loader

రూ.855 కోట్లతో ‘రిలయన్స్​ ఏఐ వెంచర్’​- అందులో ఫేస్​బుక్​ వాటా 30 శాతం

ఇండియన్ బిలియనీర్​ ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్​ ఇప్పుడు కృత్రిమ మేధ సేవల (ఏఐ సర్వీసులు)పై దృష్టి కేంద్రీకరించింది. రిలయన్స్​ ఎంటర్​ ప్రైజెస్​, మెటాకు చెందిన అనుబంధ సంస్థ ఫేస్​బుక్​ ఓవర్సీస్​, ఐఎన్​సీ కలిసి ఈ జాయింట్​ వెంచర్​ను ప్రారంభించనున్నాయి. రూ.855 కోట్ల పెట్టుబడితో ప్రారంభించనున్న ఈ జాయింట్ ఏఐ వెంచర్​లో రిలయన్స్ ఎంటర్​ప్రైజెస్​​ 70 శాతం వాటా కాగా, మెటా అనుబంధ సంస్థ అయిన ఫేస్​బుక్​ ఓవర్సీస్​ 30 శాతం వాటాను కలిగి ఉంటాయని […]

హిట్‌మ్యాన్ శతకం.. కోహ్లీ అర్ధ శతకం..

విరాట్ కోహ్లీ మూడో వన్డేలో రోహిత్ శర్మతో కలిసి భారత్‌కు విజయాన్ని అందించాడు రోహిత్ శర్మ సెంచరీతో (121 పరుగులు) అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అతని 33వ వన్డే సెంచరీ కాగా, ఓవరాల్ 50వ అంతర్జాతీయ సెంచరీ.  కోహ్లీ, రోహిత్ 168 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వన్డేల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 100 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని 19వ సారి నెలకొల్పారు. సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ, కుమార్ సంగక్కర- తిలకరత్నే దిల్షాన్ మాత్రమే ఇప్పుడు అత్యధిక […]

అదరగొట్టిన రోకో.. సిడ్నీలో భారత్ ఘన విజయం

భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో శనివారం (అక్టోబర్ 25) జరిగిన మూడో వన్డేలో టీమిండియా విక్టరీ కొట్టింది. సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో గెలుచుకున్నప్పటికీ, చివరి మ్యాచ్‌లో భారత్ ఆధిపత్యం చూపించింది. దీంతో కంగారు టీమ్ భారత్‌ పై ద్వైపాక్షిక సిరీస్‌లో క్లీన్ స్వీప్ రికార్డును మరోసారి అందుకోలేకపోయింది. భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచి గౌరవప్రదంగా సిరీస్‌ను ముగించింది.

ఎంజీఎం పీడియాట్రిక్ వార్డులో దయనీయ స్థితి

ఎంజీఎం హాస్పిటల్ పీడియాట్రిక్ వార్డులో దయనీయ పరిస్థితి కనిపిస్తుంది. వైద్య సేవలు పొందుతున్న చిన్నారులకు అందుతున్న సేవల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా వున్న ప్రభుత్వ హాస్పిటల్ పరిస్థితికి ఎంజీఎం ఘటన అద్దం పడుతుంది. వేర్వేరు సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులకు ఒకటే ఆక్సిజన్ సిలిండర్ అమర్చి, పరీక్షలకు తరలిస్తున్నారు. పరీక్షలకు తరలించేందుకు కేర్ టేకర్లు లేక ఆక్సిజన్ సిలిండర్‌తో పాటు పిల్లలను కూడా స్వయంగా తామే తరలించాల్సి వస్తుందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం […]

అందరి ఫోన్లు, వాట్సాప్ ఖాతాలపై నిఘా పెట్టాం’: బీజేపీ మంత్రి

మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి చంద్రశేఖర్ బవంకులే ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ.. మీ అందరి ఫోన్లు, వాట్సాప్ ఖాతాలపై నిధా పెట్టామని అన్నారు. అంతటితో ఆగకుండా పార్టీకి నష్టం కలిగించే ఏ చిన్న పని చేసినా తమకు వెంటనే తెలిసిపోతుందని.. దానిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాను చేసిన వ్యాఖ్యలు ప్రజలందరినీ ఉద్దేశించినవి కాదని.. కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలనే తాను హెచ్చరించానని […]

ఒఆర్‌ఆర్‌పై ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తా

రంగారెడ్డి జిల్లాలోని పెద్ద అంబర్‌పేట్‌ వద్ద ఒఆర్‌ఆర్‌పై ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడడంతో డిఆర్ డిఒ, హయత్ నగర్ లో వివిధ ఆస్పత్రులకు తరలించారు. న్యూ గో ట్రావెల్స్ బస్సు మియాపూర్‌ నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 20 మంది ప్రయాణికులున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓఆర్ఆర్ పైనుంచి కిందకు దిగుతుండగా మూలమలుపు వద్ద బోల్తాపడింది. […]

టీటీడీ పరకామణి కేసు.. హైకోర్టులో ఈవో సింఘాల్ కీలక అఫిడవిట్

టీటీడీ పరకామణి చోరీ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. టీటీడీ అనుమతి లేకుండానే.. అప్పటి ఏవీఎస్‌వో సతీష్ కుమార్ ఈకేసును లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకోవడంపై.. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.. హైకోర్టులో నివేదిక సమర్పించారు. ఈ రాజీకి సతీష్ కుమార్‌కు అర్హత లేదన్నారు. అలానే ఈ కేసులో పిటిషనర్.. సీఐడీ దర్యాప్తు కోరారని.. ఆ మేరకు క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేశారని ఆయన హైకోర్టుకు తెలిపారు. దీనిపై బోర్డు సమావేశంలో తుది నిర్ణయం […]

భారత్‌లో జమ్మూ-కాశ్మీర్ అంతర్భాగమే.. హరీష్

యూఎన్‌(UNO)లో పాకిస్తాన్‌పై మరోసారి ధ్వజమెత్తారు భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్. జమ్మూకాశ్మీర్‌ భారత్‌లో ఎల్లప్పుడూ అంతర్భాగమేనని..విడదీయరాని బంధంగా ఉందని.. ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. పాకిస్తాన్ చట్ట విరుద్ధంగా ఆ్రమించిన ప్రాంతాల్లో విరీతంగా మానవ హక్కుల ఉల్లంఘన జరగుతోందని…దానిని అంతం చేయాలని పిలుపునిచ్చారు. పాక్ సైనిక ఆక్రమణ, అణిచివేత, క్రూరత్వం, వనరుల అక్రమ దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలను అంతం చేయాలని హరీష్ కోరారు.

ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్.. ఏఐసీసీ కీలక నేతలతో భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ నూతన కార్యాలయం ఇందిరా భవన్‌లో ఏఐసీసీ కీలక నేతలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొననున్నారు. భేటీలో డీసీసీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. ఇ

మరికొన్ని రోజుల్లో పెళ్లి.. బాత్రూమ్‌లో విగతజీవులుగా అక్కాచెల్లెళ్లు..

కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. పెరియపట్నంలో గుల్ఫామ్ తాజ్ (23), ఆమె సోదరి సిమ్రాన్ తాజ్ (20), గుల్ఫామ్ తాజ్‌కు పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లలో ఫ్యామిలీ అంతా బిజీగా ఉంది. ఇద్దరు సిస్టర్స్ స్నానం చేయడానికి బాత్రూమ్‌లోకి వెళ్లి గీజర్‌ను ఆన్ చేయగానే దాని నుంచి విషపూరిత గ్యాస్  పీల్చడంతో శ్వాస ఆడక సిస్టర్స్ స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయారు. గీజర్ నుంచి లీకైన కార్బన్ మోనాక్సైడ్ వాయువును పీల్చడం వల్లే ఈ యువతులు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON