loader

జెమీమా చిరస్మరణీయ శతకం.. మూడోసారి ఫైనల్లో టీమిండియా

ఉత్కంఠ రేపిన సెమీ ఫైనల్లో భారత జట్టు జయభేరి మోగించింది.. ఎనిమిదిసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాకు చెక్ పెడుతూ రికార్డు లక్ష్యాన్ని మరో ఓవర్ ఉండగానే ఊదిపడేసింది. భారీ ఛేదనలో జెమీమా రోడ్రిగ్స్‌(127 నాటౌట్) చిరస్మరణీయ శతకంతో చెలరేగగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(89)తో సెంచరీ భాగస్వామ్యంతో విజయానికి బాటలు వేశారు. వరల్డ్ కప్ నాకౌట్ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని చేదించింది టీమిండియా. 5 వికెట్ల తేడాతో కంగారూలను ఓడించిన హర్మన్‌ప్రీత్ సేన ఆదివారం దక్షిణాఫ్రికాతో టైటిల్ పోరులో తలపడనుంది.

దావూద్‌ ఇబ్రహీం టెర్రరిస్ట్‌ కాదు.. వివాదంలో మమతా కులకర్ణి..!

సన్యాసినిగా మారిన బాలీవుడ్‌ నటి మమతా కులకర్ణి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు మోస్ట్‌ వాంటెడ్‌ డాన్‌గా ఉన్న దావూద్‌ ఇబ్రహీం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దావూద్‌ ఇబ్రహీం చాలా మంచి వ్యక్తి అని అన్నారు. అంతేకాదు దావూద్ ఇబ్రహీం టెర్రరిస్ట్‌ కాదని అన్నారు. ముంబై పేలుళ్లతో దావూద్‌కు సంబంధం లేదన్నారు. దావూద్‌కు మమత క్లీన్‌చిట్‌ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. అయితే తనకు దావూద్‌ ఇబ్రహీంతో ఎలాంటి సంబంధాలు లేవన్నారు మమతా కులకర్ణి. జీవితంలో […]

ప్రపంచ క్రికెట్‌ను నియత్రించేది భారత్.. గ్రెగ్ చాపెల్

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను భారతదేశం నియంత్రిస్తుందని భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ అన్నారు. ఫలితాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి భారత జట్టు తన అధికారాన్ని ఉపయోగిస్తుందని చెప్పిన మాజీ ఐసీసీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్‌ను చాపెల్ కూడా సమర్ధించడం గమనార్హం. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాపెల్ మాట్లాడుతూ, గంగూలీ క్రికెట్ ఆడటానికి శ్రీలంకకు వెళ్లడానికి వీలుగా అతనిపై సస్పెన్షన్‌ను తగ్గించాలని మాజీ బీసీసీఐ, ఐసీసీ చీఫ్ జగ్మోహన్ దాల్మియా అభ్యర్థించారని అన్నారు.

అమెరికాలో తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాం: నాట్స్

అమెరికాలో తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. అమెరికాలోని ఉత్తర కరోలీనాలో షార్లెట్‌లో నాట్స్ తన నూతన విభాగాన్ని ప్రారంభించింది. షార్లెట్‌లో తెలుగు వారి కోసం మంచి కార్యక్రమాలు చేపట్టి నాట్స్ ప్రతిష్ఠను మరింత పెంచాలని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి కోరారు విభాగం ప్రారంభం సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు, పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు.

2 గంటల సలహాకు రూ.11 కోట్లు.. నవయుగ కంపెనీతో పీకే ఒప్పందం..

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఒక్క సలహా కోసం రూ.11 కోట్లు డిమాండ్ చేసిన ఘటన చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌కు చెందిన ఓ ఇంజనీరింగ్‌ కంపెనీ కొత్త ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌ కోసం ఆయన సలహా కోరగా.. కేవలం రెండు గంటల కన్సల్టేషన్‌ కోసం ఈ భారీ మొత్తం అడిగినట్లు సమాచారం. ప్రస్తుతం రాజకీయాలతో పాటు వ్యాపార, సలహా రంగాల్లోనూ కొనసాగుతున్నారు. అయితే ఈ ఫీజు వివరాలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది

భారత 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియామకం…

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. భారత 53వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్‌ను ప్రభుత్వం నియమించినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఆయన నవంబర్ 24న ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆయన దాదాపు 14 నెలల పాటు ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. ఆయన 2027 ఫిబ్రవరి 9న పదవీ విరమణ చేయనున్నారు.

టాటా మోటార్స్ నుంచి బైక్స్ వచ్చాయా?

టాటా మోటార్స్ ఇప్పుడు ద్విచక్ర వాహన రంగంలోకి ప్రవేశిస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందరికీ అందుబాటు ధరల్లో 125CC కమ్యూటర్ బైక్‌ను తీసుకొస్తోందని.. దానికి సంబంధించిన పోస్టర్ అంటూ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యాక్ట్ చెక్ చేసి ఏఐ జెనరేటెడ్ ఇమేజ్ అని తేల్చుతున్నారు. ఇప్పటివరకు టాటా మోటార్స్ నుంచి ఎలాంటి స్పందన లేదు. కంపెనీ అధికారికంగా ప్రకటించేవరకు ఎలాంటివి నమ్మకపోవడమే మంచిది. సోషల్ మీడియాలో జరిగే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని అర్థం చేసుకోవచ్చు.

హై కమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్..అజారుద్దీన్‌ ప్రమాణస్వీకారం

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుంచి అనుమతి లభించింది. శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు రాజ్‌భవన్‌లో అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ కార్యాలయం ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది.

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. బ్రతికుండగానే మార్చురీలో..

మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ రోగిని.. ఆధార్ కార్డు లేదనే నెపంతో సిబ్బంది ఆసుపత్రిలో చేర్చుకోకపోవడం అతడు ఏ మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉండటంతో, అతడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? తెలుసుకోకుండా మృతి చెందాడనే అనుమానంతో అతడి బాడీని మార్చురీకి పంపించారు. స్వీపర్లు రోగి కదలికలను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆస్పత్రిలో చేర్పించి అతడికి చికిత్స చేయిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON