loader

ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలపై కర్ణాటక కీలక నిర్ణయం

కర్ణాటక మంత్రివర్గం గురువారం రోడ్లపై కవాతులు చేయడం, బహిరంగ ప్రదేశాలు,ప్రభుత్వ ప్రాంగణాల్లో కార్యక్రమాలు నిర్వహించడం వంటి ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలను నియంత్రించేందుకు నియమనిబంధనలు తీసుకురావలని నిర్ణయించింది. ‘మేము ఏ సంస్థను నియంత్రించలేము. కానీ ఇకపై బహిరంగ ప్రదేశాలలో లేదా రోడ్లపై మీకిష్టమున్నట్లు చేయలేరు. మీరు ఏది చేయాలన్నా అది ప్రభుత్వం అనుమతితోనే చేయాల్సి ఉంటుంది’ అని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే విలేకరులతో అన్నారు.

మేడ్చల్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

పేట్ బాషీరాబాద్, దూలప్లలి లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ కవర్లు తయారుచేసే పాలిమర్ కంపెనీలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. 2ఫైర్ ఇంజన్స్ సహయంతో మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. క్రౌన్ పాలిమర్స్ అనే కంపెనీలు పెద్ద ఎత్తున ప్లాస్టిక్ ఉత్పత్తులు తయారు చేస్తారు. కార్మికులు ఉత్పత్తిలో ఉన్న సమయంలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దీంతో కార్మికులు అంతా బయటకు పరుగులు తీశారు.ఇప్పటి వరకూ ఆస్తి నష్టం జరిగింది కానీ.. ప్రాణ […]

అందుకే.. రష్యా నుంచి ఇండియా చమురు కొంటోంది: అలిపోవ్

ప్రపంచ మార్కెట్‌లో రష్యా ముడిచమురు ధర చాలా చౌకగా ఉందని, తన దేశ ప్రయోజనాల దృష్టానే భారత్, రష్యా నుంచి ముడి చమురు తక్కువ ధరకు కొంటోందని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ అన్నారు. రష్యా నుండి ముడి చమురు కొనుగోలును ఇండియా ఆపేయనుందని ప్రధాని నరేంద్ర మోడీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్న కొన్ని గంటలకే డెనిస్ అలిపోవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

స్థానిక ఎన్నిక‌ల్లో పోటీకి ఇద్ద‌రు పిల్ల‌ల నిబంధ‌న తొల‌గిస్తాం : మంత్రి పొంగులేటి

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీకి ఇద్ద‌రు పిల్ల‌ల నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ సూచనప్రాయంగా అంగీకరించింది అని తెలిపారు. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా జూలూరుపాడులో ఏన్కూర్ మార్కెట్ యార్డ్‌కు ప‌ది ఎక‌రాలు కేటాయిస్తూ, నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయానికి అదనంగా 7 ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.ఈ యూనివర్సిటీ అడ్మిషన్లలో ఇప్పుడు తెలంగాణ స్థానికులకు కేటాయించిన 25 శాతం సీట్ల కోటాను 50 శాతం పెంచాలని కేబినెట్ తీర్మానం చేసింది అని పొంగులేటి శ్రీనివాస్ […]

విమాన టికెట్ ధర.. ఇక ఫిక్స్…

ప్రస్తుతం భారత విమానయాన రంగంలో ‘డైనమిక్ ప్రైసింగ్’ విధానం అమల్లో ఉంది.  దీనివల్ల డిమాండ్, పండగ సీజన్లు, పోటీని బట్టి టికెట్ ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈ సమస్యను పరిష్కరించి, ధరలలో పారదర్శకత, స్థిరత్వం తీసుకురావడమే ‘ఫేర్స్ సే ఫుర్సత్’ ముఖ్య ఉద్దేశం. బుకింగ్ తేదీతో సంబంధం లేకుండా టికెట్ ధర స్థిరంగా ఉంటుంది. పైలట్ ప్రాజెక్ట్‌గా అక్టోబర్ 13 నుంచి డిసెంబర్ 31 వరకు ఎంపిక చేసిన కొన్ని మార్గాల్లో ఈ విధానాన్ని అమలు […]

ఎడమ చేయిని, కుడి చేతికి అతికించిన.. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు..

ప్రమాదంలో రెండు చేతులు పోయిన ఓ వ్యక్తికి..అత్యంత క్లిష్టమైన సర్జరీని చెన్నైలో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ (RGGGH) ఆస్పత్రి డీన్ శాంతారామన్ నేతృత్వంలో దాదాపు 10 గంటల శ్రమించి శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. ఎడమ చేయిని, కుడి చేతికి అతికించారు. అత్యంత క్లిష్టమైన క్రాస్-హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన సర్జరీ అని డాక్టర్లు చెప్పారు. భారత్‌లో ఇలాంటి శస్త్రచికిత్సల్లో ఇది రెండోదని.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో […]

ఎవడో కర్మ అంటే నాకేంటి.. ఎవడో గడ్డిపరక అంటే నాకేంటి?-వర్మ

పిఠాపురంలో వర్మను జీరో చేశామంటూ మంత్రి నారాయణ మాట్లాడినట్లుగా ఉన్న ఓ ఆడియో వైరల్ అయింది. దీనిపై ఇన్ డైరెక్ట్ గా స్పందించిన వర్మ నారాయణపై సెటైర్లు వేశారు. కూటమి బలోపేతం కోసం నేను ఎప్పుడూ మౌనంగానే ఉంటానని.. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సమాధానం చెప్పనన్నారు. ఎవరో ఏదో అన్నారని నేను లక్ష్మణ రేఖ దాటనని స్పష్టం చేశారు. ఎవడో కర్మ అంటే నాకేంటి, ఎవడో గడ్డిపరక వర్మ అంటే నాకేంటి.. వర్మ అంటే ఏమిటో […]

కమెడియన్ కపిల్ శర్మకు దెబ్బ మీద దెబ్బ.. మరో సారి రెస్టారెంట్‌పై కాల్పులు..

ప్రముఖ బాలీవుడ్ కమెడియన్, షో హోస్ట్ కపిల్ శర్మ కెనడాలో ‘కప్స్ కేఫ్’ రెస్టారెంట్‌పై తరచుగా కాల్పులకు తెగబడుతున్నారు. బుధవారం కూడా రెస్టారెంట్‌పై కాల్పులు జరిగాయి. నాలుగు నెలల వ్యవధిలో ఇది మూడో సారి. కారులో రెస్టారెంట్ దగ్గరకు వచ్చిన దుండగులు తుపాకితో కాల్పులకు తెగబడుతున్నారు. అది కూడా రాత్రి వేళల్లోనే కాల్పులు జరుపుతున్నారు. దీన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ ఈ దాడి తామే చేసినట్లు ప్రకటించుకున్నారు.

’21వ శతాబ్దం.. 140 కోట్ల భారతీయుల శతాబ్దం’

21వ శతాబ్దం.. 140 కోట్ల భారతీయుల శతాబ్దం అన్నారు ప్రధాని. ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో కనెక్టివిటీ బలోపేతం అవుతుందన్నారు. ప్రాజెక్టులతో పరిశ్రమలకు ఊతంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగవుతాయని చెప్పారు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత కీలకమన్నారు. దేశంలోని ప్రతి గ్రామంలో విద్యుద్దీకరణ జరిగిందన్నారు ప్రధాని మోదీ. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ప్రధాని చెప్పారు. ఈ సంకల్పానికి స్వర్ణాంధ్రప్రదేశ్‌ లక్ష్యం మరింత శక్తినిస్తుందన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON