loader

తెలంగాణ బంద్ తాత్కాలికంగా వాయిదా…

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యం ఐక్యంగా పోరాడానికి బీసీ సంఘాలన్నీ జీఏసీగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే అక్టోబర్ 14న తలపెట్టిన తెలంగాణ బంద్‌ కూడా తాత్కాలికంగా వాయిదా పడింది. తాజాగా రాష్ట్రంలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ‘‘తెలంగాణ బీసీ జేఏసీ’’ (BC JAC) ఏర్పాటు అయింది. బీసీ జేఏసీ చైర్మన్‍గా ఆర్.కృష్ణయ్య, వైస్ చైర్మన్‍గా వీజీ నారగోనిలు నియమితులయ్యారు. అలాగే ఈ నెల 14న తలపెట్టిన బీసీ సంఘాల బంద్ ను ఈ నెల […]

ప్రతీ మద్యం బాటిల్‌పై లేబుల్‌ని స్కాన్ చేసి మద్యం నాణ్యత తెల్సుకోవచ్చు : చంద్రబాబు

కల్తీ మద్యం నివారణకు సిట్, గంజాయ్ నివారణకు ఈగల్ బృందాలు ఏర్పాటు చేసి కట్టడి చేశామని చంద్రబాబు చెప్పారు. కల్తీ మద్యం నివారణ దిశగా ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ ను అందుబాటులోకి తెచ్చామని చంద్రబాబు తెలిపారు. ప్రతీ మద్యం బాటిల్‌పై ఉండే లేబుల్‌ని స్కాన్ చేయటం ద్వారా మద్యం నాణ్యత తెలుసుకునేలా యాప్ రూపకల్పన చేశామని చంద్రబాబు వెల్లడించారు. వ్యవస్థ ప్రక్షాళన దిశగా ఉత్తమ విధానాలు అందుబాటులోకి తెచ్చామన్నారు చంద్రబాబు.

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి: కెటిఆర్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఓటర్లను కోరారు. ఈ ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబితేనే కాంగ్రెస్‌కి సోయి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్న ఆ పార్టీ నేతలు.. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబితేనే కాంగ్రెస్‌కి సోయి వస్తుందని ఎద్దేవా చేశారు.

నకిలీ మద్యం కేసుపై సిట్ ఏర్పాటు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కల్తీ మద్యం కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  సిట్ ఏర్పాటు చేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. నకిలీ మద్యం కేసులో ఇప్పటివరకు 23 మంది నిందితులనుగుర్తించి, వీరిలో 16 మందిని అరెస్ట్ చేశారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవిజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సెట్ ఏర్పాటు చేయగా, సిట్ సభ్యులుగా రాహుల్ దేవ్ శర్మ, మల్లికా గార్గ్, ఎక్సైజ్ నుంచి మరొకరు ఉన్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకలచెరువులో కల్తీ మద్యం […]

బీహార్‌లో ఎన్డీయే సీట్ల పంపకాలు ఖరారు.. బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ

వచ్చే నెలలో జరుగనున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల పంపకాలను ఎన్డీయే ఖరారు చేసింది. మొత్తం 243 స్థానాలకుగాను బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్) చెరో 101 సీట్లలో పోటీ చేయనున్నాయి. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 29 సీట్లలో ,రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం) , హిందుస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) చెరో ఆరు సీట్లలో పోటీ చేస్తాయి. బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా  మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ . […]

గాంధీపై అసభ్యకర వ్యాఖ్యలు.. శ్రీకాంత్ అయ్యంగార్ క్షమాపణలు..

సినీ నటుడు శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ఇటీవల మహాత్మా గాంధీపై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో  క్షమించమని కోరుతూ ఇన్స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేశాడు శ్రీకాంత్ అయ్యంగార్. ‘నేను ఇటీవల మాట్లాడిన ఒక విషయం ఎంతో మందికి బాధ కలిగించింది. అది నా ఉద్దేశం కాదని తెలియజేస్తున్నాను. నా మాటల వల్ల బాధపడిన వారందరికీ క్షమాపణలు చెప్తున్నాను. నన్ను మన్నించండి. ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికీ నేను శిరస్సు వంచి క్షమాపణలు కోరుతున్నాను […]

చీరాలలో విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ఐదుగురు మృతి

ఆదివారం వీకెండ్‌ కావడంతో సేదతీరేందుకు పలువురు చీరాల బీచ్‌కు వచ్చారు. అక్కడ స్నానం చేస్తుండగా అలల తాకిడికి ఎనిమిది మంది సముద్రం లోపలికి కొట్టుకుపోయిరు. ఇది గమనించిన స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ముగ్గురిని రక్షించారు. మరో ఐదుగురు నీటిలో మునిగి మరణించారు. మరోవైపు మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు తమ ప్రాణాలకు తెగించి నలుగురు యువకులను రక్షించారు.

మణికొండలో అగ్నిప్రమాదం.. 19 అంతస్తుల BRC అపార్ట్‌మెంట్‌లో మంటలు..

తెలంగాణ రాజధాని నగరమైన హైదరాబాద్ శివారులోని మణికొండ ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదం స్థానికంగా కలకలం సృష్టించింది. అక్టోబర్ 12.. ఆదివారం సాయంకాలం సుమారు 4 గంటల సమయంలో.. బి.ఆర్‌.సి. అపార్ట్‌మెంట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు నివాసితులకు గాయాలయ్యాయి. అపార్ట్‌మెంట్‌లోని ఒక భాగంలో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండటం గమనించిన నివాసితులు భయంతో కిందకు పరుగులు తీశారు. ఈ ఆందోళనకర పరిస్థితులలో.. ప్రమాదాన్ని తప్పించుకునే క్రమంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

అధికారంలోకి రావాలని ఉబలాటం.. వైఎస్సార్‌సీపీపై విరుచుకుపడ్డ బాలకృష్ణ..!

ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐదేళ్లలో ఏమాత్రం అభివృద్ధి చేయనివారంతా.. పీపీపీ మోడల్‌పై కొత్త నాటకాలకు తెరలేపారని విరుచుకుపడ్డారు. గతంలో వైద్య కళాశాలల అభివృద్ధికి వారు చేసిందేమీ లేదని.. ఇప్పుడు మాత్రం అధికారంలోకి రావాలనే ఉబలాటంతో ఏవేవో ఊహించుకుంటూ మాట్లాడుతున్నారన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో హిందూపురం నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఇంకా అధికారంపై యావతో ఉన్నారన్నారు.

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన

మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని అరుదైన ఘనతను సాధించింది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో (2025లో) 1000 వన్డే పరుగులు పూర్తి చేసిన తొలి మహిళా బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. విశాఖపట్నం లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆమె తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకుంది. స్మృతిమంధాన 54 బంతుల్లో 62 పరుగులతో బ్యాటింగ్ చేస్తూ ఈ మైలురాయిని చేరుకుంది. తాజా గణాంకాల ప్రకారం, మంధాన ఈ సంవత్సరంలో కేవలం 18 […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON