loader

మరో వివాదంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. ఏకంగా రాచకొండ సీపీకి ఫిర్యాదు!

హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్‌ను వరుస వివాదాలు వెంటాడున్నాయి. కొత్తగా HCAతో పాటు పలువురు ప్లేయర్సపై అనంత్‌ రెడ్డి అనే వ్యక్తి రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. అండర్ 16, అండర్ 19, అండర్ 23 లీగ్ మ్యాచుల్లో పలువురు ప్లేయర్ల ఫేక్ బాగోతం నడిచిందని కంప్లైంట్‌ ఇచ్చారు. ఆయా విభాగాల్లో స్థానం పొందేందుకు పలువురు ప్లేయర్లు నకిలీ బర్త్ సర్టిఫికెట్లు సమర్పించారని తెలిపారు. HCA నిర్లక్ష్యంతో ఎక్కువ వయసు ఉన్న ప్లేయర్లు లీగ్‌లో ఎంట్రీ ఇస్తున్నారని అనంత్‌రెడ్డి […]

అట్లాంటాలో పలకబలపంతో తానా పాఠశాల తరగతులు ప్రారంభం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ‘పాఠశాల’ పేరుతో అమెరికాలోని తెలుగు చిన్నారులకు తెలుగు భాషను నేర్పిస్తున్న సంగతి తెలిసిందే. పాఠశాల 2025 – 26 నూతన విద్యా సంవత్సరం అట్లాంటాలో ‘‘పలక బలపం’’ కార్యక్రమంతో విజయవంతంగా ప్రారంభమైంది. గురువుల పరిచయాలతో.. తల్లిదండ్రులు, విద్యార్థులతో ప్రత్యక్ష సంభాషణలతో కార్యక్రమం ఆత్మీయంగా సాగింది. పిల్లల నిరంతర అభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా డిజిటల్‌ రైటింగ్‌ బోర్డులు బహుమతిగా అందజేశారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్‌కు ముగ్గురు న్యాయమూర్తుల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. రాష్ట్రపతి ఆమోదం మేరకు తాజాగా బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుజరాత్‌ హైకోర్టు నుంచి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, అలహాబాద్‌ హైకోర్టు నుంచి జస్టిస్‌ డూండి రమేష్‌, కలకత్తా హైకోర్టు నుంచి జస్టిస్‌ సుబేందు సమంత తాజాగా ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ముగ్గురు జడ్జిలను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని గతంలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. కొలీజియం సిఫారసు మేరకు బదిలీకి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో […]

వికసిత్ భారత్‌కు గూగుల్ డేటా సెంటర్ గొప్ప ముందడుగు: పవన్ కల్యాణ్

గమ్యస్థానం నుంచి ‘వికసిత్ భారత్’కు మార్గం ఇప్పుడు సుగమం అవుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నం $15 బిలియన్ల గూగుల్ ఏఐ డేటా సెంటర్‌ను భారతదేశపు మొట్టమొదటి ఏఐ నగరాన్ని పొందడం గొప్ప ముందడుగని అభివర్ణించారు. ఈ చొరవ అందరికీ ఏఐ శక్తి నిజంగా తెలుస్తుందని ఉద్ఘాటించారు.  సీఎం చంద్రబాబు నాయుడు బ్రాండ్, నాలుగు దశాబ్దాల దార్శనిక అనుభవానికి స్పష్టమైన నిదర్శనమని ప్రశంసించారు పవన్ కల్యాణ్.

జూబ్లీహిల్స్ లో 20,000 ఫేక్ ఓట్లు – కాంగ్రెస్ ఓట్ చోరీ చేసిందని KTR ఆరోపణలు

తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రజెంటేషన్‌లో KTR ఓటర్ లిస్టులోని అవకతవకలను పవర్‌పాయింట్ స్లైడ్‌లు, డాక్యుమెంట్లతో సహా వివరించారు. జూబ్లీహిల్స్‌లో సుమారు 20,000 డూప్లికేట్ మరియు ఫేక్ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. ఇందులో 15,000 ఓట్లు చిరునామాలు లేకుండా నమోదు అయ్యాయి. సుమారు 400 పోలింగ్ బూత్‌లలో ప్రతి బూత్‌కు 50 ఫేక్ ఓట్లు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి, లోయర్ లెవల్ అధికారులతో కలిసి ఫేక్ ఓట్లు యాడ్ చేసిందని ఆరోపించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గంజాయి చాక్లెట్లు పట్టివేత

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది మంగళవారం గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు. రైలులో గంజాయి చాక్లెట్లు తీసుకువస్తున్నట్లు సమాచారం రావడంతో ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ బృందం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పదో నంబర్ రైల్వే ఫ్లాట్ ఫాం వద్ద అనుమానస్పదంగా కన్పించిన బ్యాగును తీసి పరిశీలించగా గంజాయి చాక్లెట్లు లభించాయి. బ్యాగులో 1.6కిలోల గంజాయి చాక్లెట్లు తీసుకుని వచ్చినట్లు గుర్తించారు. ఎక్సైజ్ సిబ్బందిని గుర్తించిన గంజాయి చాక్లెట్లు తీసుకుని వచ్చిన నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు గుర్తించారు.

ఎన్నికల వేళ బీజేపీలో చేరిన ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్

యువ ఫోక్ సింగర్‌గా మంచి పేరు తెచ్చుకున్న మైథిలి ఠాకూర్ బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీలో చేరారు. 25 ఏళ్ల మైథిలీ ఠాకూర్‌కు దర్బంగాలోని అలీనగర్ అసెంబ్లీ నియోజకర్గం నుంచి బీజేపీ టిక్కెట్ కేటాయించే అవకాశం ఉంది. మైథిలీ ఠాకూర్‌ను బిహార్ ‘స్టేట్ ఐకాన్’గా ఎన్నికల కమిషన్ నియమించింది. రాష్ట్రానికి సాంస్కృతిక అంబాసిడర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమెకు బిహార్ ఫోక్ మ్యూజిక్‌కు చేసిన సేవలకు సంగీత నాటక అకాడమీ 2021లో ఉస్తాద్ […]

బంగ్లాదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం.. 9మంది మృతి

బంగ్లాదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం రాజధాని ఢాకాలోని ఓ వస్త్ర కర్మాగారం, రసాయన గిడ్డంగిలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఢాకాలోని మీర్పూర్ ప్రాంతంలో ఓ వస్త్ర కర్మాగారం, రసాయన గిడ్డంగి ఉన్న రెండు భవనాల్లో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చి.. కర్మాగారంలోని మొదటి, రెండవ అంతస్తుల నుండి తొమ్మిది […]

IPS పురాన్ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న ASI సందీప్

హర్యానాలోని రోహ్‌తక్ జిల్లా సైబర్ సెల్‌లో పనిచేస్తోన్న ASI సందీప్ ఇవాళ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ASI తన సూసైడ్ నోట్‌లో, ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ IPS అధికారి వై. పురాణ్ కుమార్ అత్యంత అవినీతికి పాల్పడ్డాడని, అతని అక్రమాలపై తగినన్ని ఆధారాలు ఉన్నాయని తన సూసైడ్ నోట్ లో ఎఎస్ఐ రాశారు. కుల వివక్షను ఉపయోగించుకుని పురాణ్ కుమార్ మొత్తం వ్యవస్థను హైజాక్ చేశాడని, నిజాయితీపరులైన అధికారులను ఎంతో మందిని వేధించాడని ఆయన […]

కదులుతున్న బస్సులో మంటలు.. 12 మంది ప్రయాణికులు సజీవ దహనం..!

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. దాంతో పది నుంచి 12 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. జైసల్మేర్‌ నుంచి జోధ్‌పూర్‌ వెళ్తున్న ప్రైవేటు బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలు, నలుగురు మహిళలు ఉన్నట్లుగా తెలుస్తున్నది జైసల్మేర్-జోధ్‌పూర్ హైవేలోని థైయత్ గ్రామం సమీపంలో మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 57 మంది ప్రయాణికులు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON