్రెస్​ ఎంపీ, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బిహార్​లోని కిషన్​గంజ్​లో జరిగిన ర్యాలీలో అన్నారు. బిహార్​లో 100శాతం ఇండియా కూటమి అధికారం చేపడుతుందని చెప్పారు. బీజేపీ, ఆరెస్సెస్‌లు దేశాన్ని విభజించేందుకు యత్నిస్తున్నాయని, మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటకల్లో ఓట్ల చోరీపై ఆధారాలు చూపించామని కానీ ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్​ షా, ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్​ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON