శ్రీకాకుళం తొక్కిసలాటపై చంద్రబాబు సీరియస్..
సామాన్య భక్తుల ప్రాణాలను బలితీసుకున్న శ్రీకాకుళం తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రభుత్వం విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు ప్రైవేట్ వ్యక్తులవల్ల ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. కాశీబుగ్గ వెంకటేశ్వస్వామి ఆలయంలో తొక్కిసలాటకు నిర్వహకులు నిర్లక్ష్యమే కారణమని స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఈ ఘటనకు కారకులైన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని… తక్షణమే కస్టడీలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

