పదేళ్ల రేసర్ భవితకు భరోసా.. ఫార్ములా వన్ అకాడమీ..!
కారు రేసింగ్‌లో అదరగొడుతున్న జమ్ము కశ్మీర్ బాలిక.. యువ రేసర్ అతీకా మిర్ కష్టాలు తొలగిపోన్నాయి. ట్రాక్ మీద అద్బుతాలు చేస్తున్న ఆమె గురించి తెలిసిన ఫార్ములా వన్ అకాడమీ సంస్థ ఆర్ధికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చింది. ఈ విషయాన్ని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపిందీ సంస్థ. తద్వారా సాంకేతికంగా, ఆర్ధికంగా ఫార్ములా వన్ సహకారం అందుకున్న మొదటి భారత రేసర్‌గా అతీకా గుర్తింపు సాధించనుంది.

