loader

మన సమాజంలో ఇలాంటి ఘటనలకు చోటు లేదు.. ప్రధాని మోదీ

చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా జస్టిస్‌ గవాయ్‌పై ఓ లాయర్‌ షూ విసరడం తీవ్ర సంచలనం రేపింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ పైకి బూటు విసిరేందుకు యత్నించిన ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఆయనపై జరిగిన దాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసిందని.. మన సమాజంలో ఇటువంటి దూషణకరమైన చర్యలకు చోటు లేదు.. ఇది పూర్తిగా ఖండించదగినది.. అంటూ ప్రధానమంత్రి మోదీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గవాయ్ తో […]

వరల్డ్ కప్ వేళ కీలక నిర్ణయం.. మిథాలీ పేరుతో వైజాగ్ స్టేడియంలో స్టాండ్‌..!

భారత మహిళల క్రికెట్‌కు వన్నె తెచ్చిన మిథాలీ రాజ్‌ కు అరుదైన గౌరవం లభించింది. కెప్టెన్‌గా చెరగని ముద్రవేసిన ఈ వెటరన్ ప్లేయర్‌ పేరును స్టాండ్‌కు పెట్టాలని ఆంధ్ర క్రికెట్ సంఘం (ACA) నిర్ణయించింది. విశాఖపట్టణం స్టేడియంలో అక్టోబర్ 12 భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ సమయంలోనే మిథాలీ స్టాండ్ ప్రారంభించాలని ఏసీఏ తీర్మానించింది. ఆమెతో పాటు దిగ్గజ క్రికెటర్ రవి కల్పన పేరుతో కూడా ఒక స్టాండ్‌ను ఓపెన్ చేయనున్నట్టు ఏసీఏ తెలిపింది.

అమెరికాకు అరుదైన ఖనిజాలను నౌకలో ఎగుమతి చేసిన పాకిస్తాన్ సర్కార్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను ప్రసన్నం చేసుకునేందుకు పాకిస్తాన్ అరుదైన ఖనిజ సంపద దోచిపెట్టే కార్యక్రమం మొదలైంది. పాకిస్తాన్ లోని అరుదైన భూమి, కీలక ఖనిజాలతో కూడిన మొదటి నౌక అమెరికాకు బయలు దేరింది. పాకిస్తాన్ లో ఖనిజ వనరులను అన్వేషించేందుకు, ఓ అమెరికన్ కంపెనీతో సంతకం చేసిన ఒప్పందానికి అనుగుణంగా ఈ అరుదైన ఖనిజసంపద ఎగుమతి అవుతోంది. అమెరికాకు రవాణా అయిన వాటిలో యాంటీ మోనీ, రాగి గాఢత, నియోడైమియం, ప్రసోడైమియం వంటి అరుదైన […]

విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన ముప్పు

టాలీవుడ్ హీరో విజయ్‌ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆదివారంతన స్నేహితులతో పుట్ట పర్తికి వెళ్లాడు విజయ్ దేవరకొండ. సోమవారం (అక్టోబర్ 06) హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా వారి కారును.. బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. అయితే ఈ ప్రమాదం నుంచి విజయ్‌ దేవరకొండ సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదం తర్వాత విజయ్ తన స్నేహితుడి కారులో హైదరాబాద్‌ వెళ్లిపోయాడు.

పారా అథ్లెటిక్స్‌లో భారత్ రికార్డు.. ప్రశంసలు కురిపించిన నీతా అంబానీ

భారత్ ఆతిథ్యమిచ్చిన 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో మన దేశ క్రీడాకారులు న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో భారత పారా అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, 22 పతకాల (6 స్వర్ణాలు, 9 రజతాలు, 7 కాంస్యాలు) సాధించి చరిత్ర సృష్టించారు. పారా అథ్లెటిక్స్ ఘనత “సమ్మిళితం, పట్టుదల, ప్రతిభకు నిదర్శనం” అని నీతా అంబానీ భారత బృందాన్ని ప్రశంసించారు. వారి పట్టుదల, ధైర్యం… మానవ స్ఫూర్తి యొక్క గొప్ప […]

ముంబైలో నారా లోకేష్- టాటా చైర్మన్ సహా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ !

ఏపీ మంత్రి నారా లోకేష్ ముంబైలో పర్యటించారు. టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌తో సమావేశమయ్యారు. టీసీఎస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభోత్సవానికి చంద్రశేఖరన్‌ను లోకేష్ఆహ్వానించారు. ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని చంద్రశేఖరన్‌ను కోరారు.ఈవీల ఛార్జింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కో రూఫ్‌టాప్‌ సోలార్‌ అభివృద్ధిలో కలిసి పనిచేయాలని కోరారు.అంతకు ముందే ఈఎస్ఆర్ గ్రూప్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా హెడ్ తోనూ వారి కార్యాలయంలో నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. అలాగే లాజిస్టిక్స్ గ్లోబల్ లీడర్ గా ఉన్న ట్రాఫిగురా […]

రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆర్టీఐ కొత్త లోగో

తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ కు కొత్త లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా, ఆర్టీఐ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది.ఈ లోగో ఆవిష్కరణను 20వ జాతీయ సమాచార హక్కు వారోత్సవాల సందర్భంగా నిర్వహించారు. రాష్ట్రంలో పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలనకు ఈ కొత్త లోగో ప్రతీకగా నిలుస్తుందని అధికారులు తెలిపారు.

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమైన పవన్ కల్యాణ్‌..

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమయ్యారు. ఈ నెలలోనే అన్ని జిల్లాల్లో పర్యటించాలని భావిస్తున్నారు. ఈ మేరకు పవన్‌ కల్యాణ్‌ షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి పవన్‌ కల్యాణ్‌ పర్యటన ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పిఠాపురం, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వరుస పర్యటనలు చేయనున్నట్లు సమాచారం.  ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం ఆ ప్రాంత జన సైనికులు, వీర మహిళలు, నాయకులతో […]

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల..

బిహార్‌ అసెంబ్లీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్‌ తేదీలు, ఇతర వివరాలను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ వెల్లడించారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు ఈ నెల 13వ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 22న నామినేషన్లను స్క్రుటినీ […]

ఆంధ్రప్రదేశ్‌లో.. ఆ గోడౌన్‌లో భారీగా కల్తీ మద్యం!

ఏపీలో నకిలీ మద్యం కేసు కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధానికి కూడా కారణమవుతోంది. నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అద్దేపల్లి జనార్ధన్ మీద కేసు నమోదైంది. ఇబ్రహీంపట్నంలోని ఓ గోడౌన్‌లో భారీగా కల్తీ మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటివే మరికొన్ని యూనిట్లు ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. గోడౌన్‌లో భారీగా మద్యం బాటిళ్లు లభ్యం కావటంతో.. కొండపల్లి మున్సిపాలిటీతో పాటు ఇబ్రహీంపట్నం మండల […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON