loader

మహిళా జట్టుకు డైమండ్ నెక్లెస్‌లు.. సూరత్ వ్యాపారి భారీ బహుమతులు..

మహిళల వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది సూరత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపీ గోవింద్ ఢోలాకియా అమ్మాయిల జట్టు ప్రపంచకప్ సాధిస్తే సభ్యులందరికీ వజ్రాల నెక్లెస్‌లు, సోలార్ ప్యానెళ్లు ఇవ్వాలనుకుంటున్నట్టు ఫైనల్ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు లేఖ రాశారు త్వరలోనే మహిళా జట్టు సభ్యులకు డైమండ్ నెక్లెస్‌లు ఇస్తానని, వారి ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తానని సోషల్ […]

సీఎం చంద్రబాబు నాయుడు లండన్ పర్యటనలో

రాష్ట్రానికి పెట్టుబడులను స్వాగతించేందుకు వరుసగా పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అవుతున్నారు. సోమవారం లండన్‌లోని ది లాంగ్లీ, బకింగ్‌హామ్‌షైర్‌లో హిందుజా గ్రూప్ చైర్మన్ అశోక్ హిందుజా, ఆ సంస్థ యూరప్ చైర్మన్ ప్రకాశ్ హిందుజాతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను ముఖ్యమంత్రి ముందుగా వారికి వివరించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హిందూజా గ్రూప్‌తో కీలక ఒప్పందం కుదిరింది. దశలవారీగా ఏపీలో రూ.20 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని హిందూజా గ్రూప్ నిర్ణయించుకుంది.

కేంద్రంలో కొత్తగా అవమానాల మంత్రిత్వ శాఖ.. మోదీపై ప్రియాంక విసుర్లు

దేశాన్ని, బిహార్‌ను అవమానించారంటూ విపక్ష నేతలపై ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ ముద్ర వేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. ఇందుకోసం కేంద్రంలో కొత్తగా అవమానాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో అవినీతి, ఎన్డీయే ప్రభుత్వ దుష్పరిపాలనపై ఒక్కమాట కూడా మాట్లాడరని విమర్శించారు. ఎన్నికల సమయంలో వరాలు ప్రకటించడానికి బదులు గత 20 ఏళ్లలో ఎన్డీయే సర్కార్ ఏమి చేసిందో మోదీ, అమిత్‌షా చెప్పాలని డిమాండ్ చేశారు.

4 ఏళ్ల నిరీక్షణ ఫలించింది..టీమిండియా విక్టరీ సాంగ్

మహిళా వన్డే ప్రపంచకప్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ అద్భుతమైన విజయం తర్వాత, భారత జట్టు గత నాలుగు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తమ విక్టరీ సాంగ్‎ను విడుదల చేసింది. విన్నింగ్ సాంగ్‌ను గెలిచిన తర్వాతే విడుదల చేయాలని టీమ్ సభ్యులు గతంలోనే నిర్ణయించుకున్నారని జెమిమా రోడ్రిగ్స్ తెలిపారు. ఈ సందర్భంగా బీసీసీఐ సోషల్ మీడియాలో విడుదల చేసిన ఈ పాట లిరిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది మృతి, 50 మందికి పైగా గాయాలు !

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని లోహమండి రోడ్డు ప్రాంతంలో దారుణమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం సేవించిన డంపర్ ట్రక్ డ్రైవర్, కంట్రోల్ తప్పి సుమారు 5 కిలోమీటర్ల మేర వేగంగా వాహనాలను ఢీకొంటూ పోయాడు. ఈ బీభత్సంలో ఎదురుగా వచ్చిన కార్లు, మోటార్‌సైకిళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ మత్తులో అతివేగంగా ట్రక్ వాహనాలను ఢీకొంటూ వెళ్లిన తర్వాత, చివరకు ఒక […]

గూగుల్​ మ్యాప్​లో ఆర్టీసీ బస్సు టికెట్​ బుక్​ చేసుకోవచ్చు!

మొబైల్​ ఫోన్​తో గూగుల్​ మ్యాప్స్​లోకి వెళ్లి ఏ ఊరికి వెళ్లాలనే వివరాలు అందులో నమోదు చేసి, ఎక్కాల్సిన బస్సును ఎంచుకుని డబ్బులు చెల్లిస్తే చాలు అప్పటికప్పుడు రిజర్వేషన్​ ఖరారవుతుంది. తెలంగాణ పరిధిలో తిరిగే బస్సులు, అంతరాష్ట్ర సర్వీసుల వివరాలకు గూగుల్​కు ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం జాబితా సిద్ధం చేసింది. ఈ మహానగర పరిధిలోని సిటీ బస్సుల సమాచారాన్ని ఐటీ శాఖ ద్వారా గూగుల్​కు కొద్దిరోజులు క్రితం అందించినట్లు ఆర్టీసీ వర్గాల సమాచారం. గూగుల్స్​ మ్యాప్​లో ప్రస్తుతం టెస్టింగ్​ […]

కోయంబత్తూరులో 19 ఏళ్ల విద్యార్థిని అత్యాచార ఘటన

దేశంలో మరో అత్యాచార ఘటన ప్రజల్లో కలవరం సృష్టిస్తోంది. తమిళనాడులోని కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఓ కళాశాలలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని ఆదివారం అత్యాచారానికి గురయ్యింది. అత్యాచారానికి గురైన ఓ విద్యార్థిని.. ఆదివారం వినీత్ అనే వ్యక్తితో కలిసి ఆ ప్రాంతానికి వచ్చినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆ దారిలో వెళుతున్న ముగ్గురు వ్యక్తులు యువకుడు వినీత్ పై కత్తితో దాడి చేసి విద్యార్థిని అపహరించిన ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేసి […]

ఎక్స్‌ట్రీమిస్ట్ అనే పదాన్ని ఇంగ్లీషులో రాసి చూపించు’:ఒవైసీ ప్రశ్న

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న తరుణంలో.. ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనను ‘అతివాది’ (ఎక్స్‌ట్రీమిస్ట్) అని పిలిచిన తేజస్వీ.. ఆ పదాన్ని ‘పాకిస్థాన్ నుంచి తెచ్చుకున్నారా” అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. తేజస్వీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. “హే బాబూ, ‘ఎక్స్‌ట్రీమిస్ట్’ని ఒక్కసారి ఇంగ్లీషులో రాసి చూపించు” అంటూ ఎద్దేవా చేశారు.

టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ కు పోటీగా కొత్త యాప్

వీరీల్స్(vreels) ఒకే చోట కంటెంట్ సృష్టి, వినోదం, సంభాషణకు డిజిటల్ వేదికగా పనిచేస్తుంది. ఇందులో ప్రతి యూజర్ ఒక క్రియేటర్ గా మారే అవకాశం ఉంది. చాట్స్, కాల్స్ కనెక్ట్ అయ్యేందుకు.. స్నేహితులతో మాట్లాడటానికి, గ్రూప్ చేయటానికి లేదా వీడియో కాల్ చేసుకోవటానికి వేర్వేరు యాప్ లు అవసరం లేదు. వీరీల్స్ లోనే ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. అమెరికాలోని తెలుగు ఇంజినీర్లు దీన్ని తయారు చేయడం విశేషం. ఇది ఇప్పటికే 22 దేశాల్లో విడుదలై, ప్రస్తుతం బీటా […]

ఉద్యోగమిప్పించమని వచ్చి.. ఎమ్మెల్యేని కుళ్లబొడిచేశాడు

ఎమ్మెల్యే సార్‌ని కలిసి ఉద్యోగం ఇప్పించమని కోరతానని ఇంట్లోకి వెళ్లాడు. ఎమ్మెల్యేకి దూరం నుంచి నమస్కారం పెట్టి, దగ్గరకి వెళ్లాడోలేదో.. అదే పనిగా ఎమ్మెల్యే పొట్ట మీద పడిగుద్దులు కురిపించాడు. రెప్పపాటులో అదేపనిగా ఎక్కడ దొరికితే అక్కడ శరీరాన్ని కుళ్ళబొడిచేశాడు. ఈ విస్తుబోయే ఘటన పశ్చిమబెంగాల్ లో జరిగింది. బాధిత వ్యక్తి పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన జ్యోతిప్రియ మల్లిక్. సదరు ఎమ్మెల్యే సాక్షాత్తూ తన నివాసంలోనే దాడికి గురయ్యారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON