loader

‘SIR కనిపించని నిశ్శబ్ద రిగ్గింగ్‌’- ఈసీ, బీజేపీపై మమతా ఫైర్​

ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు వ్యతిరేకంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ కోల్‌కతాలో భారీ ప్రదర్శన నిర్వహించింది. ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సారథ్యంలో ఈ ర్యాలీ జరిగింది. E.C.ని పూర్తిగా రాజీపడిన సంస్థగా, SIRను మోసపూరితపనిగా TMC అభివర్ణించింది. BJP, ఎన్నికల సంఘం కలిసి జరిపే కనిపించని నిశ్శబ్ద రిగ్గింగ్‌ అని పేర్కొంది.  మొత్తం 3.8 కిలోమీటర్ల మేర ఈ మార్చ్ కొనసాగిన ఈ ర్యాలీతో ఆ దారులన్నీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలతో నిండిపోయాయి.

బిహార్‌లో తొలి విడత పోలింగ్‌కు రంగం సిద్ధం- ముగిసిన ప్రచార గడువు

బిహార్‌లో తొలి విడత పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఈనెల 6న 18 జిల్లాల పరిధిలోని 121నియోజకవర్గాల్లో ఓటింగ్‌ జరగనుంది. ఎన్డీయే, మహాగఠ్‌బంధన్‌ కూటముల హోరాహోరీ ప్రచారం మంగళవారం సాయంత్రం 5గంటలకు ముగిసింది. ఇరుకూటముల తరఫున అగ్రనేతలు సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఈ విడతలో RJD అగ్రనేత, మహాగఠ్‌బంధన్‌ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌, ఆయన సోదరుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌, బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌధరీ, జానపద గాయకురాలు మైతిలీ ఠాకూర్‌ సహా 1,314మంది అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

‘జూబ్లీ ‘లో బిజెపికి జనసేన మద్దతు

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నువ్వా-నేనా అన్నట్లు త్రిముఖ పోటీ జరుగుతున్న సమయంలో తెలంగాణ జనసేన పార్టీ బిజెపికి మద్దతు ప్రకటించింది. తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షుడు ఎన్. శంకర్ గౌడ్‌ను మంగళవారం సాగర్ సొసైటీలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, ముఖ్య నాయకులతో మంతనాలు జరిపారు. బిజెపి అభ్యర్థికి మద్దతుగా ఒక రోజు రోడ్-షో, బహిరంగ సభకు హాజరుకావాల్సిందిగా పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించాలని బిజెపి […]

రాహుల్ ద్రవిడ్ చిన్న కొడుకుకి బంపర్ ఆఫర్..

భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియాకు హెడ్ కోచ్‌గా పనిచేసిన రాహుల్ ద్రవిడ్‌ వారసత్వాన్ని ఆయన కుమారులు ముందుకు తీసుకువెళుతున్నారు. ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్‌ క్రికెట్ కెరీర్‌లో మరో మెట్టు ఎక్కారు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అవార్డులు అందుకోవడంతో పాటు, ఇటీవల వీనూ మాంకడ్ ట్రోఫీలో కర్ణాటకకు కెప్టెన్‌గా వ్యవహరించిన అన్వయ్.. హైదరాబాద్‌లో బుధవారం నుంచి ప్రారంభం కానున్న పురుషుల అండర్-19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీకి ప్రకటించిన భారత జట్టులో అన్వయ్ చోటు దక్కించుకున్నాడు.

విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్‌.. సస్పెండ్‌

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో టీచర్‌ హాయిగా కుర్చీలో కూర్చొని ఫోన్‌ మాట్లాడుతూ.. ఇద్దరు విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంది. వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ క్రమంలో విచారణ జరిపిన ఉన్నతాధికారులు టీచర్‌ సుజాతను సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు సీతంపేట ఐటీడీఏ పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

రైతులు కష్టాల్లో ఉంటే జల్సా టూర్లలో తండ్రీ కొడుకులు:జగన్ ఫైర్

‘వ్యవసాయం దండగ అన్న సీఎం చంద్రబాబు అదే ధోరణితో వ్యవహరిస్తున్నారని… రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో దాదాపు 16 ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని, దాంతో రైతులకు నష్టం కలుగుతోందని, అయినా ఏ ఒక్క రైతును ఆదుకున్న దాఖలా లేదు’అని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఇప్పుడు తుపాన్‌లో నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని, రైతులకు అండగా వైసీపీ నిలుస్తుంది’ అని […]

ఘోర రైలు ప్రమాదం..ఐదుగురు ప్రయాణికుల దుర్మరణం

ఛత్తీస్‌గఢ్‌‌లోని బిలాస్‌పూర్‌‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న కోర్బా ప్యాసింజర్‌ రైలు జయరామ్‌ నగర్‌ స్టేషన్‌ వద్ద ఆగివున్న గూడ్స్‌ రైలును ఢీకొట్టింది. మంగళవారం సాయంత్రం 4గంటల సమయంలో ఈ ఘటన జరిగింది అని తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 30 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాల్పుల కలకలం.. గన్‌తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..

హైదరాబాద్‌లో కాల్పుల కలకలం రేగింది. మణికొండ పంచవటి కాలనీలో ఓ స్థల వివాదానికి సంబంధించి ఏపీ మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు గాల్లోకి కాల్పులు జరపడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. పంచవటి కాలనీలో ఉన్న తమ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తమ్ముడు కేఈ ప్రభాకర్ బెదిరింపులకు పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. ఖాళీ చేస్తారా..? లేదా అంటూ ప్రభాకర్ తన గన్‌తో గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు […]

హిందుజా గ్రూప్ చైర్మన్ కన్నుమూత

ప్రముఖ వ్యాపార సంస్థ హిందుజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ పి హిందుజా కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. లండన్‌లోని ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారని కుటుంబ వర్గాలు తెలిపాయి. హిందుజా సోదరులలో అగ్రజుడైన గోపీచంద్ చాలాకాలంగా అస్వస్థతతో ఉన్నారు.  హిందుజా కుటుంబంలో రెండో తరానికి చెందిన వారు. 2023 మేలో తన సోదరుడు శ్రీచంద్ మరణాంతరం గ్రూప్ సంస్థలకు చైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు. గోపీచంద్‌కు భార్య సునీత, కుమారుడు సంజయ్, ధీరజ్‌లు ఉన్నారు.

మినీ బస్సు బోల్తా.. 26 మంది విద్యార్థులకు గాయాలు

జమ్ము కశ్మీర్‌లో ప్రమాదం జరిగింది. రాజౌరి జిల్లాలో ఓ మినీ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 30 మందిదాకా గాయపడ్డారు. బస్సు రాజౌరి పట్టణానికి వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో థాండికాస్సి సమీపంలో హైవేపైకి రాగానే డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఈ ఘటనలో 28 మంది గాయపడ్డారు. అందులో 26 మంది విద్యార్థులేనని అధికారులు తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON