సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు.. ప్రధాని మోదీ నివాళులు
గుజరాత్‌లోని కేవడియాలో ఉన్న ప్రపంచంలోని అతి ఎత్తైన ఐక్యతా విగ్రహం వద్ద శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని గుర్తుచేసుకుని భారతదేశవ్యాప్తంగా రాష్ట్రీయ ఐక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్) వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా గుజరాత్‌కు చేరుకుని, ఐక్యతా విగ్రహం వద్ద సర్దార్ పటేల్‌కు పుష్పాంజలి అర్పించారు. స్థానికులు, త్రివిధ దళాలతో కలిసి.. ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
      
 
					 
					 
					 
					 
					 
					 
					 
					 
					 
								 
								