loader

జూబ్లిహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ – అధికారికంగా ప్రకటించిన ఏఐసిసి

జూబ్లిహిల్స్ ఉపఎన్నికకు అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మొదటి నుంచి నవీన్ యాదవ్ ను అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. హైకమాండ్ అంగీకరించింది. జూబ్లిహిల్స్ లో చిన్న శ్రీశైలం యాదవ్ పేరు తెలియని వారు ఉండరు. సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయనంటే భయంతో కూడిన గౌరవం ఇస్తుంది. అలాంటి ఇమేజ్ ఉన్న ఆయన కుమారుడే నవీన్ యాదవ్. బస్తీల్లో పట్టు ఉన్న కుటుంబం. ముస్లిం వర్గాల్లోనూ […]

రామజన్మభూమిలో దక్షిణాది లెజెండ్స్ విగ్రహాలు..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల పర్యటన కోసం అయోధ్యకు చేరుకున్నారు. అక్కడ ఆమెకు సంప్రదాయ వాయిద్యాల సంగీతంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి దక్షిణ భారతదేశానికి చెందిన ముగ్గురు గొప్ప సంగీత విద్వాంసులు – త్యాగరాజ స్వామి, పురందరదాసు, అరుణాచల కవి – విగ్రహాలను ఆవిష్కరిస్తారు. బృహస్పతి కుండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాలు భారతీయ సంగీతం, భక్తి, కళల లోతైన మూలాలకు […]

మిస్రీ బజార్‌లో భారీ పేలుడు..పేలిపోయిన రెండు స్కూటర్లు..ఐదుగురికి సీరియస్!

ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని మెస్టన్ రోడ్‌లోని మిస్రీ బజార్‌లో బుధవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి రెండు స్కూటర్లు చెల్లాచెదురయ్యాయి. దీంతో మిస్రీ మార్కెట్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఉర్సులా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ సంఘటనపై పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. పేలుడుకు గల కారణం ఇంకా […]

అమిత్‌ షా ప్రధానిగా వ్యవహరిస్తున్నారు.. మోదీ జాగ్రత్తగా ఉండాలి: మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపై ఆమె మండిపడ్డారు. ప్రధాని మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోదీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.అమిత్‌ షాను ‘యాక్టింగ్ పీఎం’ అని అభివర్ణించారు. ప్లాసీ యుద్ధంలో నవాబ్ సిరాజ్ ఉద్ దౌలాను మోసం చేసిన 18వ శతాబ్దపు బెంగాల్ సైనిక జనరల్ మీర్ జాఫర్‌తో అమిత్‌ షాను మమతా బెనర్జీ పోల్చారు.

యూజీసీ నెట్ డిసెంబర్ 2025 రిజిస్ట్రేషన్ షురూ..

యూజీసీ నెట్ డిసెంబర్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారికంగా ప్రారంభించింది. దేశంలోని యూనివర్శిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్, జూనియర్ రీసెర్ట్ ఫెలోషిప్ కోసం అర్హతను సాధించేందుకు జాతీయ స్థాయిలో ఈ పరీక్ష నిర్వహించనుంది. నెట్ డిసెంబర్ 2025 కోసం అధికారిక వెబ్‌సైట్‌ ugcnet.nta.ac.inలో రిజిస్ట్రేషన్ విండోను తెరిచారు. అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్ 7, 2025 రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కోనసీమ ఘటనపై జిల్లా కలెక్టర్‌ సంచలన వ్యాఖ్యలు

కోనసీమ ఘటనపై జిల్లా కలెక్టర్‌ సంచలన వ్యాఖ్యలు ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌ మహేశ్‌కుమార్‌ స్పందించారు. వారం క్రితమే బాణసంచా తయారీ కేంద్రాన్ని స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పరిశీలించి అన్ని రక్షణ చర్యలు ఉన్నట్లు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. అగ్నిప్రమాద నివారణ పరికరాలను గోదాము యజమానులు సక్రమంగా వినియోగించారా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామన్నారు.

కల్తీ లిక్కర్‌తో మరణాలంటూ ఫేక్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు : సీఎం

అన్నమయ్య జిల్లాలో కల్తీ లిక్కర్ వ్యవహారంలో తీసుకున్న చర్యలను, దర్యాప్తు వివరాలను అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వివరించారు. రాష్ట్రం అంతటా కల్తీ లిక్కర్ అని తప్పుడు ప్రచారంతో ప్రజలను భయపెడుతున్నారని.. ప్రతి మూడు బాటిల్స్‌లో ఒక బాటిల్ కల్తీ లిక్కర్ బాటిల్ ఉందని ఫేక్ ప్రచారం చేస్తున్నారని సీఎం అన్నారు. వైసీపీ నేతల రాజకీయ కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేయాలని,తప్పుడు ప్రచారం అని తేలితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని  సీఎం చద్రబాబు నాయుడు సూచించారు.

కోల్డ్ సిరప్ కేసు.. మరో ముగ్గురు చిన్నారుల మృతి

మధ్యప్రదేశ్‌లో దగ్గుసిరప్ మరణాలు కొనసాగుతున్నాయి. 24 గంటల్లో మరో ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మధ్యప్రదేశ్ లో కాఫ్ సిరప్ మరణాలు 20 కి చేరాయి. చింద్వారాలో 17 మంది, పంధుర్నాలో ఒకరు , బేతుల్‌లో ఇద్దరు చనిపోయారు. మహారాష్ట్ర లోని నాగపూర్‌లో ఐదుగురు పిల్లలు ఇప్పటికే ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ కేసులో దగ్గుమందు సిరప్ కంపెనీ యజమానిని అరెస్టు చేయనున్నారు. ఆయనను పట్టుకోవడానికి రెండు బృందాలు చెన్నై, కాంచీపురం చేరుకున్నాయి.

సంక్షేమ గురుకులాలకు తాళాలు వేసే దుస్థితి దుర్మార్గం: కెటిఆర్

యావత్ దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణ సంక్షేమ గురుకులాలకు అద్దె బకాయిలు పేరుకుపోయి, చివరికి భవనాలకు తాళాలు వేసే దుస్థితి రావడం అత్యంత దుర్మార్గమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రంగా విమర్శించారు. గురుకులాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థత, చేతకానితనానికి నిదర్శనమని మండిపడ్డారు.

జీమెయిల్‌కు గుడ్‌బై.. జోహో మెయిల్‌కు అమిత్ షా..

అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టే విధంగా భారత్ తన స్వదేశీ ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది. కేంద్ర మంత్రి అమిత్ షా అమెరికన్ కంపెనీ Gmail నుండి భారతీయ Zoho Mail ‌కు మారినట్టు బుధవారం ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ‘స్వదేశీ ఉత్పత్తుల వినియోగం’ పిలుపు నేపథ్యంలో చోటు చేసుకుంది. అమిత్ షా తన కొత్త ఇమెయిల్ చిరునామా amitshah.bjp@zohomail.in అని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ Xలో ప్రకటించారు. .

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON