loader

ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త

ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైలు శుభవార్త చెప్పింది. రాత్రివేళ సమావేశాలు, ఆఫీస్ పనులతో ఆలస్యమైనా ఇక ఆందోళన అవసరం లేదు. హైదరాబాద్ మెట్రో ఇప్పుడు వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 11:45 గంటల వరకు చివరి రైలు నడవనుందని స్పష్టం చేసింది. దీంతో ప్రయాణికులు ఇక తొందరపడకుండా సురక్షితంగా, సౌకర్యంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని తెలిపింది. రాత్రి వేళల్లో కూడా ప్రయాణికుల భద్రత కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ట్వీట్‌లో పేర్కొంది.

మలయాళ సూపర్ స్టార్ కు అరుదైన గౌరవం

మలయాళ సినీ ప్రపంచానికి గర్వకారణంగా నిలిచే సూపర్ స్టార్ మోహన్లాల్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది చేతుల మీదుగా ఆయన “COAS కమండేషన్ కార్డ్” (Chief of Army Staff Commendation Card) స్వీకరించారు. ఈ పురస్కారం సాధారణంగా దేశ రక్షణ, సేవా విభాగం లేదా సైన్యానికి విశిష్టమైన సేవలు అందించిన వారికి మాత్రమే ఇవ్వబడుతుంది.

విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అన్ని కార్యక్రమాలు జోహో ఆఫీస్ సూట్‌ ద్వారానే..!

స్వదేశీ డిజిటల్ సాధనాలను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. తన అధికారులందరినీ అధికారిక వ్యవహారాల కోసం జోహో ఆఫీస్ సూట్‌ను ఉపయోగించాలని ఆదేశించింది. ఇది స్వదేశీ డిజిటల్ స్వావలంబన వైపు ఒక ప్రధాన అడుగుగా పరిగణించడం జరుగుతుంది. ఈ ప్లాట్‌ఫామ్ కంపెనీలు సంక్లిష్టమైన సెటప్ లేదా గణనీయమైన ఓవర్‌హెడ్ లేకుండా మొత్తం వర్క్‌ఫ్లోను డిజిటల్‌గా నిర్వహించడానికి అనుమతిస్తుంది. జోహో.. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజాలకు నమ్మకమైన ప్రత్యామ్నాయంగా మారిపోయింది.

సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ లోగో ఆవిష్కరణ..

సాంస్కృతిక వారసత్వం, సంచార జాతుల ప్రజలు ఉండే ప్రాంతంలో సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పడుతుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. అత్యుత్తమ రీసెర్చ్ యూనివర్సిటీగా సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిలుస్తుందని.. ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు.. మంగళవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ధర్మేంద్ర ప్రధాన్‌ సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లోగోను ఆయన ఆవిష్కరించారు..

వైఎస్ జగన్ అనకాపల్లి పర్యటనపై ఆంక్షలు…రోడ్డు ప్రయాణానికి బ్రేక్…

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా పర్యటనకు పోలీసుల ఆంక్షలు విధించారు.అక్టోబర్ 9న వైఎస్ జగన్ అనకాపల్లి జిల్లా మాకరవంలో మెడికల్ కాలేజీని పరిశీలించనున్నారు. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి మాకవరపాలెం వరకు సుమారు 63 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గంలో ప్రయాణించేందుకు వైసీపీ నేతలు పోలీసుల అనుమతి కోరారు. అయితే ఈ దరఖాస్తును జిల్లా పోలీసులు తిరస్కరించారు. కేవలం హెలికాప్టర్‌లో మాత్రమే పర్యటనకు రావాలని విశాఖపట్నం సీపీ శంఖబ్రత బాగ్చి స్పష్టం చేశారు.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు.. 15 మంది మృతి

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. బిలాస్‌పూర్ జిల్లాలో ప‌ర్యాట‌కుల బ‌స్సుపై కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. దీంతో బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న 15 మంది ప‌ర్యాట‌కులు ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను అంబులెన్స్‌లో ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. మృతుల్లో ఇత‌ర రాష్ట్రాల వారు ఉన్న‌ట్లు స‌మాచారం.

క్వారీలో పిడుగు పాటు..ముగ్గురి మృతి, మరో నలుగురికి గాయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని జంగలపాడు రాజయోగి క్వారీలో విషాద ఘటన జరిగింది. ఆకస్మికంగా పిడుగు పడటంతో ముగ్గురు కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. చీకటి కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకాలు కలిగాయి. రాజయోగి క్వారీలో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్న వలస కూలీలు. పిడుగు పడే సమయంలో కూలీలు బహిరంగ ప్రదేశంలో పనిచేస్తుండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్ పై తొలిసారి ఆందోళనలో పాల్గొనున్న జగన్!

ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్‌లో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వైసీపీ ఇప్పుడు ఆందోళన బాట పడుతోంది. ప్రజలకు మేలు చేసే కాలేజీలను ప్రైవేటుపరం చేస్తోందని ఆరోపిస్తున్న జగన్ పార్టీ ఈ నెల పది నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. అక్టోబరు 9న నర్సీపట్నం మెడికల్‌ కాలేజీని సందర్శించబోతున్నట్టు జగన్ ప్రకటించారు. మెడికల్‌ కాలేజీల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రతి పంచాయతీ నుంచి 500 మందితో సంతకాల సేకరించాలని టార్గెట్ […]

సీనియర్ ఐపీఎస్ అధికారి వై పురాన్ కుమార్ ఆత్మహత్య..

సీనియర్ పోలీసు అధికారి, ప్రస్తుత ADGP YS పూరన్ హర్యానా రాజధాని చండీగఢ్‌లోని సెక్టార్ 11లోని తన ఇంటి నంబర్ 116లో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పోలీసు శాఖను దిగ్భ్రాంతికి గురిచేసింది. పూరన్ భార్య అమ్నీత్ పి. కుమార్, IAS అధికారిణ. పూరన్ ఆత్మహత్య విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఐపీఎస్ వై. పురన్ కుమార్ కు ఆయన పదోన్నతి, తనకు ఇష్టమైన కారును ఉపయోగించడం, గృహనిర్మాణ ఫిర్యాదులతో వార్తల్లో నిలిచారు.

బొత్స ఫ్యామిలీకి తప్పిన ప్రమాదం.. సిరిమానోత్సవంలో కూలిన వేదిక

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుటుంబానికి పెను ప్రమాదం తప్పింది. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం కన్నులపండువగా సాగుతోంది. విజయనగరంలో సిరిమానోత్సవం చూస్తుండగా వేదిక కూలింది. ఆ సమయంలో బొత్స కుటుంబం వేదికపైనే ఉంది. అయితే ఎటువంటి గాయాలు కాకుండా బొత్స ఫ్యామిలీ సురక్షితంగా బయటపడింది. కానీ ఈ ప్రమాదంలో ఎస్సై, మరో చిన్నారి గాయపడ్డారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON