loader

నిమ్మవాగులో కొట్టుకుపోయిన డీసీఎం ..డ్రైవర్ గల్లంతు

తుపాన్‌ ప్రభావంతో ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని కొనిజర్ల మండలంలో గల పల్లిపాడు -ఏన్కూర్ మార్గ మధ్యలో ఉన్న బ్రిడ్జిపై పొంగిపొర్లుతున్న నీటి ప్రవాహం నుంచి డ్రైవర్ డీసీఎం వ్యాను దాటించే ప్రయత్నం చేశాడు. అయితే బ్రిడ్జి మధ్యలోకి రాగానే వాహనం ఆగిపోవడంతో స్థానికులు డీసీఎంను వదిలి ఒడ్డుకు రావాలని ఎంత చెప్పిన వినలేదు. దీంతో డీసీఎం నీటి ప్రవాహంలో కొట్టుకు పోయింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ నీటిలో గల్లంతు అయ్యాడు.

‘ఆయన వల్లే కాంగ్రెస్ ఈ స్థితికి’- రాహుల్‌ మిస్సింగ్ పోస్టర్‌తో బీజేపీ

రాహుల్‌ గాంధీ మిస్సింగ్’ అనే పోస్టర్‌తో కాంగ్రెస్ అగ్రనేతపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ విమర్శలు గుప్పించారు. చివరిసారిగా 59 రోజుల క్రితం బిహార్‌లో రాహుల్‌గాంధీ కనిపించారని, ఆ పోస్టర్‌లో ప్రస్తావించారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్‌‌పై రాహుల్ నిర్లక్ష్యం వహిస్తున్నారని, తద్వారా విపక్ష మహాగఠ్​బంధన్ కూటమిలో కాంగ్రెస్ స్థాయిని తగ్గిస్తున్నారని ఆరోపించారు. ఈమేరకు అమిత్ మాలవీయ ఎక్స్ వేదికగా ఒక యానిమేటెడ్ పోస్టర్‌ను అప్‌లోడ్ చేశారు.

భారీ వర్షానికి కూలిన బ్రహ్మంగారి నివాస గృహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడపలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాస గృహం భారీ వర్షానికి కూలిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాస గృహం కుప్పకూలింది. బ్రహ్మంగారి నివాస గృహం కూలిపోవడంపై భక్తుల్లో ఆందోళన చెందుతున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న నివాస గృహం కూలిపోవడం తమ మనోభావాలను దెబ్బతిన్నాయని భక్తులు అవేదన వ్యక్తం చేశారు. పురాతన దేవాలయాలు మరమత్తులు చేపట్టాలని డిమాండ్లు చేస్తున్నారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం మళ్లీ పునర్ నిర్మించాలని […]

క‌రీంన‌గ‌ర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. బ‌ట్ట‌ల షాపులో చెల‌రేగిన మంట‌లు

క‌రీంన‌గ‌ర్ జిల్లా కేంద్రంలోని ట‌వ‌ర్ స‌ర్కిల్ వ‌ద్ద బుధ‌వారం ఉద‌యం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. క‌పిల డ్ర‌స్సెస్ షోరూమ్‌లో షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో క్ష‌ణాల్లోనే ప‌క్క‌నున్న షాపుల‌కు కూడా మంట‌లు వ్యాపించాయి. ఈ మంట‌ల్లో బ‌ట్ట‌ల దుకాణంతో పాటు వినాయ‌క ఎంటర్‌ప్రైజెస్, ఫొటోగ్ర‌ఫి షాపు, కెనాన్ ఫొటోగ్ర‌ఫి దుకాణాలు పూర్తిగా ద‌గ్ధ‌మ‌య్యాయి.

రెండు ప్రాణాల‌ను కాపాడేందుకు..విరిగిన చెట్ల‌ను తొల‌గించిన 108 సిబ్బంది

మ‌హ‌బూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు – మ‌హ‌బూబాబాద్ ర‌హ‌దారిపై ఓ భారీ చెట్టు విరిగి ప‌డింది. దారిలో ఓ రెండు అంబులెన్స్‌లు అత్య‌వ‌స‌రంగా ఆస్ప‌త్రికి వెళ్లాల్సి ఉంది. శ్వాస స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న రోగి, మ‌రో అంబులెన్స్‌లో నిండు గ‌ర్భిణిని త‌ర‌లిస్తున్నారు. చెట్టు విరిగి ప‌డ‌డంతో వాహ‌నాలు ముందుకు క‌ద‌ల్లేని ప‌రిస్థితి. అంబులెన్స్ సిబ్బంది మ‌ల్లేశ్ యాద‌వ్, వీర్న‌, రాజు క‌లిసి గొడ్డ‌లితో చెట్టు కొమ్మ‌ల‌ను న‌రికేసి ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేశారు. అనంత‌రం వారిని స‌కాలంలో ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించి వారి […]

ఆ విధంగా చేయడంతోనే తుపాన్ బారిన పడకుండా చేశాం: చంద్రబాబు

వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందించాలని, తుపాను నష్టం అంచనాలను త్వరితగతిన సిద్ధం చేయాలని అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సిఎం నుంచి సచివాలయం సిబ్బంది వరకు అందరూ టీమ్‌గా పని చేశామని, కష్టంకాలంలో బాధితుల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. మరో రెండో రోజులు ఇలానే పని చేస్తే మరింద ఊరట ఇవ్వగలుగుతామని, మంత్రులు అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని సూచించారు.

కరీబియన్ దీవుల్లో బీభత్సం సృష్టిస్తోన్న హరికేన్ మెలిస్సా

అక్టోబర్ 28న జమైకాలో తుఫాను మెలిస్సా తీరాన్ని తాకింది. తీరాన్ని తాకుతూనే విపత్కర గాలులు, కుండపోత వర్షం, భారీ తుఫానును తీసుకువచ్చింది. కేటగిరీ 5 హరికేన్ మాండెవిల్లే, బ్లాక్ రివర్, మాంటెగో బే వంటి ప్రదేశాలలో విధ్వంసం సృష్టించింది. చర్చి, ఇళ్ళు ధ్వంసమయ్యాయి. వీధులన్నీ వరదలతో నిండిపోవడంతో పాటుగా కార్లు నీటిలో మునిగిపోయాయి. కరీబియన్‌ తీరం వెంబడి ఉన్న దేశాలపై మెలిస్సా విరుచుకుపడుతోంది. 295 కిలోమీటర్ల వేగంతో గాలులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. గాలుల తీవ్రతకు చెట్లు కూలిపోయాయి. […]

శ్రీశైలంలో కుండపోత వర్షం.. విరిగిపడ్డ కొండచరియలు

మొంథా తుపాను ప్రభావంతో శ్రీశైలంలో ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. శ్రీశైలం రోప్ వే సమీపంలోని పాతాళగంగ వద్ద మూడు షాపులపై భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. . దీంతో శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలో రోడ్డుపైకి వర్షపు నీరు పొంగిపొర్లుతోంది. శ్రీశైలం – దోర్నాల ఘాట్ రోడ్డులో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి దోర్నాల వెళ్లె ఘాట్ రోడ్డులోని తుమ్మలబైలు, చింతల […]

హైదరాబాద్‌లో విమాన ఇంజిన్‌ విడిభాగాల తయారీ యూనిట్‌..

భారత ఏరోస్పేస్ రంగంలో కీలక ముందడుగు పడింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వాణిజ్య, యుద్ధ విమానాల ఇంజిన్ల తయారీ సంస్థ సాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్స్‌ భాగస్వామ్యంతో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్ (TASL) హైదరాబాద్‌లోని ఆదిభట్లలో అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రం ప్రారంభోత్సవాన్ని మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ అధికారులు, సాఫ్రాన్‌ ప్రతినిధుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.

‘మొంథా’ తుపాన్ ఎఫెక్ట్ – 28 వేల సర్వీసులకు విద్యుత్‌ అంతరాయం

తుపాను కారణంగా వివిధ చోట్ల విద్యుత్‌ స్తంభాలు దెబ్బతినడం, ట్రాన్స్‌ఫార్మర్లు పాడవడంతో 28,083 సర్వీసులకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వాటిలో 21,057 సర్వీసులకు విద్యుత్‌ సరఫరాను సిబ్బంది పునరుద్ధరించారు. వివిధ ప్రాంతాల్లో స్తంభాలు విరిగి పడటం, విద్యుత్‌ లైన్లపై చెట్లు కూలడంతో తీగలు తెగి విద్యుత్‌ సరఫరాకు ఇబ్బంది ఏర్పడింది. రాష్ట్రంలో 246 గ్రామాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడితే మంగళవారం రాత్రికి 197 గ్రామాలకు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON