loader

మొంథా ఎఫెక్ట్.. నేషనల్ హైవే-16 క్లోజ్

మొంథా తుఫాన్ ప్రభావం దృష్ట్యా ప్రజల ప్రాణ మరియు ఆస్తి భద్రతను కాపాడే లక్ష్యంతో… నేషనల్ హైవే–16పై అన్ని రకాల వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపి వేశారు అధికారులు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇది కొనసాగుతుందని.. అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ తెలిపారు. తుఫాన్ తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, భారీ వర్షాలు మరియు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున  వాహనదారులు తమ భద్రత కోసం సమీపంలోని పార్కింగ్ బేలు లేదా సురక్షిత […]

ఇదేమైనా దండయాత్ర..! ఒక్కసారే గ్లోబ్‌ను చుట్టుముట్టిన తుఫాన్లు

గ్లోబ్‌పై ఒకే రేఖవెంబడి మూడు తీవ్ర తుఫాన్‌లు పుట్టాయి. ప్రస్తుతం మొంథా తీరాన్ని తాకినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ల్యాండ్‌ ఫాల్ ప్రక్రియ ప్రారంభమైంది. మరో 3-4గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడింది మొంథా. దీని ప్రభావం ఇప్పటికే ఏపీ తీర ప్రాంతంపై పడింది. ఇక జమైకా తీరప్రాంతం అట్లాంటిక్ మహాసముద్రంలో మెలీషా ఏర్పడింది. ఇక చివరిది పపిఫిక్ మహాసముద్రంలో ఏర్పడింది సోనియా. ఇది మన మొంథా తుఫాన్‌లాగే తీవ్రమైంది కానీ తీరం తాకదు. సముద్రంలో […]

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 8వ వేతన సంఘానికి కేబినెట్‌ ఆమోదం!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించారు కేంద్రమంత్రి అశ్వినివైష్ణవ్‌. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు. 8వ వేతనసంఘం ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో 50 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. రబీసీజన్‌లో రైతులకు రూ.38 వేల కోట్ల ఎరువుల సబ్సిడీ ఇస్తునట్టు తెలిపారు. వ్యవసాయరంగంలో ఆధునిక పద్దతులకు ప్రోత్సాహం ఇస్తునట్టు చెప్పారు.

రాత్రంతా సచివాలయంలోనే సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ మంగళవారం (అక్టోబర్ 28) రాత్రికి ఏపీ సచివాలయంలోనే సీఎం చంద్రబాబు ఉండాలని నిర్ణయించుకున్నారు. తుఫాన్‌ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. మొంథా తుఫాన్‌పై మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి కీలక సూచనలు జారీ చేస్తున్నారు. తుఫాన్ ముప్పు నుంచి ప్రజలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా, ఆస్తి నష్టం తగ్గేలా చర్యలు తీసుకోవాలన్నారు […]

మొంథా తుపానుపై పిఠాపురంలో అప్రమత్తత.. గంట గంటకు సమీక్షిస్తున్న పవన్ కల్యాణ్

మొంథా తుపాను ప్రభావం పిఠాపురం నియోజకవర్గంపై తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో  సర్వ సన్నద్ధతతో ఏర్పాట్లు చేశారు. కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తో టెలీ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ కాకినాడ జిల్లాలో ఉన్న తుపాను ప్రభావ పరిస్థితులను ఉప ముఖ్యమంత్రి సమీక్షిస్తూ ఉన్నారు. .గంట గంటకు నివేదికలు తీసుకుంటున్నారు.  పిఠాపురం నియోజకవర్గంలో పరిస్థితిపై […]

డ్రగ్స్ రవాణా చేస్తున్న పడవలపై అమెరికా సైన్యం దాడులు

తూర్పు పసిఫిక్ జలాల్లో మాదకద్రవ్యాలు తీసుకెళ్తున్నాయన్న అనుమానంతో అమెరికా సైన్యం మూడు దాడులు చేసింది. దాడులలో 14 మంది మరణించగా ఒకరు తప్పించుకున్నారు. అమెరికా రక్షణ మంత్రి పీట్ హేగ్సేత్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఒకే రోజు మూడు దాడులు జరపడం ఇదే ప్రథమం. ప్రాణాలతో బయటపడిన ఏకైకవ్యక్తిని మెక్సికన్ సెర్చ్ అండ్ రెస్క్యూ అధికారులు రక్షించారని హేగ్సేత్ తెలిపారు. అయితే అతడిని అమెరికాకు అప్పగిస్తారా లేదా అన్నది వెల్లడి కాలేదు.

మొంథా సైక్లోన్ ఎఫెక్ట్.. ఈ తెలంగాణ జిల్లాల్లో

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మొంథా తుపాను ప్రభావం ఈస్ట్ తెలంగాణ జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని… ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

వెటరన్ పేసర్‌కు అత్యున్నత గౌరవం..‘నైట్‌హుడ్‌’ స్వీకరించిన అండర్సన్

ఇంగ్లండ్ వెట‌ర‌న్ పేస‌ర్ జేమ్స్ అండ‌ర్సన్‌కు అరుదైన గౌర‌వం ల‌భించింది. ఫాస్ట్ బౌలర్‌గా జాతీయ జట్టుకు 21 ఏళ్లు విశేష సేవ‌లందించిందుకు ‘నైట్‌హుడ్’ బిరుదును స్వీక‌రించాడీ లెజెండ్. బ్రిటన్‌ రాణి అన్నె చేతుల మీదుగా మంగళవారం అండరన్సన్ నైట్ హుడ్‌ మెడల్‌ను అందుకున్నాడు. ఇక నుంచి అండర్సన్ పేరు ముందు సర్ అనే పదం చేరనుంది. ఇప్పటివ‌ర‌కు 12 మంది ఇంగ్లండ్ మాజీలు మాత్రమే ఈ అవార్డు అందుకున్నారు.

అంతర్వేది పాలెం వద్ద తీరాన్ని తాకిన మొంథా..

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మొంథా తీరాన్ని తాకింది. కాకినాడ-మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం వద్ద తుపాను తీరాన్ని తాకిందని వాతావరణశాఖ తెలిపింది. గడిచిన ఆరుగంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో తీరం వైపుగా వచ్చిందని..కాకినాడకు 110 కిలోమీటర్లు, మంచిలీపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు పేర్కొంది. తుపాను తీరం దాటుతున్న నేపథ్యంలో తీర ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. తుపాను పూర్తిగా తీరం దాటేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని వాతావరణశాఖ తెలిపింది.

పుట్టపర్తి రోడ్ల అభివృద్ధికి 30 కోట్లు మంజూరు: పవన్ కల్యాణ్

భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆహ్వానించారు. భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా నియోజకవర్గవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించినట్టు చెప్పారు. శ్రీ సత్యసాయి మందిరానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.30 కోట్లు అదనంగా కేటాయించినట్టు చెప్పారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON