భారత్ మద్దతిస్తుందని ఆశిస్తున్నాం: US సెక్రటరీ
అమెరికా ట్రెజరీ సెక్రటరీ ‘స్కాట్ బెస్సెంట్’ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాకు వ్యతిరేకంగా భారత్ మద్దతు ఇవ్వాలని ఆశిస్తున్నట్లు రేర్ ఎర్త్ మెటల్స్’ ఉత్పత్తి, సరఫరాపై చైనా పెంచుకుంటున్న ఆధిపత్యాన్ని అడ్డుకోవడంలో భారత్, యూరోపియన్ దేశాలు అమెరికాతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ సామగ్రి తయారీలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. చైనా ఈ వనరులలో దాదాపు 70% సరఫరాను నియంత్రిస్తుండటంతో, అమెరికా […]
అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం
గ్రామీణ ప్రాంతాల్లో మహిళల పాత్ర మరియు పరిస్థితిని హైలైట్ చేసే లక్ష్యంతో, అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం అమలు చేసింది మరియు ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న జరుపుకుంటారు. మొదటి అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవాన్ని 1995 అక్టోబర్ 15న జరుపుకున్నారు మరియు దీనిని WWSF (మహిళల ప్రపంచ సమ్మిట్ ఫౌండేషన్) ప్రోత్సహించి నిర్వహించింది. పది సంవత్సరాల తరువాత, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 18, 2007న అధికారికంగా తేదీని ఆమోదించింది.
కీలక సమాచారం లీక్.. అమెరికాలో భారత సంతతి నిపుణులు అరెస్ట్
అమెరికా నిఘా సంస్థలు దిగ్భ్రాంతికరమైన విషయాన్ని వెల్లడించాయి. భారత సంతతికి చెందిన ప్రముఖ అమెరికా విశ్లేషకుడు, దక్షిణాసియా విధానంపై అమెరికా విదేశాంగ శాఖ ఉద్యోగి, సలహాదారుడు ఆష్లే టెల్లిస్ రహస్య పత్రాలను దాచిపెట్టి చైనా ప్రభుత్వ అధికారులను కలిశాడనే ఆరోపణలపై అరెస్టు అయ్యారు.విదేశాంగ శాఖలో సీనియర్ సలహాదారుగా, యుద్ధ శాఖ కోసం కాంట్రాక్టర్‌గా పనిచేసిన టెల్లిస్, రహస్య పత్రాలను చట్టవిరుద్ధంగా నిల్వ చేశాడని అమెరికా న్యాయ శాఖ పేర్కొంది.
ప్రపంచ విద్యార్థుల దినోత్సవం
ప్రపంచ విద్యార్థుల దినోత్సవం ప్రతి సంవత్సరం అబ్దుల్ కలాం జయంతి రోజైన అక్టోబర్ 15న నిర్వహించబడుతుంది.2015లో ఐక్యరాజ్య సమితి అబ్దుల్ కలాం జయంతిని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ప్రకటించింది అత్యున్నత రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు కలాం విద్యార్థుల్లో విజ్ఞానాన్ని నింపడానికి ప్రయత్నం చేశాడనీ, భారత రాష్ట్రపతిగా ప్రపంచ శాంతి కోసం పరితపించారని ఐక్యరాజ్యసమితి కొనియాడుతూ అబ్దుల్ కలాం జయంతి రోజైన అక్టోబర్ 15ను ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా నిర్ణయించింది.
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ జయంతి
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ (1931 అక్టోబరు 15 – 2015 జులై 27) భారత 11 వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త. భారత రాష్ట్రపతి పదవికి ముందు, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో-ISRO)లో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేశాడు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్ (missile man) గా పేరుగాంచాడు. కలామ్ ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి, ప్రయోగ వాహన సాంకేతికత అభివృద్ధికి కృషిచేశాడు.