loader

షారుఖ్ ఖాన్

షారుఖ్ ఖాన్ (జననం 2 నవంబరు 1965)  ప్రముఖ భారతీయ సినీ నటుడు, నిర్మాత టివీ ప్రముఖుడు. అభిమానులు ఆయనను బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ అని పిలుస్తారు. షారూఖ్ దాదాపు 80 సినిమాల్లో నటించారు. ఆయన 14 ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు. ఆసియాలో షారూఖ్ చాలా ప్రముఖుడైన నటుడు. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కువ నివసించే ప్రదేశాల్లో కూడా ఆయన చాలా ప్రసిద్ధుడు. అభిమానుల సంఖ్య, వసూళ్ళు లెక్కలో షారూఖ్ ప్రపంచంలోని అత్యంత సక్సెస్ ఫుల్ ఫిలిం […]

వైన్ షాప్ వచ్చింది…ఉద్యోగం ఊడింది

జిల్లా కేంద్రంలోని 16వ నెంబర్ మద్యం షాపునకు ఇటీవల జరిగిన టెండర్లలో రామ్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో పిఇటిగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు భూపాని పుష్ప పాల్గొన్నారు. ఆ టెండర్ల లక్కీ డిప్‌లో షాపు ఆమెకు దక్కింది. అయితే సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు టెండర్లలో పాల్గొనకూడదని మద్యం షాప్ టెండర్‌ దారులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. వైన్ షాప్ దక్కించుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిఇఒ శనివారం సస్పెన్షన్ […]

కాశీబుగ్గ ఆలయాన్ని పరిశీలించిన నారా లోకేష్

కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనలో పలువురు భక్తులు మరణించారన్న వార్త తెలిసిన వెంటనే, హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి అనిత కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయానికి చేరుకున్నారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతం, ఆలయంలో రద్దీకి కారణాలు, భక్తుల భద్రత వివరాలు ఆరా తీశారు. నేటి దర్శనాల సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందని అధికారులను, ఆలయానికి సంబంధించిన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

మారిన హైదరాబాద్ మెట్రోరైల్ సమయాలు.. 3 నుంచి అమలు

మెట్రో రైలు ప్రయాణ వెళల్లో మార్పులు,. ఉదయం 6 గం.ల నుంచి రాత్రి 11 గం.ల వరకు అన్ని టెర్మినెల్స్‌లో అన్ని రోజుల్లో ప్రయాణ సదుపాయం ఉంటుందని మెట్రో రైలు యాజమాన్యం పేర్కొంది. ప్రస్తుతం సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 6 గం.ల నుంచి రాత్రి 11.45 గం.ల వరకు, శనివారం ఉదయం 6 గం.ల నుండి రాత్రి 11 గం.ల వరకు, ఆదివారం ఉదయం 7 గం.ల నుండి రాత్రి 11 గం.ల వరకు […]

సత్యసాయి సంజీవనీ హాస్పిటల్‌‌ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ

బిల్ కౌంటర్‌ ఊసేలేని ఆస్పత్రులుగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన సత్యసాయి సంజీవనీ ఆస్పత్రులలో ఒకటైన రాయపూర్ సత్యసాయి సంజీవనీ ఆస్పత్రిని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. చిన్నపిల్లల గుండె సంబంధ శస్త్రచికిత్సలకు ప్రత్యేకమైన ఆ ఆస్పత్రిలో ఆపరేషన్లు పూర్తయి ఆరోగ్యంగా ఉన్న చిన్నారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ క్రికెటర్ సత్య సాయి సంజీవనీ హాస్పటల్స్ ట్రస్టీల్లో ఒకరైన సునీల్ గవాస్కర్ కూడా పాల్గొన్నారు. సత్యసాయి సంజీవనీ ఆస్పత్రుల ఛైర్మన్ శ్రీనివాసన్ ప్రధానికి సత్యసాయి చిత్ర […]

కిషన్ రెడ్డిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా:మంత్రి అజహరుద్దీన్

తనను దేశద్రోహి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసి వ్యాఖ్యలపై మంత్రి అజహరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఇప్పటికే ఖండించిన అజారుద్దీన్  కిషన్ రెడ్డిపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. తనపై వచ్చిన ఆరోపణలపై కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన తాను దేశ ద్రోహినా అని ఆయన ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే బిజెపి తనను టార్గెట్ చేసిందని మంత్రి అజహరుద్దీన్ దుయ్యబట్టారు.

ఢిల్లీ పేరు మార్చాలని అమిత్ షాకు బీజేపీ ఎంపీ లేఖ

దేశంలోని పలు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు పట్టణాలు, నగరాలు, గ్రామాల పేర్లను మార్చే ప్రక్రియ కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు అదే తరహాలో ఢిల్లీ బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేవాల్.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు ఒక లేఖ రాశారు. ఢిల్లీ నగరానికి ఉన్న ఘనమైన ప్రాచీన వారసత్వం, సంస్కృతిని దృష్టిలో ఉంచుకుని.. ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలని ఆయన కోరారు. ఎంపీ ప్రవీణ్ ఖండేవాల్ తన లేఖలో ఢిల్లీ చారిత్రక ప్రాముఖ్యతను గుర్తు చేశారు.

బీసీ హాస్టల్‌లో విద్యార్థుల అస్వస్థత.. వెల్ఫేర్‌ ఆఫీసర్‌ సస్పెన్షన్‌

జోగులాంబ గద్వాల : జిల్లాలోని అల్లంపూర్ తాలూకా ఎర్రవల్లి మండలం ధర్మవరం ప్రభుత్వ బీసీ హాస్టల్‌లో విద్యార్థుల అస్వస్థతపై కలెక్టర్ బి.ఎం.సంతోష్ సీరియస్‌ అయ్యారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం, వంటశాల సిబ్బందిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ జయరాములు విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఘటనపై సమగ్ర పరిశీలన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్‌ వెల్లడించారు. ముందస్తు లిఖిత అనుమతి పొందకుండా ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లకూడదని స్పష్టం చేశారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు..

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అందిన బాంబు బెదిరింపు ఈమెయిల్ సంచలనం సృష్టించింది. జెడ్డా నుండి హైదరాబాద్ వస్తున్న ఇండిగో 6E 68 విమానంలో “హ్యూమన్ బాంబ్” ఉన్నట్లు ఆ ఈమెయిల్‌లో హెచ్చరించారు. దీంతో అధికారులు అప్రమత్తమై అత్యవసర ప్రోటోకాల్స్ అమలు చేశారు. ఈ బెదిరింపు నేపథ్యంలో అధికారులు విమానాన్ని వెంటనే ముంబైకి మళ్లించారు. ముంబైలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, పూర్తి తనిఖీలు నిర్వహించిన తర్వాత ఎలాంటి సమస్య లేదని నిర్ధారించారని పోలీసులు తెలిపారు.

ఎన్డీయే నకిలీ జాతీయవాదాన్ని ప్రచారం చేస్తోంది : ప్రియాంకాగాంధీ

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచేందుకు ఎన్డీయే సర్కారు విభజన రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ ఆరోపించారు. నకిలీ జాతీయవాదం ను ప్రచారం చేస్తోందని విమర్శించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించలేకనే ఓట్ల చోరీకి పాల్పడుతోందని బీజేపీపై మండిపడ్డారు. ఓట్ల తొలగింపు అనేది హక్కుల ఉల్లంఘనతో సమానమని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెగుసరాయ్‌లో తన తొలి ప్రచారసభలో ప్రసంగించారు. దేశాభివృద్ధికి బీహార్‌ ఎంతో దోహదపడిందని అన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON