loader

36 మంది విద్యార్థినుల ఫొటోలు మార్ఫింగ్‌.. స్టూడెంట్‌ సస్పెండ్‌

ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లో మూడో ఏడాది చదువుతున్న సయ్యద్ రహీమ్ అద్నాన్ అలీ, 36 మంది క్లాస్‌మేట్స్ ఫొటోలను మార్ఫింగ్‌ చేశాడు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టూల్‌ ద్వారా విద్యార్థినుల ఫొటోలను అశ్లీల చిత్రాలుగా మార్చాడు. బాధిత విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. అంతర్గత కమిటీ దర్యాప్తు తర్వాత ఆ స్టూడెంట్‌ను బహిష్కరించారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. సమాచార సాంకేతిక చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు […]

రేవంత్‌ బీసీలను దారుణంగా మోసం చేశారు : కేటీఆర్‌

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులపాటు మోసపూరితంగా వ్యవహరించిన తీరుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేతో 42 శాతం రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ సర్కారు ఇంతకాలం చేసిందంతా డ్రామా తప్ప మరొకటి కాదని రుజువైపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మోసపూరిత విధానాలు, చట్టం పరీక్షకు నిలవకుండా వ్యవహరించిన తీరు వల్లనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండా […]

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఎన్నికల కమిషన్‌..!

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. నోటిఫికేషన్‌ని నిలిపివేస్తున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల మేరకు నోటిఫికేషన్‌ను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఎన్నికల కోడ్‌ అమలు, నామినేషన్ల ప్రక్రియ నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. మళ్లీ నోటిఫికేషన్‌ వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియలన్నింటిని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషన్‌ కోడ్‌ అమలుతో పాటు ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలను అమలు చేసింది. మొత్తం 31 మంది ఐఏఎస్ అధికారులను వారి ప్రస్తుత పదవులనుంచి వేర్వేరు శాఖలకు బదిలీ చేస్త ఉత్తర్వులు జారీ చేశారు. శివశంకర్ లోతేటిను ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (APSPDCL) సీఎండీగా నియమించగా, రవి సుభాష్ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) సెక్రటరీగా నియమించారు.చక్రధర్ బాబును కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టరుగా, ఎస్. ఢిల్లీరావును పౌరసరఫరాల శాఖ వైస్ ఛైర్మన్‌గా నియమిస్తూ […]

సాహిత్యంలో హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్నాహోర్కైకు నోబెల్

హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్నాహోర్కై, సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు గాను ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం పొందారు. హంగేరీకి చెందిన ఇతను జనవరి 5, 1954లో జన్మించారు. 

హైకోర్టు స్టే ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టినట్టు గుర్తించాల్సిందే..

ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుగాని, హైకోర్టుగాని స్టే ఇచ్చిన దాఖలాలు లేవని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు మూడు నెలల్లోగా రాష్ట్రపతి, గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలపకపోతే.. ఆమోదం పొందినట్టుగా భావించాల్సి ఉంటుందని చెప్పిందని గుర్తుచేశారు రిజర్వేషన్లపై జడ్జిమెంట్ రావడం అంటే ప్రజాస్వామ్యం గురించి చాలా లోతుగా అసెంబ్లీలో, పార్లమెంట్లో చర్చ జరగాలని ఆయన సూచించారు.

బిసి బాలికల వసతి గృహం నుంచి ముగ్గురు బాలికలు మిస్సింగ్

నగరంలో బిసి బాలికల వసతి గృహం నుంచి ముగ్గురు బాలికలు మిస్సింగ్ అయిన ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతోంది. కోటగల్లి బాలికల పాఠశాలలో వెనకబడిన తరగతుల వసతిగృహం నుంచి పదో తరగతికి చెందిన ఇద్దరు, తొమ్మిదో తరగతికి చెందిన ఓ విద్యార్థిని బుధవారం తెల్లవారుజాము నుంచి హాస్టల్ నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని కనిపించకుండా పోయారని హాస్టల్ వార్డెన్ రెండవ టౌన్‌లో ఫిర్యాదు చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై తెలంగాణ హైకోర్టు స్టే

తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 9 అమలుపై కోర్టు మధ్యంతర స్థాయిలో స్టే విధించింది. జీవో అమలు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నాలుగు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించగా, బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

వైఎస్ జగన్‌కు మహిళల ఘన స్వాగతం..

విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికిన అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా నర్సీపట్నం బయలుదేరిన వైఎస్ జగన్. ఆయనకు విశాఖ ఎన్ఏడి కొత్త రోడ్డు సెంటర్‌లో మహిళలు దిష్టి తీశారు. వైఎస్ జగన్ విశాఖ, అనకాపల్లి టూర్. ఈ టూర్‌కి మొదటి నుంచి ప్రభుత్వం రకరకాల అడ్డంకులు పెట్టింది. జగన్ విశాఖ ఎయిర్‌పోర్టులో దిగారో లేదో.. జన సందోహం మొదలైంది. దారి పొడుగునా.. కాన్వాయ్ సాగుతున్నంతసేపూ.. జనం బ్రహ్మరథం పడుతున్నారు.

ఫోర్బ్స్ కుబేరుల జాబితా… దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ముకేశ్ అంబానీ

భారత్‌లోని 100 మంది సంపన్నుల ఫోర్బ్స్ జాబితాలో ముకేశ్‌ అంబానీ మొదటి స్థానం సొంతం చేసుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తర్వాత 92 బిలియన్‌ డాలర్లతో గౌతమ్ ఆదానీ రెండో స్థానంలో ఉన్నారు. ఓపీ జిందాల్‌కు చెందిన సావిత్రి జిందాల్ 40 బిలియన్‌ డాలర్లతో మూడోస్థానంలో, టెలికా దిగ్గజం సునీల్‌ మిట్టల్‌ 34 బిలియన్‌ డాలర్లతో నాలుగో స్థానంలో, టెక్‌ బిలియనీర్‌ శివ నాడార్‌ 33 బిలియన్‌ డాలర్లతో ఐదో స్థానంలో నిలిచారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON