loader

‘మకుటం’ డైరెక్టర్‌తో గొడవలు.. హీరో విశాల్ కీలక ప్రకటన..

కోలీవుడ్ హీరో విశాల్ ‘మకుటం’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. రవి అరసు దర్శకత్వంలో ఈ చిత్రం ప్రారంభమైంది. అయితే దర్శకుడితో వచ్చిన విభేదాలు కారణంగా విశాల్ స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదంటూ దీపావళి సందర్భంగా కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సెకండ్ లుక్ రిలీజ్ చేశారు. దీపావళి సందర్భంగా విశాల్ ఎక్స్ లో పోస్ట్ పెడుతూ.. ప్రచారంలో ఉన్న వార్తలను నిజం చేస్తూ, ‘మకుటం’ […]

దున్నపోతుకు రూ.31వేలు విలువైన మద్యం తాగించిన యువకుడు

ఈ ఏడాది కూడా హైదరాబాద్ సిటీలో సదర్ సందడి మొదలైంది. ముషీరాబాద్‌ల ఈ ఏడాది సదర్ వేడుకల్లో వస్తాద్ గుమాన్ కాళీ దున్నరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2500 కేజీల బరువు.. 7 అడుగుల వెడల్పు ఉన్న ఈ దున్నపోతును మధు యాదవ్ కేరళ నుంచి తీసుకొచ్చాడు. ఈ దున్నరాజు ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. దున్నరాజుకు ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడమే కాకుండా కాస్ట్‌లీ రాయల్ సెల్యూట్ మందు తాగిస్తున్నాడు మధు యాదవ్.

భార‌తీయ సినీ చిత్ర ప్ర‌ముఖ న‌టుడు గోవ‌ర్ధ‌న్ అస్రానీ క‌న్న‌మూత‌..!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సీనియ‌ర్ న‌టుడు, క‌మెడియ‌న్ గోవింద్ అస్రాని (84) తుదిశ్వాస విడిచారు. షోలే చిత్రంలో జైల‌ర్ పాత్రతో గుర్తింపు పొందిన న‌టుడు సోమ‌వారం క‌న్నుమూశారు. ఆసుప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆయ‌న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు క‌న్నుమూశారు. 1964లో అస్రానీ పుణేలోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి శిక్ష‌ణ పొందారు. అస్రానీ ‘హరే కాంచ్ కి చురియాన్’ చిత్రంలో తన తొలి అవకాశాన్ని పొందాడు.1971 సంవత్సరం తర్వాత.. అస్రానీ సినిమాల్లో క‌మెడియ‌న్‌గా.. నటుడి స్నేహితుడి పాత్ర‌ల్లో […]

మూతపడనున్న పిజ్జా హట్‌ రెస్టారెంట్లు..

పిజ్జా హట్ UK రెస్టారెంట్ డైన్-ఇన్ రెస్టారెంట్ వ్యాపారం పరిపాలనలోకి వెళ్లిన తర్వాత 68 రెస్టారెంట్లను మూసివేస్తామని తెలిపింది. పిజ్జా హట్ UKలో 68 రెస్టారెంట్లు, 11 డెలివరీ సైట్‌లను మూసివేయనున్నట్లు సమాచారం, దీని ఫలితంగా వాటిని నిర్వహిస్తున్న కంపెనీ పరిపాలనలోకి ప్రవేశించడంతో 1,210 ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. పిజ్జా హట్ UK రెస్టారెంట్లను నిర్వహిస్తున్న DC లండన్ పై లిమిటెడ్, సోమవారం FTI కన్సల్టింగ్‌ను నిర్వాహకుడిగా నియమించింది.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో దీపావళి వేడుకలు

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. దీపావళి వేడుకల్లో వైఎస్‌ జగన్‌ దంపతులు పాల్గొన్నారు. వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణి వైఎస్‌ భారతి బాణాసంచా కాల్చారు. దీపావళి వేడుకలు సందర్భంగా వైఎస్‌ జగన్‌ నివాసంలో ప్రత్యేక దీపాల అలంకరణ చేశారు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎక్స్‌ ద్వారా వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

కుటుంబసభ్యులతో ఘనంగా దీపావళి సంబరాలు చేసుకున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబసమేతంగా దీపావళి సంబరాలు చేసుకున్నారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి పూజలు చేసిన ముఖ్యమంత్రి.. అనంతరం టపాసులు పేలుస్తూ దీపావళి సంబరాలు చేసుకున్నారు. కాకర పువ్వొత్తులు, చిచ్చుబుడ్లు కాలుస్తూ కుటుంబంతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

దీపావళి సందడే సందడి..

దేశవ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది. టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ దీపావళి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ దీపావళి సందడి కొనసాగుతోంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ టపాసులు కాలుస్తూ సందడి చేస్తున్నారు. టపాసుల మోతతో పల్లెలు, పట్టణాలు మార్మోగిపోతున్నాయి. టపాసుల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.

కేటీఆర్‌కు బల్మూరి వెంకట్ వార్నింగ్

కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ BRS పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యతిరేక అనుచిత పోస్టులను ఖండించి, కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేకపోతే సైబర్ దాడులు చేస్తామని హెచ్చరించి, యువత, విద్యార్థుల మనోభావాలు దెబ్బ తినడానికి కేటీఆర్ బాధ్యుడని, అది జరిగితే రాష్ట్రవ్యాప్తంగా యువత, విద్యార్థులు రోడ్లపై దిగి BRS నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తామని, కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి కొండా సురేఖ దంపతులు..

తెలంగాణలో ఇటీవల మంత్రుల మధ్య జరిగే వివాదాలు సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారాయని తెలిసిందే. మంత్రి కొండా సురేఖ, కొండా మురళితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. కొండా సురేఖ దంపతులుతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కొండా సురేఖ దంపతులు నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి దీపావళి విషెస్ చెప్పడంతో వీరి […]

సముద్ర తీరంలో కాలిబూడిదైన నౌక.. 23 మంది భారతీయులు సేఫ్

యెమెన్‌లోని ఆడెన్ సముద్ర తీరంలో కామెరూన్ జెండా కలిగిన ఓడ MV ఫాల్కన్‌లో భారీ పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఓడలో భారీ పేలుడు కారణంగా మంటలు నౌక అంతటా వ్యాపించాయి. అయితే, అందులో ఉన్న 24 మంది సిబ్బందిని రక్షించి జిబౌటి కోస్ట్ గార్డ్‌కు అప్పగించారు. శనివారం (అక్టోబర్ 18, 2025) జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. నౌకలో ఉన్న సిబ్బందిలో ఎక్కువ మంది భారత సంతతికి చెందినవారని అధికారులు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON